కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమై, చరిత్రలో మిగిలిపోయిన టాప్ 5 ఎమ్‌పివిలు..

అధిక మైలేజ్ మరియు ఎక్కువ సీటింగ్ సామర్థ్యం వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చే భారతదేశం వంటి ఆటోమొబైల్ మార్కెట్లలో ఎమ్‌పివి (మల్టీ పర్సప్ వెహికల్) లకు ఎల్లప్పుడూ ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. పెద్ద కుటుంబాలకు మరియు తరచూ ఎక్కువ మందితో దూరప్రయాణాలు చేసే వారికి ఎమ్‌పివిలు చక్కటి ఆప్షన్‌గా ఉంటాయి.

కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమై, చరిత్రలో మిగిలిపోయిన టాప్ 5 ఎమ్‌పివిలు..

అయితే, భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎమ్‌పివి విభాగంలోకి అనేక కొత్త మోడళ్లు వచ్చినప్పటికీ, అవి ఎక్కువ కాలం మార్కెట్లో నిలబడలేకపోయాయి. డిజైన్ సరిగ్గా లేకపోవటం, ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగా ఉండటం లేదా ఆయా బ్రాండ్ల పట్ల కస్టమర్లలో విశ్వసనీయత లేకపోవటం వంటి పలు అంశాల కారణంగా కొన్ని ఎమ్‌పివిలు మార్కెట్లోకి వచ్చిన కొద్ది కాలానికే, మార్కెట్ నుండి అదృశ్యమైపోయాయి.

కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమై, చరిత్రలో మిగిలిపోయిన టాప్ 5 ఎమ్‌పివిలు..

మరి, ఈనాటి మన కథనంలో భారతదేశంలో కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమైన టాప్ 5 ఎమ్‌పివిల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమై, చరిత్రలో మిగిలిపోయిన టాప్ 5 ఎమ్‌పివిలు..

1. నిస్సాన్ ఎవాలియా (Nissan Evalia)

భారత ఎమ్‌పివి విభాగంలో మారుతి ఎర్టిగా మరియు టొయోటా ఇన్నోవా వంటి మోడళ్లకు పోటీగా జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్ ప్రవేశపెట్టిన మోడల్ ఎవాలియా ఎమ్‌పివి. ముందు వైపు నుండి ట్రెడిషనల్ కారు మాదిరిగా మరియు వెనుక వైపు నుండి బాక్సీ టైప్ ఎస్‌యూవీ మాదిరిగా కనిపించే నిస్సాన్ ఎవాలియా (Nissan Evalia) చూడటానికి ఓవరాల్‌గా ఓ వ్యాన్ తరహా డిజైన్‌ను కలిగి ఉండేది.

కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమై, చరిత్రలో మిగిలిపోయిన టాప్ 5 ఎమ్‌పివిలు..

సరసమైన ధర, విశిష్టమైన ఫీచర్స్ మరియు స్లైడింగ్ డోర్స్ వంటి అనేక అంశాలతో ఈ కారు సెప్టెంబర్ 2012లో భారత మార్కెట్లో విడుదలైంది. ఆ సమయంలో ఈ ఎమ్‌పివి ప్రారభ ధర రూ. 8.49 లక్షలు గానూ మరియు టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.9.99 లక్షలు గానూ ఉండేది. ఈ ఎమ్‌పివిని మొత్తం నాలుగు వేరియంట్లలో (ఎక్స్ఈ, ఎక్స్ఈ ప్లస్, ఎక్స్ఎల్, ఎక్స్‌వి) ప్రవేశపెట్టారు.

కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమై, చరిత్రలో మిగిలిపోయిన టాప్ 5 ఎమ్‌పివిలు..

నిస్సాన్ ఎవాలియాలో ఉపయోగించిన 1.5 లీటర్ టర్బోఛార్జ్డ్ కె9కె డీజిల్ ఇంజన్‌ గరిష్టంగా 3750 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 1900 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ (గేర్ బాక్స్) తో లభించేంది మరియు ఇది లీటర్ డీజిల్‌కు సుమారు 20 కి.మీ. మైలేజీని ఆఫర్ చేసేది.

కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమై, చరిత్రలో మిగిలిపోయిన టాప్ 5 ఎమ్‌పివిలు..

నిస్సాన్ ఎవాలియా టాప్-ఎండ్ వేరియంట్లలో రెండవ వరుసలో కెప్టెన్ సీట్లు, వెనుక సీట్లలోని ప్యాసింజర్ల కోసం రూఫ్ మౌంటెడ్ ఏసి వెంట్స్, రియర్ వైపర్, రియర్ డిఫాగర్, స్లైడింగ్, డోర్స్, వుడ్ ఫినిష్డ్ డాష్‌బోర్డ్ మరియు 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు లభించేవి. స్పేస్ పరంగా ఈ ఎమ్‌పివి చాలా విశాలమైన క్యాబిన్‌ను కలిగి ఉండేది. కాకపోతే, దీని బాక్సీ టైప్ డిజైన్ కస్టమర్లను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కంపెనీ ఇందులో రెండు మూడు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను విడుదల చేసినప్పటికీ, ఫలితం లేకపోయింది.

కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమై, చరిత్రలో మిగిలిపోయిన టాప్ 5 ఎమ్‌పివిలు..

2. రెనో లాజీ (Renault Lodgy)

ఎమ్‌పివి విభాగంలో తన సత్తా ఏంటో చూపేందుకు ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో తమ లాజీ ఎమ్‌పివి 2015లో భారతదేశంలో విడుదల చేసింది. అయితే, ప్రత్యర్థుల నుండి ఎదురైన గట్టి పోటీతో ఇది మార్కెట్లో అంతగా రాణించలేకపోయింది. మనదేశంలో ఏదైనా కారు కొనేటప్పుడు భారతీయులు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే విషయం ఏదైనా ఉంది అంటే, అది అమ్మకాల తర్వాత మద్దతు (ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్) ఉంటుంది. అంతేకాదు, మెయింటినెన్స్, సర్వీస్ కాస్ట్ మరియు విడిభాగాల లభ్యత కూడా చాలా ముఖ్యమైనవే.

కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమై, చరిత్రలో మిగిలిపోయిన టాప్ 5 ఎమ్‌పివిలు..

రెనో ఈ విషయంలో భారతీయ కస్టమర్లను ఆకర్షించకలేకపోయింది. భారతదేశానికి రెనో కొత్త కార్ బ్రాండ్ కావటంతో మరియు దాని స్థిరత్వంపై భారతీయుల్లో సంశయాలు ఉండటంతో రెనో లాజీ (Renault Lodgy) అమ్మకాలు ఆశించిన రీతిలో సాగలేదు. ఆ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో రెనో సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్ కూడా అంతంత మాత్రంగానే ఉండేది. ఈ ప్రభావం రెనో లాజీ అమ్మకాలపై పడింది.

కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమై, చరిత్రలో మిగిలిపోయిన టాప్ 5 ఎమ్‌పివిలు..

నిజానికి రెనో లాజీ ఓ ఉత్తమమైన ఎమ్‌పివి. ఇది అత్యాధునిక 1461 సిసి డీజిల్ ఇంజన్‌తో లభించేంది. ఈ ఇంజన్ గరిష్టంగా 83 బిహెచ్‌పి శక్తిని మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది మరియు లీటరుకు 20.5 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజీని అందించేది. నిస్సాన్ మాదిరిగానే రెనో కూడా దాని లాజీ డిజైన్‌తో కస్టమర్లను ఆకర్షించలేకపోయింది. మరోవైపు మేడ్-ఇన్-ఇండియా లాజీ అస్థిరమైన నిర్మాణాన్ని కలిగి ఉందని తేలింది. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో ఇది జీరో-స్టార్ రేటింగ్‌తో ఘోరంగా విఫలమైంది.

కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమై, చరిత్రలో మిగిలిపోయిన టాప్ 5 ఎమ్‌పివిలు..

3. టాటా అరియా (Tata Aria)

పైన తెలిపిన రెండు ఎమ్‌పివిలు (నిస్సాన్ ఎవాలియా, రెనో లాజీ) విదేశీ బ్రాండ్ల నుండి వచ్చిన కార్లు కాబట్టి మన మార్కెట్లో విఫలం అయ్యాయని చెప్పవచ్చు. కానీ, భారతీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ అందించిన ఆరియా ఎమ్‌పివి కూడా కస్టమర్లను ఆకట్టుకోవటంలో విఫలమైంది. ఇందుకు ప్రధాన కారణం టాటా అరియా (Tata Aria) డిజైన్ అని చెప్పొచ్చు. ఆరియా క్యాబిన్‌లో అత్యుత్తమ ఫీచర్లు లభించినప్పటికీ, దాని ఎక్స్టీరియర్ డిజైన్ ముందు వైపు నుండి చూడటానికి ఇండికా/ఇండిగో డిఎన్ఏని కలిగి ఉంటుంది.

కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమై, చరిత్రలో మిగిలిపోయిన టాప్ 5 ఎమ్‌పివిలు..

టాటా ఆరియాలో 3D సరౌండ్ సౌండ్, థియేటర్ తరహా డిమ్మింగ్ రూఫ్ ల్యాంప్స్, బిల్ట్-ఇన్ జిపిఎస్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు క్రూయిజ్ కంట్రోల్ కంఫర్ట్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే, సేఫ్టీ విషయంలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబిఎస్, ఈఎస్‌పి అధునాతన హైడ్రోఫోమ్ ఛాస్సిస్, మందపాటి బాడీ షెల్ మరియు కొలాప్సబల్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమై, చరిత్రలో మిగిలిపోయిన టాప్ 5 ఎమ్‌పివిలు..

మరింత ఇంతటి ఫీచర్-రిచ్ ఎమ్‌పివి ఎలా విఫలమైందంటారు? ఇందుకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి, వాటిలో ఒకటి దీని అధిక ధర, అప్పట్లో ప్రజలు టాటా కోసం సుమారు రూ. 16 లక్షలకు మించి చెల్లించడానికి ఇష్టపడలేదు మరియు ఆ సమయంలో టాటా మోటార్స్ బ్రాండ్ విలువ చాలా తక్కువగా ఉండేది. ఇకపోతే, రెండవ కారణం దాని డిజైన్. తరాలు మారినా కంపెనీ దాని డిజైన్‌లో మార్పులు చేయడంలో ఘోరంగా విఫలమైందని చెప్పొచ్చు. ఫలితంగా ఈ కారు కూడా భారత ఆటోమొబైల్ చరిత్రలో కలిసిపోయింది.

కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమై, చరిత్రలో మిగిలిపోయిన టాప్ 5 ఎమ్‌పివిలు..

4. షెవర్లే ఎంజాయ్ (Chevrolet Enjoy)

జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్ మాదిరిగానే, అమెరికన్ కార్ బ్రాండ్ జనరల్ మోటార్స్‌కి చెందిన సబ్-బ్రాండ్ షెవర్లే కూడా భారతదేశంలో స్థిరపడటానికి చాలా కష్టపడింది. ఈ బ్రాండ్ భారతదేశం విడిచి వెళ్లిపోవటానికి ముందు, ఎమ్‌పివి విభాగంలో తన లక్‌ను వెతుక్కోవడానికి ప్రవేశపెట్టిన కారు షెవర్లే ఎంజాయ్ (Chevrolet Enjoy). ఈ కారు పేరులో ఉన్న ఎంజాయ్, దాని అమ్మకాలలో మాత్రం చూపలేకపోయింది.

కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమై, చరిత్రలో మిగిలిపోయిన టాప్ 5 ఎమ్‌పివిలు..

ఈ 7-సీటర్ ఎమ్‌పివిలో ఫియట్ ఆధారిత 1.3-లీటర్ డీజిల్ ఇంజన్ మరియు 1.4-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లను ఉపయోగించేవారు. చాలా సింపుల్ డిజైన్‌తో వచ్చిన షెవర్లే ఎంజాయ్, దాని సేఫ్టీ విషయంలో ఘోరంగా విఫలమైంది. క్రాష్ టెస్టులో ఈ కారు జీరో-స్టార్ రేటింగ్‌ను పొందింది. ఇందులోని బేస్ వేరియంట్‌లలో ఏబిఎస్ లేదా ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లు కూడా లభించేవి కావు. అంతేకాదు, ఆ సమయంలో ఈ బ్రాండ్ వాహనాల మెయింటినెన్స్ ఖర్చు కూడా తడిసి మోపెడయ్యేది.

కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమై, చరిత్రలో మిగిలిపోయిన టాప్ 5 ఎమ్‌పివిలు..

బలహీనమైన షెవర్లే బ్రాండ్ సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్ మరియు విడిభాగాల లభ్యత షెవర్లేకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ ఎమ్‌పివిలోని మూడవ వరుస సీట్లకు తగినంత లెగ్‌రూమ్ ఉండదు మరియు మూడవ వరుస ప్రవేశద్వారం కూడా చాలా ఇరుకుగా ఉంటుంది. ఇలాంటి అనేక కారణాల వలన షెవర్లే ఎంజాయ్ ని భారతీయ కస్టమర్లు ఎంజాయ్ చేయలేకపోయారు.

కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమై, చరిత్రలో మిగిలిపోయిన టాప్ 5 ఎమ్‌పివిలు..

5. డాట్సన్ గో ప్లస్ (Datsun GO+)

నిస్సాన్ యొక్క చవక కార్ బ్రాండ్ డాట్సన్ నుండి వచ్చిన అత్యంత చవకైన ఎమ్‌పివి డాట్సన్ గో ప్లస్ (Datsun GO+). నిజం చెప్పాలంటే, దీనిని ఎమ్‌పివి అనడం కంటే సాగదీసిన హ్యాచ్‌బ్యాక్ అని చెప్పొచ్చు. ఇందులోని మూడవ వరుస సీట్లు చిన్న పిల్లలకు తప్ప పెద్ద వారికి అస్సలు పనికిరావు. ఈ కారు విషయంలో కస్టమర్లను ఆకట్టుకునే ప్రధానం విషయం ఏదైనా ఉంది అంటే దాని ధర మరియు 7-సీటర్ సామర్థ్యం.

కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమై, చరిత్రలో మిగిలిపోయిన టాప్ 5 ఎమ్‌పివిలు..

ఆ సమయంలో ఇది భారత ఎమ్‌పివి విభాగంలోనే అత్యంత చవకైన ఎమ్‌పివిగా ఉండేది. అయితే, సేఫ్టీ విషయంలో మాత్రం ఇది సున్నాగా ఉంది. క్రాష్ టెస్ట్‌లో ఈ వాహనం జీరో స్టార్ రేటింగ్ పొందింది మరియు ఇందులో డాట్సన్ గో ప్లస్ యొక్క స్ట్రక్చర్ అస్థిరంగా రేట్ చేయబడింది. అంతేకాకుండా, ఈ వాహనం యొక్క డిజైన్ కూడా ప్రజలను ఆకర్షించలేకపోయింది. మరోవైపు ఇది చవకైన బ్రాండ్‌గా మరియు దేశంలో అస్థిరమైన బ్రాండ్‌గా పేరు తెచ్చుకొంది. ఫలితంగా, ఈ కారు కూడా భారత ఆటోమొబైల్ చరిత్రలో ఓ పేజీగా మిగిలిపోయింది.

Most Read Articles

English summary
Popular mpvs that were failed to attract customers in india
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X