పెట్రోల్ బంకుల్లో కొత్త సిస్టమ్.. ఈ సర్టిఫికెట్ లేదంటే మీ వాహనాలకు రూ. 10,000 ఫైన్
రోడ్డుపై వాహనాలు నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్, RC, PUC ఇంకా సంబంధిత డాక్యుమెంట్లు తప్పనిసరి. లేదంటే జరిమానా తప్పదు. అంతేకాకుండా ట్రాఫిక్ నిబంధనల ఉల్లఘంనలకు పాల్పడితే చలాన్లు విధించడం చూస్తూనే ఉంటాం. అయితే ఇకపై వాహనదారులు ఈ సర్టిఫికెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం సాధ్యం కాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
రోడ్డు భద్రతా నిబంధనలకు సంబంధించి పూణే పోలీసులు ఇప్పుడు కొత్త వ్యవస్థను తీసుకువచ్చారు. అదేంటంటే చెల్లుబాటు అయ్యే పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికెట్ లేకపోతే మీ వాహనంపై ఆటోమేటిక్‌గా చలాన్ జారీ అవుతుంది. చెల్లుబాటయ్యే పీయూసీ లేని వాహనాలకు రూ. 10,000 జరిమానా విధిస్తుంది.

ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే.. పెట్రోల్ బంకుల వద్ద అమర్చబడిన కెమెరాల ద్వారా ఇలా పీయూసీ లేని వాహనాలను గుర్తించవచ్చు. ఈ కెమెరాలు వాహనం రిజిస్ట్రేషన్ నంబర్లను ట్రాక్ చేస్తాయి. ఈ విధానం ద్వారా పోలీసులు పెట్రోల్, డీజిల్ వాహనాలను పర్యవేక్షిస్తారు. అప్పుడు పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికేట్ ఆ వాహనం నంబర్‌పై ఉందో లేదో తనిఖీ చేసుకోవచ్చు.
వాహనం చెల్లుబాటు అయ్యే PUCని కలిగి ఉంటే, అది సురక్షితమైనదిగా కెమెరాలు గుర్తిస్తాయి. కానీ సర్టిఫికేట్ గడువు ముగిసినట్లయితే, వాహన యజమాని రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌పై నోటిఫికేషన్‌ను అందుకుంటారు. ఆ వాహనంపై రూ. 10,000 జరిమానా విధించడమే కాకుండా, ఈ వాహనాల రిజిస్ట్రేషన్‌ను కూడా బ్లాక్‌లిస్ట్‌లో ఫ్లాగ్ చేస్తుంది.

ఈ వ్యవస్థను అమలు చేయడానికి పెట్రోల్ పంప్‌ల వద్ద AI కెమెరాలు అమరుస్తారా లేక.. కెమెరాలు ఆయా వాహనాల వివరాలను మాన్యువల్‌గా పర్యవేక్షిస్తాయా అనే స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు. ఈ వాహనాల డ్రైవర్లు లేదా యజమానులు వారి PUC సర్టిఫికేట్ గడువు ముగియబోతున్నట్లయితే లేదా ఇప్పటికే గడువు ముగిసినట్లయితే వారి ఫోన్‌లలో నోటిఫికేషన్‌లు లేదా హెచ్చరికలు అందుకుంటారు.
కాగా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 726 AI కెమెరాలను ఏర్పాటు చేసింది. ప్రమాదాల సంఖ్య, రోడ్డు ప్రమాదాల్లో మరణాల రేటును తగ్గించేందుకు 'సేఫ్ కేరళ' పథకంలో భాగంగా వీటిని ఏర్పాటు చేశారు.

ఉల్లంఘనలను పర్యవేక్షించే ప్రక్రియను ఆటోమేట్ చేయడానికి ఈ AI కెమెరాలు పనిచేస్తాయి. ఇవి ఉల్లంఘనలను గుర్తించి కంట్రోల్ రూంకి ఫొటోలను పంపిస్తాయి. అక్కడ అధికారులు ఫొటోలను పరిశీలించిన తర్వాత చలాన్ జారీ చేస్తారు. ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత కేరళలో రోడ్డు ప్రమాదాలు, మరణాల రేటు తగ్గినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
కాగా పూణె పోలీసులు అమలు చేస్తున్న ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది వాహనాల ఫిట్‌నెస్‌ను పర్యవేక్షించడమే కాకుండా మరియు వాటి వల్ల కలిగే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి దోహదపడుతుంది. పీయూసీ అర్హత లేని వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించడంలో కూడా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








