వాహన తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఏం చేశారో తెలుసా...?

కొంత మంది ట్రాఫిక్ పోలీసులు ఇండియన్ రోడ్ల మీద తిరిగే పలు అరుదైన బైకులు పట్ల తీవ్ర ఆసక్తి కనబరుస్తారు. ఒక్కోసారి విధి నిర్వహణలో ఉన్న పోలీసులు సిబ్బంది తమ ప్రాథమిక విధులను కూడా పక్కన పెట్టేస్తారు. అత్యం

By Anil Kumar

కొంత మంది ట్రాఫిక్ పోలీసులు ఇండియన్ రోడ్ల మీద తిరిగే పలు అరుదైన బైకులు పట్ల తీవ్ర ఆసక్తి కనబరుస్తారు. ఒక్కోసారి విధి నిర్వహణలో ఉన్న పోలీసులు సిబ్బంది తమ ప్రాథమిక విధులను కూడా పక్కన పెట్టేస్తారు. అత్యంత ఖరీదైన బైకును చూసిన కూతూహలంలో వారి ప్రవర్తన చూస్తే ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది.

అచ్చం ఇలాంటి సంఘటన ఓ బైకు రైడర్‌కు ఎదురైంది. పవర్‌ఫుల్ బెనెల్లీ బైకును చూసిన తర్వాత పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యారో చూద్దాం రండి...

డ్యూటీని పక్కన పెట్టి ఈ పోలీసులు ఏం చేశారో చూడండి

బెనెల్లీ టిఎన్‌టి 300 బైకు రైడర్ శ్రీనగ్-ఢిల్లీ జాతీయ రహదారి మీద రైడింగ్ ప్రారంభించాడు. ఢిల్లీ వెళ్లే మార్గంలో ఓ చోట పోలీసు అధికారులు ఏర్పాటు చేసిన పోలీస్ చెక్-పాయింట్ వద్ద పోలీసులు అతడిని ఆపారు.

డ్యూటీని పక్కన పెట్టి ఈ పోలీసులు ఏం చేశారో చూడండి

బైకును ఆపిన వెంటనే అక్కడున్న పోలీసులంతా బైకును చుట్టే ముట్టేశారు. ఎంతో కూతూలంగా బైకు గురించి రకారకాల ప్రశ్నలు సంధించారు. ఒకరకంగా చెప్పాలంటే తమ ప్రాథమిక విధులను మరిచిపోయి, బైకు పట్ల ఎంతో ఆకర్షితులయ్యారు.

డ్యూటీని పక్కన పెట్టి ఈ పోలీసులు ఏం చేశారో చూడండి

పోలీసులు బైకు యొక్క ఇంజన్ మరియు ధర గురించి ఆరా తీయగా, ఇందుకు సమాధానంగా, దీని ధర 4 లక్షల రుపాయలని మరియు ఇది ఎంత శక్తివంతమైనదో, దీని పనితీరు అదే విధంగా దీనిని లాంగ్ డిస్టెన్స్ రైడింగ్ కోసం వినియోగిస్తానని చెప్పుకొచ్చాడు.

డ్యూటీని పక్కన పెట్టి ఈ పోలీసులు ఏం చేశారో చూడండి

బెనెల్లీ టిఎన్‌టి 300 చూడటానికి చాలా పెద్దగా ఉండటంతో, అక్కడున్న పోలీసులంతా బైకు గురించి వివరాలను ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. శ్రీనగర్ నుండి ఢిల్లీకి కేవలం బైకు సర్వీసింగ్ కోసమే వెళుతున్నానని రైడర్ విరించాడు.

డ్యూటీని పక్కన పెట్టి ఈ పోలీసులు ఏం చేశారో చూడండి

అంతే కాకుండా, అతి త్వరలో తాను ఈ బైకు మీద హిమాలయాల్లో ఉన్న లఢక్‌కు రైడ్ చేయబోతున్నట్లు తెలిపాడు. ఇంతలో కొంత మంది పోలీసులు, నువ్విలా లాంగ్ రేస్‌లు చేస్తే లీటరుకు ఎంత మైలేజ్ ఇస్తుందని ప్రశ్నించారు.

డ్యూటీని పక్కన పెట్టి ఈ పోలీసులు ఏం చేశారో చూడండి

అనధికారికంగా ఏర్పాటు చేసిన నెంబర్ ప్లేట్ ఉండటంతో అప్పటికే ఓ బైకు రైడర్‌కు జరిమానా విధించారు. అయితే, అక్కడున్న ఏ ఒక్క పోలీసు కూడా బెనెల్లీ బైకు ఓనర్‌ను ఎలాంటి డాక్యుమెంట్స్ చూపించమని అడగలేదు.

డ్యూటీని పక్కన పెట్టి ఈ పోలీసులు ఏం చేశారో చూడండి

అంతే కాకుండా, బెనెల్లీ టిఎన్‌టి 300 బైకు మీద వచ్చిన ఇద్దరినీ ఎలాంటి పత్రాలు అడకుండానే పంపించారు. అంత ఖరీదైన బైకును నడిపే వ్యక్తులు డాక్యుమెంట్స్ లేకుండా ఎలా వెళతరాని అనకున్నారో... లేదంటే కాస్ట్లీ బైకును చూసిన ఆనందంలో వదిలేసారో వారికే తెలియాలి.

డ్యూటీని పక్కన పెట్టి ఈ పోలీసులు ఏం చేశారో చూడండి

బెనెల్లీ టిఎన్‌టి 300 ఇండియన్ మార్కెట్లో లభించే అత్యంత సరసమైన ట్విన్-సిలిండర్ బైకు. ఇలాంటి బైకులు ఇండియన్ రోడ్ల మీద చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. వీటిని చూసిన పోలీసులు కూడా చాలా అశ్చర్యానికి లోనవుతుంటారు.

డ్యూటీని పక్కన పెట్టి ఈ పోలీసులు ఏం చేశారో చూడండి

మరికొంత మంది పోలీసులు అయితే, అత్యంత ఖరీదైన మరియు అరుదైన బైకులు తారసపడితే, రైడర్ల పర్మిషన్‌తో ఓ రెండు రౌండ్లు వేసి, ఫోటోలు కూడా తీసుకుంటారు. కాబట్టి, ఖరీదైన బైకులు చూస్తే పోలీసులు ఎలాంటి డాక్యుమెంట్స్ అడగరులే వదిలేస్తారులే అనుకోకండి. కఠినంగా వ్యవహరించే అధికారులు కూడా ఉంటారు. కాబట్టి, మీ బైకుకు సంభందించిన అన్ని పత్రాలను వెంట ఉంచుకోండి.

డ్యూటీని పక్కన పెట్టి ఈ పోలీసులు ఏం చేశారో చూడండి

బెనెల్లీ టిఎన్‌టి 300 బైకులో 300సీసీ సామర్థ్యం గల ట్విన్-సిలిండర్ ఇంజన్ కలదు, 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 37.3బిహెచ్‌పి పవర్ మరియు 26.5ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఢిల్లీ-శ్రీనర్ హైవే మీద బెనెల్లీ టిఎన్‌టి 300 బైకు రైడర్‌ేకు మరియు పోలీసులకు మధ్య సంఘటనను ఇక్కడున్న వీడియోలో వీక్షించగలరు...

Source: INDIARIDER AMIT

More from DriveSpark

Article Published On: Thursday, August 2, 2018, 13:45 [IST]
English summary
Read In Telugu: Police stop Benelli TNT300 but DON’T ask for papers: What’s happening here [Video]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+