కొంప ముంచిన కొత్త పెళ్ళికొడుకు చేష్టలు!.. ఏం జరిగిందో తెలిస్తే షాకవుతారు!

జీవితంలో పెళ్లి అనేది మరిచిపోలేని అనుభూతి.. ఈ కారణంగానే చాలామంది వివాహ వేడుకలను ఎంతో ఆడంబరంగా జరుపుకుంటారు. ఇటీవల ఫ్రీ-వెడ్డింగ్ పేరుతో నిర్వహించే కొన్ని కార్యక్రమాలు అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే ఓ పెళ్ళికొడుకు పోలీసుల చేతికి చిక్కాడు.

నివేదికల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌కు చెందిన వరుడు ఒక ఎస్‌యూవీపై నిలబడి ఊరేగింపుగా వెళ్ళడానికి ప్రయతించాడు. పాపం అతని ఆశలన్నీ అడియాసలయ్యాయి. పైగా పోలీసుల చేతికి చిక్కిపోయారు. పెళ్లి దుస్తులు ధరించిన వరుడు పెళ్లి మండపానికి వెళ్తున్న సమయంలో మార్గం మధ్యలో ఫోటో షూట్ కోసం కారు మీద నిలబడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Groom Stands Car Top Police Seized Car

సహరాన్‌పూర్‌లోని భైలా గ్రామం నుంచి మీరట్‌లోని కుషావలి గ్రామంలోని తన వధువు ఇంటికి ఊరేగింపుగా వెళ్లే సమయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. వరుడు ఢిల్లీ - డెహ్రాడూన్ జాతీయ రహదారిపైన కారుపైన నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చాడు. నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకోవడం వల్ల ఆ వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. కారును సీజ్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు.

పబ్లిక్ రోడ్డు మీద కారు మీద నిలబడి ఫోటోలకు పోజులివ్వడం చట్టరీత్యా నేరం. ఈ చర్య రోడ్డుపైన ఇతర వాహనాలను కూడా ప్రమాదంలోకి పడేస్తుంది. ఈ కారణంగానే పోలీసులు కారును సీజ్ చేశారు. పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్న కారణంగా వరుణ్ణి, వారి బంధువులను, స్నేహితులను అక్కడ నుంచి పంపించేశారు. దీంతో మరో కారులో వారందరూ వివాహ వేదికకు వెళ్లినట్లు సమాచారం.

Groom Stands Car Top Police Seized Car

ఈ సంఘటనపై ఖతౌలీ సర్కిల్ ఆఫీసర్ యతేంద్ర సింగ్ మాట్లాడుతూ.. వరుడు కారు మీద నిలబడి ఫోటోలకు పోజులిస్తున్న వీడియో మాకు అందింది. దీంతో మన్సూర్‌పూర్‌ పోలీసులు NH 58 నేషనల్ హైవే మీద కారును సీజ్ చేశారు. తదుపరి విచారణ జరుగుతోందని.. ఇలాంటి చర్యల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీనికి కారణమైన వారిపైన తప్పకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇలాంటి ఘటన ఇదే మొదటిసారి కాదు..

ఆధునిక కాలంలో చాలామంది ఫ్రీ వెడ్డింగ్ పేరుతో ఇలాంటి కార్యక్రమాలు చాలానే చేస్తున్నారు. కార్లపై నిలబడి లేదా కారు బోనెట్ మీద కూర్చుని ఫోటోలు తీసుకోవడం, రూఫ్ నుంచి బయటకు వచ్చి ఫోటోలు తీయించుకోవడం వంటివి ఎక్కువవుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. వీటిపై కూడా పోలీసులు చర్యలు తీసుకోవడం జరిగింది. అయినప్పటికి ప్రతి రోజూ ఏదో ఒక మూల ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

ప్రమాద హేతువు.. చట్టరీత్యా నేరం

కార్లపైన నిలబడి ఫోటోలు తీసుకోవడం వల్ల అనుకోని ప్రమాదం జరిగితే రోడ్డుపై ప్రయాణించే ఇతరులకు కూడా ఇది ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండటం మంచిది. భారతదేశంలో ప్రతి ఏటా లక్షలమంది రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ప్రజలు కూడా నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు జరపకూడదు. అప్పుడే రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గించడం సాధ్యమవుతుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, March 15, 2024, 12:00 [IST]
English summary
Police seized up groom car and took him to the police station
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+