రకుల్ ప్రీత్ సింగ్ మనసు దోచిన కొత్త కారు ఇదే!.. ఇది మీక్కూడా నచ్చేస్తుంది!
తెలుగు ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). కెరటం సినిమాతో పరిచయమైన ఈ అమ్మడు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. ఆ తరువాత ధ్రువ, సరైనోడు వంటి చిత్రాల్లో నటించి ఎంతోమంది ప్రేక్షకుల మనసుదోచింది. సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా రకుల్‌కు కార్లంటే కూడా చాలా ఇష్టమని తెలుస్తోంది. ఈ కారణంగానే ఈమె ఎప్పటికప్పుడు కొత్త కార్లను కొనుగోలు చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఇటీవల ఎంజీ గ్లోస్టర్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇప్పటికే అనేక అన్యదేశ్య కార్లను కలిగి ఉన్న రకుల్ తాజాగా ఎంజీ గ్లోస్టర్ (MG Gloster) కారును తన గ్యారేజిలో చేర్చింది. ఈ కారు ఎంతోమంది సెలబ్రిటీలకు ఇష్టమైన ఎంపిక కూడా. అయితే రకుల్ ప్రీత్ కొనుగోలు చేసిన గ్లోస్టర్ తెలుపు రంగులో ఉండటం చూడవచ్చు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎంజీ గ్లోస్టర్ అనేది ఆధునిక డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఉత్తమ కారు. ఇది 6 సీటర్ మరియు 7 సీటర్ కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది. ఈ కారు వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో డ్రైవర్లకు కావాల్సిన అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ ప్రయాణికులకు ఉత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి. ఈ కారణంగానే చాలామంది ఈ కారును ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.
ఎంజీ గ్లోస్టర్ కారు 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, సాఫ్ట్ టచ్ మెటీరియల్‌లతో కూడిన ప్రీమియం డ్యాష్‌బోర్డ్, యాంబియంట్ లైటింగ్, డ్యూయల్ పేన్ సన్‌రూఫ్, 12 వే పవర్ అడ్జస్టబుల్ సీట్, హీటింగ్ సీట్ మెమరీ ఫంక్షన్, ఆటోమేటిక్ పార్కింగ్ అసిస్ట్, ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం, 360 డిగ్రీ కెమెరా, 12 స్పీకర్ ప్రీమియం ఆడియో సిస్టమ్ వంటి మరెన్నో ఫీచర్స్ పొందుతుంది.

ఎంజీ గ్లోస్టర్ కారు సింగిల్ టర్బో లేదా డ్యూయెల్ టర్బో అనే రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి ఇందులోని సింగిల్ టర్బో డీజిల్ ఇంజిన్ 163 పీఎస్ పవర్ మరియు 375 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. డ్యూయెల్ టర్బో డీజిల్ ఇంజిన్ 218 పీఎస్ పవర్ మరియు 480 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ పొందుతుంది.
దేశీయ మార్కెట్లో ప్రారంభం నుంచి ఉత్తమ అమ్మకాలు పొందుతున్న ఎంజీ గ్లోస్టర్ కారు టూ వీల్ డ్రైవ్ లేదా ఫోర్ వీల్ డ్రైవ్ ఎంపికలలో లభిస్తుంది. దీని ధర రూ.38.80 లక్షల నుంచి రూ.43.87 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఈ కారు విశాలమైన క్యాబిన్ కలిగి.. విలాసవంతమైన ఫీచర్స్ పొందుతుంది. కాబట్టి ఎక్కువంది ఈ కారును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.
కేవలం ఎంజీ గ్లోస్టర్ కారును మాత్రమే కాకుండా.. రకుల్ ప్రీత్ సింగ్ తన గ్యారేజిలో ఖరీదైన మెరిసిడ్స్ బెంజ్ జీఎల్ఈ 350డీ, మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్500, మెర్సిడెస్ మేబ్యాచ్ జీఎల్ఎస్600 మరియు టయోటా కంపెనీ యొక్క ఇన్నోవా క్రిష్టా మొదలైన కార్లను కలిగి ఉన్నారు. అంతే కాకుండా ఈమె నటుడు, నిర్మాత మరియు వ్యాపారవేత్త అయిన జాకీ భగ్నానీని వివాహం చేసుకోవడం వల్ల వీరి కార్ కలెక్షన్ మరింత పెరిగింది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








