Just In
- 12 hrs ago
మతిపోగొడుతున్న హ్యుందాయ్ మార్చ్ నెల డిస్కౌంట్స్.. దేనిపై ఎంతో చూసారా..!
- 14 hrs ago
భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్
- 15 hrs ago
గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్లైన్లోనే..
- 16 hrs ago
కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు
Don't Miss
- News
రఘురామ మళ్లీ కౌంటర్.. సీఎం జగన్ కూడా భాగస్వాములే.. హాట్ కామెంట్స్..
- Movies
చరిత్ర సృష్టించిన సుడిగాలి సుధీర్: వాళ్లందరిపై ఆధిపత్యం చూపిస్తూ.. ఊహించని రికార్డు సొంతం
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Finance
ధరలు ఎలా ఉన్నాయంటే? 44వేలకు దిగొచ్చిన బంగారం, వెండి రూ.66 వేల దిగువన
- Sports
ఆ విషయంలో రోహిత్ శర్మను చూసి విరాట్ కోహ్లీ నేర్చుకోవాలి: మనోజ్ తివారీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
షూటింగ్ స్పాట్‌కి 12 కి.మీ సైకిల్‌పై వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్.. ఎందుకో మరి
ఇటీవల కాలంలో భారతదేశంలో రోజు రోజుకి కొత్త వాహనాల విడుదలతో ద్విచక్ర వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కానీ ఎన్ని కొత్త వాహనాలు పెరుగుతున్నప్పటికీ చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు ద్విచక్ర వాహనాలను ఉపయోగించడానికి సుముఖత చూపుతున్నారు, అంతే కాకుండా బాగా డబ్బున్న ధనవంతులు కూడా ఆరోగ్య దృష్ట్యా ఫిట్ నెస్ కోసం కూడా సైకిల్స్ ఉపయోగిస్తారు.

సాధారణంగా బైక్‌ల వాడకం ఎక్కువగా పెరగడంతో ట్రాఫిక్ ఎక్కువైపోతోంది. అంతే కాకుండా ద్విచక్ర వాహనాలకు అలవాటు పడిన చాలామంది కొన్ని రకమైన ఆరోగ్య పరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా సైకిళ్ల ఆవశ్యకతపై అవగాహన పెరుగుతోంది. తమిళనాడు రైల్వే డిజిపి సిలేంద్ర బాబు మరియు అతని బృందం కొన్ని వారాల క్రితం చెన్నై నుండి ధనుష్కోడి వరకు సైకిల్ పర్యటన ప్రారంభించారు.

నేటి యువతరంలో సైక్లింగ్ పై మంచి అవగాహనా తీసుకురావడానికి ఈ పర్యటన జరిగింది. ఇప్పడు తెలుగు సినిమా పరిశ్రమలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తో హీరోయిన్ గా అరంగేట్రం చేసిన 'రకుల్ ప్రీత్' అతి తక్కువ కాలంలో బాగా ఫ్యామస్ అయింది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య కాలంలో ప్రతి రోజు షూటింగ్ స్పాట్ కు సైకిల్ పై వెళ్తున్నట్లు గుర్తించబడింది.
MOST READ:ఇంటెర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ఇప్పుడు వెరీ సింపుల్.. ఇలా చేయండి

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ మేడ్ అనే బాలీవుడ్ చిత్రం లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గన్ మరియు పలువురు నటించారు. సాధారణంగా సినిమా స్టార్స్, నటీమణులు లగ్జరీ కార్లలో షూటింగ్ జరిగే ప్రదేశాలకు వెళ్తారన్న సంగతి అందరికీ తెలిసిందే, కానీ రకుల్ ప్రీత్ సింగ్ ఇందుకు భిన్నంగా ప్రతిరోజూ మేడ్ షూటింగ్ ప్రదేశానికి సైకిల్‌పై వెళ్తోంది.

మేడ్ షూటింగ్ ప్రదేశానికి ప్రతిరోజు రకుల్ ప్రీత్ సింగ్ 12 కిలోమీటర్ల సైకిల్‌పై వెళ్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ సైకిల్ నడుపుతున్న ఫోటోలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అయ్యాయి. రకుల్ ప్రీత్ సింగ్ అభిమానులు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ సైకిల్ నడుపుతున్న ప్రాంతం చాలా రద్దీగా ఉంది.
MOST READ:డోనాల్డ్ ట్రంప్ వాడిన కారు వేలంలో పాల్గొంటున్న ఇండియన్, ఎవరో తెలుసా ?

రకుల్ ప్రీత్ సింగ్ యొక్క భద్రత కోసం ఆమెతో పాటు, ఒక కారు కూడా వెళ్తోంది. సాధారణంగా రకుల్ ప్రీత్ సింగ్ తన బాడీ ఫిట్ నెస్ కోసం ఎక్కువగా శ్రద్ద తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఆమె ప్రతిరోజూ సైకిల్‌లో షూటింగ్ స్పాట్‌కు వెళుతున్నారు. సైక్లింగ్ చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ఈ మధ్య కాలంలో ఎక్కువమంది సెలబ్రెటీలు సైక్లింగ్ పై అవగాహనా పెంచడానికి వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు.

వాహనాల సంఖ్య పెరుగుతూనే ఉన్నందున, ప్రజలు ఉబకాయంతోనే కాకుండా వాయు కాలుష్యం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ కారణంగా ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు మరియు సైకిళ్ల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి.
MOST READ:పేస్ మాస్క్ విషయంలో క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ

భారతదేశంలో కూడా వాయు కాలుష్య సమస్యను అంతం చేయడానికి అనేక ప్రాజెక్టులు రూపొందించబడ్డాయి. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ చర్యలు తీసుకుంటున్నాయి. కానీ సైకిళ్ళు వాడటానికి పెద్దగా ప్రోత్సాహం లేదు. దీనిపై ప్రభుత్వాలు శ్రద్ధ వహిస్తే భవిష్యత్ తరాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. వాయుకాలుష్య సమస్య బాగా తగ్గుతుంది.