సినిమాను తలపించే సీన్.. ఎమర్జెన్సీ వార్డ్‌లోకి పోలీస్ వాహనం - వీడియో వైరల్
రిషికేశ్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులోకి మహీంద్రా బొలెరో దూసుకెల్తూ కనిపించింది. ఇంతకీ ఎమర్జెన్సీ వార్డులోకి మహీంద్రా యొక్క బొలెరో కారు ఎందుకు వెళ్ళింది? దీనికి వెనుక ఉన్న కారణం ఏంటి అనే వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.
నివేదికల ప్రకారం.. రిషికేశ్‌లోని ఎయిమ్స్ వైద్యశాల ఆపరేషన్ థియేటర్‌లో నర్సింగ్ అధికారి డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇది తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగానే మహీంద్రా బొలెరో కారును ఎమర్జెన్సీ వార్డు మధ్యలో నడిపారు. ఈ ఘటన అక్కడి రోగులను కొంత భయాందోళనకు గురి చేసింది. కానీ కొంత సేపటికి అంతా ప్రశాంతంగా ముగిసింది.

నిజానికి మహీంద్రా బొలెరో కారు ఆ ఎమర్జెన్సీ వార్డులో ప్రయాణించడానికి స్థలం లేదు, కాబట్టి రోగులన్న స్టెచర్లకు కొంత పక్కకు జరిపినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ కారు పోలీస్ అధికారులకు సంబంధించినదిగా తెలుస్తోంది. ఇక్కడ కారు నిందితున్న అరెస్ట్ చేయడానికి వెళ్తుందా? లేక, అరెస్టు చేసి బయటకు తీసుకు వస్తుందా అనేది స్పష్టంగా తెలియడం లేదు. మొత్తానికి ఇది ఓ సినిమాను తలపించే మాదిరిగా ఉంది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఓ పోలీస్ అధికారి ముందు వెళ్తున్నారు, ఆయన వెనుక సెక్యూరిటీ గార్డ్స్ సిబ్బంది అది రావడానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో మీద నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు పోలీసులను మెచ్చుకుంటున్నారు. మరికొందరు ఎమర్జెన్సీ వార్డులోకి కారు వెళ్లడం కరెక్ట్ కాదని చెబుతున్నారు.

ఒక రకంగా చూస్తే పోలీసుల కర్తవ్య నిర్వహణను తప్పకుండా ప్రసంసించాల్సిందే.. అయితే అది హాస్పిటల్ కాబట్టి, కారును లోపలకి పోనివ్వకుండా ఉంటే బాగుండేదని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కారు లోపలికి వెళ్లడం వల్ల అక్కడున్న పేషంట్స్ కొంత ఇబ్బందికి, భయాందోళనలకు గురయ్యారని తెలుస్తోంది. మొత్తానికి నిందితున్న పట్టుకోవడానికి పోలీసులు ఈ చర్యకు పాల్పడినట్లు అర్థమవుతోంది. బహుశా వైద్యశాల ఎమర్జెన్సీ వార్డులోకి కారు వెళ్లడం ఇదే మొదటిసారి కావొచ్చు.
మహిళా వైద్యురాలిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హాస్పిటల్ యాజమాన్యం కూడా ఆ డాక్టరును విధుల నుంచి సస్పెండ్ చేసింది. మహిళా డాక్టరుపై లైంగిక దాడికి ప్రయత్నించిన నర్సింగ్ అధికారి ఆమె మొబైల్ ఫోన్‌కు అసభ్యకరమైన సందేశాలను పంపినట్లు తెలుస్తోంది. పోలీసులు అతని మీద వేగంగా చర్యలు తీసుకోవడం ప్రశంసనీయమని పలువురు నెటిజన్లు చెబుతున్నారు.
మహీంద్రా బొలెరో
భారతీయ మార్కెట్లో ఒకప్పటి నుంచి అత్యధిక అమ్మకాలు పొందుతున్న మహీంద్రా బొలెరో.. కేవలం ప్రజల వినియోగానికి మాత్రమే కాకుండా, పోలీస్ ఫ్లీట్‌లో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా దీనిని మోడిఫైడ్ చేసి అంబులెన్సులుగా కూడా ఉపయోగిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే మహీంద్రా బొలెరో వివిధ రంగాల్లో కూడా అత్యంత ఆధారం పొందుతోందని అర్థమవుతోంది. ప్రస్తుతం మహీంద్రా బొలెరో మాత్రమే కాకుండా బొలెరో నియో పేరుతో కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








