Just In
Don't Miss
- Lifestyle
సోమవారం దినఫలాలు : అనవసరమైన పనులకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు...!
- News
వ్యవసాయ చట్టాల రద్దు తప్ప.. ఏదైనా అడగండి: కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్
- Movies
ట్రెండింగ్ : కొంచెం కూడా ఇంగితజ్ఞానం లేదా.. పైకి కనపడేది నిజం కాదు.. మళ్లీ బుక్కైన నాగబాబు
- Finance
పెట్రోల్, డీజిల్ వాడకం భారీగా తగ్గినా.. ఆదాయం అదుర్స్: ఎందుకంటే
- Sports
సెహ్వాగ్ చెప్పిన ప్రకారం గబ్బాలో భారత్దేనా విజయం..?
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వాహదారులు అక్కడ 2 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఏమవుతుందో తెలుసా ?
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోడం జరుగుతోంది. ముంబై పోలీసు శాఖ ఇటీవల అక్కడి స్థానికులకు ఒక షాకింగ్ న్యూస్ ఇచ్చింది. ముంబైలో ఉద్యోగం లేకుండా ఉండేవారు 2 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించినట్లయితే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ముంబై పోలీసులు ఆదివారం కరోనా నివారణలో భాగంగా కొన్ని కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ మార్గదర్శకాలలో భాగంగా సరైన కారణం లేకుండా డ్రైవర్ ఇంటి నుంచి బయటికి వచ్చినట్లైతే ఆ వాహనదారుని యొక్క వాహనం జప్తు చేయబడుతుంది.

మహారాష్ట్రలో కరోనా వైరస్ సంక్రమణ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముంబై నగరంలో మాత్రమే కాకుండా, ఇతర బహిరంగ ప్రదేశాలలో ప్రజల సంఖ్య మరింత ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి.
MOST READ:బిఎస్-6 హోండా ఎక్స్-బ్లేడ్ 160 బైక్ : ధర & ఇతర వివరాలు

ప్రజలు షాపింగ్ లేదా ఇతర కార్యకలాపాలకు వెళితే, వారు తమ ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలోనే అలాంటి పని చేయాల్సి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా ఈ సూచనలను ఉల్లంఘిస్తే, అతనిపై కఠిన చర్యలు తీసుకుంటారు.

ముంబై పోలీసులు ఇవి మాత్రమే కాకుండా మరిన్ని సూచనలు జారీ చేశారు. అవసరమైన పని మినహా అన్ని బహిరంగ కార్యకలాపాలను పూర్తిగా మూసివేయాలని ఆయన అన్నారు. ఇంటి నుండి బయలుదేరే ముందు ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి.
MOST READ:బుడతడు ఉపయోగించడానికి బుల్లి కారు తయారుచేసిన తండ్రి

మార్కెట్లు మరియు సెలూన్‌లకు కూడా ఇది వర్తిస్తుంది. వాహనదారులు తమ ఇంటి నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కెట్లు మరియు సెలూన్‌లను మాత్రమే సందర్శించాలని సూచించారు. ఈ పరిధిని మించి కొనుగోలు చేయడం నిషేధించబడింది.

ఆఫీసులు మరియు వైద్య అత్యవసర సేవల కొరకు ప్రయాణించే వారికి మాత్రమే 2 కి.మీ కంటే ఎక్కువ ప్రయాణించడానికి అనుమతి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. వీటితో పాటు సామజిక దూరాన్ని పాటించాలని పోలీసులు కఠినమైన సూచనలు చేసారు.
MOST READ:కరోనా ఎఫెక్ట్ : పండ్లు అమ్ముకుంటున్న టాక్సీ & క్యాబ్ డ్రైవర్లు