రూ.1.16 కోట్ల కారు కొన్న యూట్యూబర్.. సినీతారలకు ఏమాత్రం తగ్గని భువన్
ఆధునిక కాలంలో కేవలం సినీతారలు, సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు మరియు ఇతర ప్రముఖులు మాత్రమే కాకుండా.. చాలామంది యూట్యూబర్స్ కూడా ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ప్రముఖ యూట్యూబర్ 'భువన్ బామ్' ఖరీదైన ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన డిఫెండర్ కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన యూట్యూబ్ వీడియో కూడా అందుబాటులో ఉంది. ఇందులో బ్లాక్ కలర్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును చూడవచ్చు. ఇంతకీ ఈ కారు ధర ఎంత? ఇప్పటికే ల్యాండ్ రోవర్ కార్లను కలిగి ఉన్న సెలబ్రిటీలు ఎవరనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును గత కొన్ని నెలలుగా అనేక బాలీవుడ్ ప్రముఖులు, బిజినెస్ మ్యాన్స్ మరియు పొలిటికల్ లీడర్స్ కొనుగోలు చేశారు. ఇప్పుడు తాజాగా బీబీ కి వైన్స్ అనే యూట్యూబర్.. ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును కొనుగోలు చేశారు. వీడియోలో గమనించినట్లయితే.. బ్లాక్ కలర్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారులో వైట్ కలర్ దుస్తులతో భువన్ బామ్ కనిపించారు.

భువన్ బామ్ ముంబైలోని పాలి విలేజ్‌లోని ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆఫీస్‌కు వచ్చినట్లు కనిపిస్తుంది. ఆ సమయంలో ఫోటోలకు పోజులివ్వడం వంటివి కూడా చూడవచ్చు. కామెడీ స్కిట్‌లకు ప్రసిద్ధి చెందిన యూట్యూబర్ భువన్ బామ్ సాంటోరిని బ్లాక్ యొక్క క్లాసీ షేడ్‌లో ఫినిష్ చేయబడిన డిఫెండర్‌ను కొనుగోలు చేసినట్లు స్పష్టమవుతోంది. ఇది 10 స్పోక్ మెషిన్డ్ అల్లాయ్ వీల్స్ పొందినట్లు సమాచారం.
భువన్ బామ్ కొనుగోలు చేసిన డిఫెండర్ కారుకు ఫ్యాన్సీ నెంబర్ '0072' అని ఉండటం కూడా ఇక్కడ చూడవచ్చు. ఇది ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో రిజిస్టర్ చేయబడినట్లు సమాచారం. ఇది పెట్రోల్ ఇంజన్‌తో కూడిన హెచ్ఎస్ఈ వేరియంట్. ఇది 3.0-లీటర్ 6-సిలిండర్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ పొందుతుంది. ఇది గరిష్టంగా 394 బిహెచ్‌పీ పవర్ మరియు 550 Nm టార్క్ అందిస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.

అదే విధంగా ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110హెచ్ఎస్ఈ పెట్రోల్ 2.0 లీటర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 296 బిహెచ్‌పీ పవర్ మరియు 400 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. అద్భుతమైన డిజైన్ మరియు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు అద్భుతమైన పనితీరును అందిస్తుంది. ఈ కారణంగానే చాలామంది ఈ కార్లను ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు.
భువన్ బామ్ వద్ద ల్యాండ్ రోవర్ మాత్రమే కాకుండా బీఎండబ్ల్యూ ఎక్స్3 SUV కూడా ఉంది. ఇది 2.0 లీటర్ డీజిల్ మరియు 3.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. వీటి ధరలు రూ. 68.50 లక్షల నుంచి రూ. 87.50 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ కారులో భువన్ బామ్ ఎక్కువగా కనిపించకపోవడం గమనార్హం. అయితే ఇది కూడా మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది.
భువన్ బామ్ కాకుండా.. ఇతర యూట్యూబర్లయిన జట్ ప్రబ్జోత్, అజ్జు 008, హ్యారీ ఉప్పల్, అశ్విన్ సింగ్ టాకియార్ కూడా ఉన్నారు. వీరు కాకుండా.. ప్రముఖ సెలబ్రిటీలయిన సంజయ్ దత్, కరీనా కపూర్ మరియు అర్జున్ కపూర్ కూడా ల్యాండ్ రోవర్ కార్లను కలిగి ఉన్నారు. యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వంటి పొలిటికల్ లీడర్స్ కూడా ల్యాండ్ రోవర్ కార్లను కలిగి ఉన్నారు.


Click it and Unblock the Notifications








