టికెట్ లేకుండా వందే భారత్ రైలు ఎక్కిన పోలీసు ఇన్‌స్పెక్టర్.. చెమటలు పట్టించిన టీటీఈ, వైరల్ అవుతున్న వీడియో
వందేభారత్ రైళ్ల రాకతో రైల్వే శాఖలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వేగవంతమైన ప్రయాణంతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. రైలు, విమానం లేదా బస్సు వేటిలో వెళ్లాలన్నా టికెట్ తప్పనిసరి. అది ఎంతటి వారికైనా సరే.. కానీ ఇక్కడ ఓ ప్రభుత్వ అధికారి టికెట్ లేకుండా వందే భారత్ రైలులో ప్రయాణించాడు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే వందే భారత్ సెమీ హై స్పీడ్ రైళ్లు సేవలందిస్తున్నాయి. అంతే కాకుండా ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా ప్రతి నెలా కొత్త రైళ్లను ప్రారంభిస్తున్నారు. ఇప్పటివరకు పగటి పూట మాత్రమే ఈ రైళ్లు నడుస్తుండగా.. త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి.

ఈ నేపథ్యంలో ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్ టికెట్ తీసుకోకుండా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. టికెట్ చెకింగ్‌లో TTE (Traveling Ticket Examiner) ఇన్‌స్పెక్టర్‌ను టికెట్ అడిగారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పూర్తి సమాచారాన్ని ఈ కథనంలో చదవండి.
వీడియోలో ఇన్‌స్పెక్టర్ సీటులో కూర్చుండటాన్ని చూడవచ్చు. కాసేపటికి టీటీఈ వచ్చి అడగ్గా టిక్కెట్టు లేదని సమాధానమిచ్చారు. తాను వెళ్లాల్సిన రైలును కొన్ని కారణాల వల్ల మిస్ అయినట్లు తెలిపారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రైలు ఎక్కానని.. ప్రయాణానికి అనుమతించాలని కోరతాడు. దీంతో టికెట్ లేకుండా రైలులో ప్రయాణించేందుకు అనుమతి లేదని టీటీఈ ఇన్‌స్పెక్టర్‌కు సమాధానమిస్తారు.

టికెట్ లేనప్పుడు ఈ రైలు ఎందుకు ఎక్కారని.. అదే రైలులో వెళ్లాల్సి ఉంటుందని టీటీఈ సూచించారు. రైలు మిస్ అయితే బస్సులో వెళ్లాల్సి ఉందని.. ఈ రైలులో ప్రయాణించడానికి అనుమతి లేదని సూటిగా చెబుతారు. ఈ సంఘటన లక్నోలోని వందేభారత్ రైలులో చోటుచేసుకున్నట్లు సమాచారం.
టికెట్ లేకపోవడంతో తదుపరి స్టేషన్‌లో టీటీఈ, పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను దింపినట్లు సమాచారం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోపై అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. ఇది చాలా అభినందనీయమైన పని అని.. రూల్స్ అందరికీ ఒకేలా ఉండాలని.. టీటీఈ తన బాధ్యతను నిర్వర్తించారని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ ప్రకారం, ప్రతి ఏటా 7000 మంది సిబ్బంది దుష్ప్రవర్తన కారణంగా పోలీసు శాఖ నుండి తొలగించబడ్డారని ఓ నెటిజన్ పేర్కొన్నారు. దానికి ఇదే సాక్ష్యమని.. టీటీఈ చేసిన పని అభినందనీయమన్నారు. ఇంకా ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు.
కాగా ఇటీవల తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో టికెట్ లేకుండా ఓ వ్యక్తి ప్రయాణించిన సంఘటన చోటుచేసుకుంది. అధికారుల నుంచి తప్పించుకునేందుకు టాయిలెట్‌లో సిగరెట్ కాల్చుతూ ఉన్నాడు. ఈ సంఘటనతో రైలులో అలారం మోగడంతో ప్రయాణికులు కాసేపు ఆందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు అధికారులకు చిక్కాడు.

ఆ వ్యక్తి టికెట్ లేకుండా ప్రయాణించి, రైలులో టాయిలెట్ తలుపు వేసి ఉంటే, ఎటువంటి సమస్య ఉండేది కాదేమో.. కానీ అక్కడే సిగరెట్ తాగాడు. వెంటనే ఫైర్ అలారం మోగింది. ఆ వెంటనే ఆటోమేటిక్ మంటలను ఆర్పే పరికరం 'ఏరోసోల్' మిశ్రమం స్ప్రే అయింది. వెంటనే రైలు సిబ్బంది టాయిలెట్ కిటికీ అద్దాలను పగులగొట్టగా అతడు దాక్కున్నట్లు గుర్తించారు. అధికారుల విచారణలో అతను టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications








