మెర్సిడెస్‌ లగ్జరీ ఎలక్ట్రిక్‌ కారును కొనుగోలు చేసిన ప్రముఖ సింగర్‌.. సింగిల్ ఛార్జింగ్‌తో 857 కి.మీ రేంజ్‌..!

ఇటీవల కాలంలో అనేక మంది సెలబ్రిటీలు ఎలక్ట్రిక్‌ కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బాలీవుడ్‌ సహా టాలీవుడ్‌, కోలీవుట్‌ ప్రముఖులు అనేక మంది ఇప్పటికే లగ్జరీ ఎలక్ట్రిక్‌ కార్లను కొనుగోలు చేశారు. తాజాగా ఆ జాబితాలో షాన్‌గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ సింగర్‌ శంతను ముఖర్జీ చేశారు. శంతను ముఖర్జీ లగ్జరీ మెర్సిడెస్‌ బెంజ్‌ ఎలక్ట్రిక్‌ కారును కొనుగోలు చేశారు.

ముంబైలోని గాయకుడు శంతను ముఖర్జీ ఇంట్లో మెర్సిడెస్‌ బెంజ్‌ EQS 580 4Matic (Mercedes Benz EQS 580 4Matic) ఎలక్ట్రిక్‌ సెడాన్‌ను డెలివరి తీసుకున్నారు. తన కుటుంబ సభ్యులుతో కలిసి పూజలు నిర్వహించారు. భార్య రాధిక ముఖర్జీ, కుమారుడు సోహమ్‌ ముఖర్జీ ఉన్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

buys Mercedes Benz EQS 580 4Matic

ధర రూ.1.62 కోట్లు : ప్రస్తుతం ఈ మెర్సిడెస్‌ బెంజ్‌ EQS 580 4Matic ఎలక్ట్రిక్‌ కారు ధర రూ.1.62 కోట్లు (ఎక్స్‌షోరూం) గా ఉంది. ఆన్‌రోడ్‌ ధర రూ.1.70 కోట్లుగా ఉంది. ఈ కారు సోడలైట్‌ బ్లూ రంగును కలిగి ఉంది. డిజైన్‌ పరంగా ఆకట్టుకుంది. దీంతోపాటు ఈ కారు అధునాతన ఫీచర్లు, మెరుగైన భద్రతా ఫీచర్లను కలిగి ఉంది.

31 నిమిషాల్లో భారీ బ్యాటరీని ఛార్జింగ్‌ చేయవచ్చు : ఈ మెర్సిడెస్‌ ఎలక్ట్రిక్‌ సెడాన్‌ 107.8 kWh బ్యాటరీని ప్యాక్‌ సహా 2 ఎలక్ట్రిక్‌ మోటార్లను కలిగి ఉంది. ఈ మోటార్‌ 523hp శక్తి, 855Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారును సులభంగా ఛార్జింగ్‌ చేసే వీలుంది. ఫాస్ట్‌ ఛార్జర్‌ను వినియోగించి బ్యాటరీని 0-80 శాతం ఛార్జింగ్‌ను కేవలం 31 నిమిషాల్లోనే చేయవచ్చు.

popular singer shaan buys Mercedes Benz EQS 580 4Matic

సింగల్‌ ఛార్జింగ్‌తో 857 కి.మీ రేంజ్‌ : సింగిల్ ఛార్జింగ్‌ ద్వారా ఈ మెర్సిడెస్‌ బెంజ్‌ EQS 580 4Matic సెడాన్‌ 857 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది. ఈ మెర్సిడెస్‌ బెంజ్ ఎలక్ట్రిక్‌ సెడాన్‌ కేవలం 4.3 సెకన్లలో 0-100kmph వేగాన్ని అందుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్‌ కారు గరిష్ఠంగా 210 కి.మీ వేగంతో ప్రయాణం చేయగలదు.

మెరుగైన ఫీచర్లు : రేంజ్‌తోపాటు ఈ మెర్సిడెస్‌ బెంజ్‌ EQS 580 4Matic సెడాన్‌ అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. 56 అంగుళాల MBUX హైపర్‌స్క్రీన్‌, 15-స్పీకర్‌ 710W బర్మెస్టర్ సౌండ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది. దీంతోపాటు మసాజ్‌ సీట్లు, మల్టీ జోన్‌ క్లైమెట్‌ కంట్రోల్‌, యాంబియంట్‌ లైటింగ్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

popular singer shaan adds Mercedes Benz EQS 580 4Matic to his garage

ADAS సహా కీలక సేఫ్టీ ఫీచర్లు : దీంతోపాటు భద్రత పరంగా 9 ఎయిర్‌బ్యాగ్‌లతోపాటు లేన్‌ డిపార్చర్‌ వార్నింగ్‌, లేన్‌ కీప్‌ అసిస్ట్‌ సహా ADAS (అడ్వాన్సడ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌)ను కలిగి ఉంది. ఇది యాక్టివ్‌ బ్రేక్ అసిస్ట్‌, యాక్టివ్‌ స్టీరింగ్‌ అసిస్ట్‌, యాక్టివ్‌ డిస్టెన్స్‌ అసిస్ట్‌ వంటి కీలక భద్రతా ఫీచర్లతో వస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Tuesday, February 6, 2024, 19:01 [IST]
English summary
Popular singer shaan adds mercedes benz eqs 580 4matic to his garage
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+