కార్ డ్రైవర్‌పై చెయ్యి చేసుకున్న పోలీస్.. అసలు కారణం ఏమిటో ఇక్కడ చూడండి

భారతదేశంలో ఇప్పటికి కూడా విఐపి సంస్కృతి కొనసాగుతూనే ఉంది. ఒక విఐపి అధికారికి దేశంలో ఇప్పటికి కూడా అత్యంత రక్షణను కల్పించడంలో భాగంగా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. భద్రతా చర్యలు లేకుండా వారు కాలు కూడా బయటపెట్టరు అంటే అది ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఈ భద్రత చర్యలు తీసుకునే సమయంలో సాధారణ ప్రజలు కొన్ని సార్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి సంబంధించి చాలా సంఘటనలు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇటీవల కూడా ఇలాంటి సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కార్ డ్రైవర్‌పై చెయ్యి చేసుకున్న పోలీస్.. అసలు కారణం ఏమిటో ఇక్కడ చూడండి

దేశంలో ఉన్నత స్థాయి రాజకీయ నాయకులకు మరియు సెలబ్రిటీలకు రక్షణ కల్పించడం కోసం వారి కాన్వాయ్‌లోని వాహనాలకు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా పోలీసుల ఎస్కార్ట్ ప్రొటక్షన్ కల్పిస్తారు. కొన్నిసార్లు పోలీసులు రద్దీగా ఉన్న రోడ్లను క్లియర్ చేయడానికి వాహనదారులపైన పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తారు. ఇటీవల మహారాష్ట్ర క్యాబినెట్ మంత్రి 'జితేంద్ర అవద్' తన వాహనాల కాన్వాయ్‌తో కొల్హాపూర్ నుండి భౌసింగ్‌జీ రోడ్‌కు వెళ్తున్న సమయంలో ఒక పోలీస్ అధికారి ఒక కారు డ్రైవర్ పై చెయ్యి చేసుకున్నాడు. దీనికి సంబంధించి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

కార్ డ్రైవర్‌పై చెయ్యి చేసుకున్న పోలీస్.. అసలు కారణం ఏమిటో ఇక్కడ చూడండి

ఈ వీడియోలో మీరు గమనించినట్లైతే 'జితేంద్ర అవద్' వెళుతున్న రోడ్డు మొత్తమ్ ఎక్కువ ట్రాఫిక్ తో ఉంది. ఈ కారణంగా మంత్రి కారు ట్రాఫిక్‌లో చిక్కుకుంది. మంత్రిని ఆ ట్రాఫిక్ జామ్‌ నుంచి తప్పించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇంతలోనే ఒక పోలీసు వాహనాలకు దిశానిర్దేశం చేస్తూ, మంత్రి వాహనానికి చోటు కల్పించడానికి ముందుకు పరిగెత్తడం కనిపిస్తుంది.

కార్ డ్రైవర్‌పై చెయ్యి చేసుకున్న పోలీస్.. అసలు కారణం ఏమిటో ఇక్కడ చూడండి

ఆ సమయంలో ఆ పోలీస్ అక్కడే ఉన్న మహీంద్రా బొలెరో డ్రైవర్‌ను కాన్వాయ్‌కి దారి కల్పించమని ఆదేశిస్తాడు. అయితే రోడ్డుపై స్థలం లేకపోవడంతో బొలెరో డ్రైవర్ త్వరగా ముందుకు వెళ్లలేక, బయటకు రాలేకపోయాడు. దీంతో జితేంద్ర అవద్ కాన్వాయ్ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. బొలెరోను త్వరగా బయటకు తీయకపోవడంతో అతనిపైన ఆ పోలీస్ విరుచుకుపడటమే కాకుండా.. డ్రైవర్‌పై చెయ్యి చేసుకుంటాడు. ఆ తరువాత మంత్రి కాన్వాయ్ ముందుకు వెళ్ళిపోతుంది.

కార్ డ్రైవర్‌పై చెయ్యి చేసుకున్న పోలీస్.. అసలు కారణం ఏమిటో ఇక్కడ చూడండి

ఇక్కడ మీరు మంత్రి కాన్వాయ్ లో సైరన్ కలిగి ఉన్న కారుని కూడా గమనించవచ్చు. భారత ప్రభుత్వం ఇప్పటికే నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ,అత్యవసర వాహనాలైన అంబులెన్స్ వంటి వాటికి మినహా ఇతర ఏ వాహనాలకు సైరన్ ఉండకూడదు. అయితే ఈ నియమాన్ని చాలా సార్లు రాజాకీయ నాయకులు ఉల్లంఘిస్తూనే ఉన్నారు.

కొన్నిసార్లు రాజకీయ నాయకులు మరియు వీఐపీ వాహనాలు అంబులెన్స్‌ల వంటి అత్యవసర వాహనాలను కూడా నిలిపివేస్తారు. అటువంటి పరిస్థితిలో, అంబులెన్స్‌లలో రోగులు మరణించిన సందర్భాలు కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి. దీనిపైన ప్రభుత్వాలు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రస్తుతం సవరించిన మోటారు వెహికల్ యాక్ట్ ప్రకారం.. అంబులెన్స్ లేదా అగ్నిమాపక దళం వంటి అత్యవసర వాహనాలకు దారి ఇవ్వని వాహనదారులకు భారీ మొత్తంలో జరిమానా కూడా విధించబడుతుంది. దీనిని వాహన వినియోగదారులు తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి. వీలైనంత వరకు మీరు రోడ్డుపైన ప్రయాణించే సమయంలో అత్యవసర వాహనాలకు దారి ఇవ్వండి. ఇది మీ మానవత్వాన్ని కూడా తెలుపుతుంది.

కార్ డ్రైవర్‌పై చెయ్యి చేసుకున్న పోలీస్.. అసలు కారణం ఏమిటో ఇక్కడ చూడండి

దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఎమర్జెన్సీ వాహనాల్లో సైరన్‌లు, డ్యాష్ కెమెరాలు ఏర్పాటు చేయాలని, తద్వారా దారికి అడ్డుగా ఉన్న వాహనాలను సులభంగా పక్కకు వెళ్ళమని సూచించవచ్చని తెలిపారు. మోటార్ వాహన చట్టం 2019 ప్రకారం, అంబులెన్స్‌కు దారి ఇవ్వని వాహనాలకు ఏకంగా రూ. 10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కావున వాహన వినియోగదారులు తప్పకుండా అత్యవసర వాహనాలకు దారి కల్పించాలి.

ఇదిలా ఉండగా కొంతకాలం క్రితం కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర కోసం పోలీసులు రోడ్లపై బారికేడ్ వేయడంతో ఆ సమయంలో అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. అంతే కాకుండా ఢిల్లీలో ఏప్రిల్‌ నెలలో విఐపిల ప్రయాణం కోసం రక్తస్రావం అవుతున్న చిన్నారిని తీసుకువెళుతున్న అంబులెన్స్‌ను ఆపడం కూడా జరిగింది. నిజంగా ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు మనసును కదిలిస్తాయి. అయితే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు తప్పకుండా దీని గురించి తప్పకుండా కొంత ఆలోచించాలి. అప్పుడే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, June 6, 2022, 16:18 [IST]
English summary
Police slaps bolero driver to clear path for ministers convoy details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+