వారెవ్వా.. యూట్యూబర్స్ వాడే కార్లు ఇలా ఉన్నాయా!.. ఓ లుక్కేసుకోండి
ఆధునిక కాలంలో యూట్యూబ్ రాజ్యమేలుతోంది, యూట్యూబర్స్ సంపన్నులవుతున్నారు. చాలామంది యూట్యూబర్స్ సెలబ్రిటీలకు ఏ మాత్రం తీసిపోకుండా సంపాదిస్తూ ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ కథనంలో ఖరీదైన కార్లను కలిగి ఉన్న యూట్యూబర్స్ ఎవరు? వారు ఉపయోగిస్తున్న కార్లు ఏవనే వివరాలు తెలుసుకుందాం.
గౌరవ్ చౌదరి (Gaurav Chaudhary)
టెక్నికల్ గురూజీ పేరుతో పిలువబడే గౌరవ్ చౌదరి.. ఎక్కువ సంపాదిస్తున్న యూట్యూబర్లలో ఒకరు. ఈయన ఖరీదైన వాచెస్, మొబైల్ ఫోన్స్ వంటి వాటితో పాటు.. ఖరీదైన అన్యదేశ్య కార్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈయన గ్యారేజిలోని రోల్స్ రాయిస్ ఘోస్ట్, బీఎండబ్ల్యూ 720 డి, మెర్సిడెస్ బెంజ్, పోర్స్చే, ఆడి ఏ 6 వంటి కార్లతో పాటు.. సుజుకి హయబుసా, RE హిమాలయన్ మొదలైన బైకులు ఉన్నాయి.

ఎల్విష్ యాదవ్ (Elvish Yadav)
ఫన్నీ వీడియోలతో ప్రసిద్ధి చెందిన 'ఎల్విష్ యాదవ్' బిగ్ బాస్ ఓటీట్ సీజన్ 2 రియాల్టీ షో మరింత ఫేమస్ అయ్యాడు. ఇతని గ్యారేజిలో సుమారు రూ. 1.2 కోట్లు విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ ఈ53 ఏఎమ్‌జి క్యాబ్రియోలెట్ ఉంది. ఈ స్పోర్ట్స్ కూపే 435 పీఎస్ పవర్ మరియు 520 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 3.0 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది.
ఫుక్రా ఇన్సాన్ (Fukra Insaan)
ఖరీదైన కార్లను ఉపయోగించే సెలబ్రిటీల జాబితాలో ఫుక్రా ఇన్సాన్ ఒకరు. ఇతడు ఇండియన్ యూట్యూబర్ మరియు సింగర్ కూడా. ఫుక్రా ఇన్సాన్ సుమారు రూ.80 లక్షల విలువైన జాగ్వార్ ఎఫ్-పేస్ SUV కలిగి ఉన్నారు. ఈ కారు 2.0-లీటర్ పెట్రోల్ (246 బీహెచ్‌పీ పవర్ & 365 న్యూటన్ మీటర్ టార్క్) మరియు డీజిల్ ఇంజిన్ (201 బీహెచ్‌పీ పవర్ & 430 న్యూటన్ మీటర్ టార్క్) ఆప్షన్స్ పొందుతుంది.

స్కౌట్ (Tanmay Singh)
స్కౌట్ అని పిలువబడే తన్మయ్ సింగ్ మరో ఫేమస్ ఇండియన్ యూట్యూబర్. ఇతని వద్ద ఫోర్డ్ కంపెనీకి చెందిన మస్టాంగ్ కారు ఉంది. ఈ కారు 5.0 లీటర్ వీ8 పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 396 బీహెచ్‌పీ పవర్ మరియు 515 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
క్యారీ మినాటీ (Carry Minati)
ఫన్నీ కంటెంట్‌తో పాపులర్ అయిన ఇండియన్ యూట్యూబర్ 'అజయ్ నగర్' (Ajay Nagar). ఇతడు జర్మన్ బ్రాండ్ అయిన ఆడి కంపెనీకి చెందిన క్యూ7 SUV కలిగి ఉన్నారు. ఇది 3.0 లీటర్ వీ8 పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 335 బీహెచ్‌పీ పవర్ మరియు 500 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి మంచి పనితీరుని అందిస్తుంది.

గౌరవ్ తనేజా (Gaurav Taneja)
ఫ్లయింగ్ బీస్ట్ అని పిలువబడే గౌరవ్ తనేజా చెప్పుకోదగ్గ ఫేమస్ యూట్యూబర్లలో ఒకరు. ఇతని వద్ద బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన ఎక్స్4 లగ్జరీ కారు ఉంది. ఇది 3.0 లీటర్ ట్విన్ టర్బోఛార్జ్డ్ ఇన్‌లైన్ 6 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 355 బీహెచ్‌పీ పవర్ మరియు 500 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ లగ్జరీ SUV ఆన్ రోడ్ ధర రూ. కోటి కంటే ఎక్కువని తెలుస్తోంది.
భువన్ బామ్ (Bhuvan Bam)
కామెడీ కంటెంట్‌కు ప్రసిద్ధి చెందిన భువన్ బామ్ భారతదేశంలో ప్రముఖ యూట్యూబర్లలో ఒకరు. ఇతడు బీఎండబ్ల్యూ ఎక్స్3 లగ్జరీ కారును కలిగి ఉన్నారు. ఈ SUV 2.0 లీటర్ డీజిల్ మరియు 3.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. దీని ధర రూ. 68.50 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ. 87.50 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది.
పైన పేర్కొన్న వారు మాత్రమే కాకుండా ఆశిష్ చంచలాని (మెర్సిడెస్ బెంజ్ ఈ200), జ్ఞాన్ గేమింగ్ (బీఎండబ్ల్యూ జెడ్4 స్పోర్ట్స్), వికాస్ దయాల్ (టయోటా ల్యాండ్ క్రూయిజర్ LC300), సంజు సెహ్రావత్ (మెర్సిడెస్ బెంజ్ జీ-వ్యాగన్), హ్యారీ ఉప్పల్ (ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110), జట్ ప్రభజోత్ (ల్యాండ్ రోవర్ డిఫెండర్), టెక్ బర్నర్ (బీఎండబ్ల్యూ ఎక్స్5) ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు.


Click it and Unblock the Notifications








