రూ. 2 కోట్ల కారులో తళుక్కుమన్న కరీనా కపూర్.. వీడియో వైరల్..!
బాలీవుడ్ ప్రముఖ నటి కరీనా కపూర్‌కు లగ్జరీ కార్లు అంటే చాలా ఇష్టం. ఆమె తాజాగా నటించిన 'జానే జాన్' సినిమా త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇటీవలే జరిగింది. ఈ ఈవెంట్‌కు కరీనా Mercedes Benz S-350D కారులో హాజరయ్యారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
మెర్సిడెస్ బెంజ్ S-350D లగ్జరీ కారును నటి కరీనా కపూర్ 2022 అక్టోబర్‌లో కొనుగోలు చేశారు. కొన్ని నివేదికల ప్రకారం ఆ కారు ఆన్‌రోడ్ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని అంచనా. ఈ లగ్జరీ కారు 3.0 లీటర్ ఇన్‌లైన్ 6 సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 3400rpm వద్ద 282bhp శక్తి, 1200rpm వద్ద 600Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ S-350D కారు ఇంజిన్ 9- స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. కేవలం 6 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. గరిష్ఠ వేగం 250kmphగా ఉంది. ఈ కారు AWD ఆల్ వీల్ డ్రైవ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. BS6 ప్రమాణాలను అనుగుణంగా తయారుచేయబడింది. ఈ కారు ఐడిల్ స్టార్ట్/ స్టాప్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది.
ఈ కారులో 8 ఎయిర్‌బ్యాగ్‌లు సహా బ్లైండ్ స్పాట్ మానిటర్, లేన్ అసిస్ట్ సిస్టమ్. ఫార్వడ్ కొలిజన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, హై బీమ్ అసిస్ట్, టైర్ ప్రజర్ మానిటరింగ్ సిస్టమ్, ఛైల్డ్ సీట్ యాంకర్, సీట్ బెల్ట్ వార్నింగ్ సహా అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

కారు లోపల 12.8 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేను సపోర్టు చేస్తుంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఫీచర్‌తో వస్తుంది. ఈ కారు 5289mm పొడవు. 1954mm వెడల్పు, 1503mm ఎత్తు, 3216mm వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది.
బాలీవుడ్‌లో కరీనా కపూర్‌తో పాటు ప్రముఖ నటులు షారుఖ్‌ఖాన్, ఆయుష్మాన్ ఖురానా సహా చాలా మంది మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ కారును కలిగి ఉన్నారు. జానే జాన్ ట్రైలర్ విడుదల కార్యక్రమానికి సినిమా నటుల్లో ఒకరైన విజయ్ వర్మ జీప్ కంపాస్ కారులో వచ్చారు.

భారత్ మార్కెట్లో అత్యంత ప్రజాధరణ పొందిన కార్లలో జీప్ కంపాస్ SUV ఒకటి. ఈ కారు ప్రారంభ ధర రూ.21.73 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. జీప్ కంపాస్ SUV టాప్ వేరియంట్ రూ.32.07 లక్షలు (ఎక్స్‌షోరూం)గా ఉంది. ఈ కారుకు భారీగా అభిమానులు ఉన్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








