ఖరీదైన లగ్జరీ కారుపై జై శ్రీరామ్‌ స్టిక్కర్‌.. ప్రపంచంలో తొలి కారు ఇదే..?

ప్రస్తుతం చాలా మంది తమ కార్లు, బైక్‌లపై తమకు నచ్చిన దేవుడి ఫోటోలు, లేదా ఇతర గుర్తులు, పేర్ల స్టిక్కర్లు అతికిస్తూ ఉంటారు. అయితే ఎక్కుక ఖరీదైన కార్లు, బైక్‌లపై ఇటువంటి ఫోటోలు, గుర్తులు, పేర్లు చాలా అరుదుగా కనిపిస్తాయి. అయితే తాజాగా ఓ యూట్యూబర్‌ తన ఖరీదైన కారుపై దేవుడు స్కిక్టర్లు అతికించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

'ఐ యామ్‌ నితిన్‌ ' అనే యూట్యూబ్‌ ఛానల్‌కు చెందిన మృదుల్‌.. తాను కొత్తగా కొనుగోలు చేసిన లగ్జరీ లంబోర్ఘిని హురాకాన్‌ ఎవో కారుపై 'జై శ్రీరామ్‌' స్టిక్కర్‌ను అతికించారు. గత వీడియోలో తన సబ్‌స్క్రైబర్లకు హామీ ఇచ్చిన విధంగా చేశాడు.

jai sriram stickers on lamborghini car

తన వీడియోకు 2 మిలియన్‌ లైక్‌లు, లక్ష కామెంట్లు వస్తే తన కొత్త లంబోర్గిని హురాకాన్‌ కారుపై జై శ్రీరామ్‌ అని స్టిక్కర్లు అతికిస్తానని చెప్పాడు. తన అంచనాలకు అనుగుణంగా సబ్‌స్క్రైబర్ల నుంచి స్పందన రావడంతో తన కారు బానెట్‌పై జై శ్రీరామ్‌ అంటూ హిందీలో స్టిక్కర్‌ అతికించాడు.

ఓ స్టిక్కర్‌ దుకాణంలో లంబోర్ఘిని హురాకాన్‌ కారు బానెట్‌పైన జై శ్రీరామ్ స్టిక్కర్‌ అతికించారు. అయితే యూట్యూబర్‌ మృదుల్‌ మరో కీలక విషయాన్ని వెల్లడించారు. ప్రపంచంలో ఈ తరహా స్టిక్కర్‌ కలిగి ఉన్న లంబోర్గిని కారు తమదే అని మృదుల్‌ చెప్పాడు.

jai sriram stickers on lamborghini car

ఎందుకంటే కస్టమర్లకు విక్రయించే కార్లలో ఎటువంటి మార్పులు చేయవద్దని ఫెరారీ సహా ఇతర ప్రముఖ కార్ల సంస్థలు షరతులు విధిస్తాయని మృదుల్‌ వెల్లడించాడు. కొన్నిసార్లు కార్లకు ఎటువంటి మార్పులు చేసినా.. వారంటీ రద్దుచేస్తారని సమాచారం. దాంతోపాటు అటువంటి లగ్జరీ కార్ల మరమ్మతులకు డబ్బులు కూడా చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. అయితే లంబోర్ఘిని కార్లకు ఇలాంటి షరతులు లేవని సమాచారం.

భారత్‌ మార్కెట్‌లో లంబోర్ఘిని హురాకాన్‌ ఎవో కారు ధర రూ.3.21 కోట్ల నుంచి రూ.4.99 కోట్లుగా ఉంది. 2 సీటర్ మోడల్‌.. 5.2 లీటర్‌ V10 పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 610ps శక్తి, 600Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ ఆప్షన్‌తో లభిస్తుంది. కేవలం 3.4 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు గరిష్ఠ వేగం 260 kmphగా ఉంటుందని సంస్థ వెల్లడించింది.

jai sriram stickers on lamborghini car

దీంతోపాటు అనేక ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ డిస్‌ప్లే, 19 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ను కలిగి ఉంటుంది. పాడిల్‌ షిప్టర్‌, లెదర్‌ అప్స్టోరీతో వస్తుంది. లంబోర్ఘిని హురాకాన్‌ కార్‌కు ఫెరారీ కాలిఫోర్నియా టి, పోర్షే 911, ఆస్టన్‌ మార్టిన్‌ వాంటేజ్‌ రోడ్‌స్టర్‌ కార్లు గట్టి పోటీని ఇస్తున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, August 16, 2023, 16:04 [IST]
English summary
Popular youtuber printed jai sriram stickers on his luxury lamborghini car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+