Just In
- 12 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 13 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 13 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 15 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- Lifestyle
ఆదివారం దినఫలాలు : వ్యాపారులు ఈరోజు తమ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బైక్ డ్రైవ్స్ చేసిన యువతికి 20,500 జరిమానా, ఎందుకో మీరే చూడండి
భారతదేశంలో ఇప్పటికి అనేక ప్రాంతాల్లో కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇంటి నుంచి బయటికి రాలేకపోతున్నారు. కానీ కొంతమంది ఇదే అదునుగా చేసుకుని అనవసరంగా ఇంటి నుండి బయట తిరుగుతున్నారు. అనవసరంగా ఇంటి నుంచి బయటకు రావడమే కాకుండా లాక్ డౌన్ నియమాలను కూడా ఉల్లంఘిస్తున్నారు.

కరోనా లాక్ డౌన్ లో నిబంధనలను ఉల్లంఘించిన వీడియోలు సోషల్ నెట్వర్క్ లో అప్లోడ్ చేయబడ్డాయి. ఈ వీడియోలు కొన్ని సార్లు వారికీ ప్రమాదంగా కూడా మారవచ్చు. ఈ సంఘటన గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

హెల్మెట్ లేకుండా మోడిఫైడ్ బైక్ నడుపుతున్న బాలికపై కేరళ రాష్ట్ర రవాణా శాఖ చర్యలు తీసుకుంది. ఈ వీడియో గత కొన్ని రోజులుగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వైరల్ అవుతోంది. వీడియో చూసి బాలికపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.
MOST READ:కొడుకు ఇచ్చిన ఐడియాతో తండ్రి సృష్టించిన ఎలక్ట్రిక్ సైకిల్ ; చూసారా..!

పోలీసులు బాలిక ఇంటికి వెళ్లి ఆమెకు రూ. 20,500 జరిమానా విధించడమే కాకుండా, ఆ బాలిక లైసెన్స్‌ను కూడా సస్పెండ్ చేయాలని సిఫారసు చేశారు. పోలీసుల దర్యాప్తులో బాలికకు స్కూటర్ నడపడానికి లైసెన్స్ ఉందని తేలింది.

గేర్ లేకుండా బైక్ నడుపుతున్నందుకు ఈ అమ్మాయికి రూ. 10,000, బైక్ మాడిఫై చేసినందుకు రూ. 10,000, హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్నందుకు రూ. 500 జరిమానా విధించారు. బాలికకు మొత్తం రూ. 20,500 జరిమానా విధించారు.
MOST READ:ఒక నెలరోజుల తరువాత పట్టుబడ్డ లంబోర్ఘిని సూపర్ కార్ : ఎలాగో తెలుసా !

ఇక్కడ మనం వీడియో చూడగలితే ఈ అమ్మాయి హెల్మెట్ లేకుండా నడవడం చూడవచ్చు. వీడియోలోని ఒక భాగం మరొక బైక్ డ్రైవర్‌తో కొన్ని స్టంట్లు చేయడం కూడా చూడవచ్చు, ఈ వీడియోను ఒక యూజర్ పోలీసులకు పంపాడు.

ఈ ఫిర్యాదు తరువాత, పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, త్వరలోనే ఈ అమ్మాయిని గుర్తించారు, ఆ తర్వాత వారు నేరుగా ఆమె ఇంటి వెలుపల చేరుకుని ఆమెకు జరిమానా విధించారు. ఈ వీడియోలో ఈ అమ్మాయి యెల్లో యమహా బైక్ నడుపుతున్నట్లు చూడవచ్చు.
MOST READ:కొడుకుని కలవడానికి 1800 కి.మీ ప్రయాణించిన నిరుద్యోగ మహిళ ; ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు

కొన్ని వారాల క్రితం, బెంగళూరులోని హోసూర్ రోడ్లో 300 కిలోమీటర్ల వేగంతో బైక్ నడుపుతున్న వీడియోను బెంగళూరు నివాసి అప్లోడ్ చేశాడు. వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఆ వ్యక్తిని ట్రాక్ చేసి చర్యలు తీసుకున్నారు.