రూ.1.5 కోట్ల కారును సీజ్ చేసిన పోలీసులు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!

ఒక కారును ఉపయోగిస్తున్నామంటే.. దానికి తప్పకుండా రిజిస్ట్రేషన్ ప్లేట్ లేదా నెంబర్ ప్లేట్ (Number Plate) ఉండాలి. నెంబర్ ప్లేట్ లేకపోయినా.. నకిలీ నెంబర్ ప్లేట్స్ ఉపయోగించినా చట్టరీత్యా నేరం. రిజిస్ట్రేషన్ ప్లేట్ లేకుండా కనిపించే కార్లను పోలీసులు లేదా సంబంధిత అధికారులు సీజ్ చేసే అవకాశం ఉంది. ఆ తరువాత సదరు వాహన వినియోగదారుడు తప్పకుండా భారీమొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి సంఘటనే ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఎక్కడ జరిగింది? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 400డీ కారు నెంబర్ ప్లేట్ లేని కారణంగా సీజ్ చేయబడింది. ఈ ఘటన ఒడిశాలో జరిగినట్లు తెలుస్తోంది. తెల్లని రంగంలో కనిపించే బెంజ్ కారుకు నెంబర్ ప్లేట్ లేదు. ఎలాంటి రిజిస్ట్రేషన్ ప్లేట్ లేకుండా కారును నడుపుతున్న డ్రైవర్‌ను పోలీసులు కారణం అడిగారు. అతడు చెప్పలేకపోయాడు. దీంతో పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు.

Police Seized Rs 1 5 Crore Mercedes Benz SUV

కారును సీజ్ చేసిన తరువాత పోలీసులు దాన్ని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నిజానికి ఈ కారు ధర మార్కెట్లో సుమారు రూ. 1.54 కోట్లు. ఇంత ఖరీదైన కారుకు నెంబర్ ప్లేట్ లేకుండా ఎందుకు డ్రైవ్ చేస్తున్నారు అనే విషయం ఇంకా వెలుగులోకి రాలేదు. అయితే ట్రాఫిక్ ఏసీపీ జయంత్ దొర స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ఎవరైనా రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండా కారును నడిపితే దాన్ని సీజ్ చేస్తామని ప్రకటించారు.

కారుకు సంబంధించిన వివరాలు, నెంబర్ ప్లేట్ ఎందుకు ఉపయోగించడం లేదు అనే వివరాలు వెల్లడించిన తరువాత మాత్రమే ఈ కారును.. యజమానికి అప్పగించడం జరుగుతుందని ఏసీపీ జయంత్ దొర అన్నారు. రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలను నడపవద్దని ఆయన ప్రజలకు సూచించారు. ఎవరైనా నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాన్ని డ్రైవ్ చేస్తే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Police Seized Rs 1 5 Crore Mercedes Benz SUV

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 400డీ

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ కార్లలో ఒకటి మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 400డీ. ఇది జర్మన్ కార్ల తయారీ సంస్థ నుంచి విక్రయించబడుతున్న 7-సీటర్ టాప్ లైన్ మోడల్. దీని ధర రూ.1.54 కోట్లు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది అద్భుతమైన డిజైన్, ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు ఉత్తమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ కారణంగానే చాలామంది ఈ లగ్జరీ కారును ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 400డీ అద్భుతమైన పనితీరును అందించడానికి 3.0 లీటర్ ఇన్‌లైన్ సిక్స్ సిలిండర్ డీజిల్ ఇంజన్‌ పొందుతుంది. ఇది 326 Bhp పవర్ మరియు 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. కాబట్టి ఈ కారు అన్ని విధాలా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్న ఇతర లగ్జరీ కార్లు

ఒడిశా పోలీసులు ఈ ఏడాది మార్చిలో అనేక లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో పోర్స్చే కయెన్, బీఎండబ్ల్యూ ఎక్స్7, మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసీ మరియు రేంజ్ రోవర్ వేలార్ వంటివి ఉన్నాయి. ఈ జాబితాలో ఆడి ఏ4, టయోటా ఇన్నోవా క్రిస్టా, రెండు హ్యుందాయ్ క్రెటా కార్లు, మారుతి సుజుకి స్విఫ్ట్, రెనాల్ట్ కైగర్, టాటా నెక్సాన్, మారుతి గ్రాండ్ విటారా మరియు టయోటా ఫార్చ్యూనర్ ఉన్నాయి.

వాహన వినియోగదారులు మద్యం సేవింగ్ కార్లను డ్రైవ్ చేస్తున్న కారణంగా.. ఈ కార్లను సీజ్ చేసుకున్నట్లు సమాచారం. సీజ్ చేసిన తరువాత ఈ కార్లన్నింటిని భువనేశ్వర్‌లోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఒడిశాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను తాగించడానికి ఈ విధంగా చేస్తున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. మద్యం సేవింగ్ ఎవరైనా కారు డ్రైవ్ చేస్తే కారును సీజ్ చేసి.. వీరి మీద తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటారు.

More from DriveSpark

Article Published On: Wednesday, May 29, 2024, 15:23 [IST]
English summary
Police seized mercedes benz suv for without registration plate
Read more on: #off beat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+