'తౌక్టే' తుఫాను వల్ల భారీగా దెబ్బతిన్న లగ్జరీ కార్[వీడియో]

భారతదేశంలో కరోనా మహమ్మారి చాలా ఎక్కువగా వ్యాపిస్తూ ఎంతోమంది ప్రాణాలు హరిస్తుంటే మరో వైపు 'తౌక్టే' తుఫాను భారతదేశంలోని పశ్చిమ తీర ప్రాంతంలో వినాశనాన్ని సృష్టిస్తోంది. ఈ తుఫాను గంటకు 108 కిలోమీటర్ల వేగంతో వ్యాపిస్తూ అపారమైన నష్టాలను కలిగించింది.

'తౌక్టే' తుఫాను వల్ల భారీగా దెబ్బతిన్న లగ్జరీ కార్[వీడియో]

ఈ భయానకమైన తుఫాన్ వల్ల మనుషులు మాత్రమే కాకుండా గృహాలు మొదలైనవి కూడా చాలా వరకు దెబ్బతిన్నాయి. దీనికి సంబంధించి చాలా విషయాలు పత్రికల ద్వారా మరియు టీవీల ద్వారా చూస్తూనే ఉంటారు. అయితే ఈ తుఫాన్ వల్ల పోర్స్చే 718 బాక్స్టర్ లగ్జరీ కారు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం.

'తౌక్టే' తుఫాను వల్ల భారీగా దెబ్బతిన్న లగ్జరీ కార్[వీడియో]

దీనికి సంబంధించి సమాచారాన్ని పోర్స్చే 718 బాక్స్టర్ లగ్జరీ కారు ఓనర్ డాక్టర్ రుశింద్ర సిన్హా అందించారు. ఈ ప్రమాదంలో దెబ్బతిన్న కారుకి సంబంధించిన ఫోటోలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అయ్యాయి. ఈ కారు యొక్క వీడియో కూడా వెలుగులోకి వచ్చింది.

MOST READ:ఒకే వ్యక్తి 20 క్రూయిజర్ బైక్స్ కలిగి ఉన్నాడు, వాటి విలువ అక్షరాలా 3.5 కోట్లు

'తౌక్టే' తుఫాను వల్ల భారీగా దెబ్బతిన్న లగ్జరీ కార్[వీడియో]

ఈ వీడియోలో రుశింద్ర సిన్హా సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తాడు. ఇందులో అతడు తన కారును కాంప్లెక్స్ వద్ద పార్క్ చేసి ఉండటం చూడవచ్చు. ఈ యజమాని అంతకుముందు రోజు కారును ఉపయోగించలేదని తెలుస్తుంది. రాత్రి వారిని పిలిచిన సెక్యూరిటీ గార్డు ఆ రాత్రి కారు వర్షంలో మునిగిపోతోందని కారు ఓనర్ కి చెప్పాడు. ఆ తరువాత అతను మెట్ల మీదకు వెళ్లి కారును చూశానని చెప్పాడు.

'తౌక్టే' తుఫాను వల్ల భారీగా దెబ్బతిన్న లగ్జరీ కార్[వీడియో]

పోర్స్చే 718 బాక్స్టర్ సాధారణంగా కన్వర్టిబుల్ రూప్ తో అందించబడుతుంది. కావున దీనిని వాహనదారునికి అవసరమైన విధంగా ఓపెన్ చేయవచ్చు మరియు క్లోజ్ చేయవచ్చు. ఈ కారును కలిగి ఉన్న యజమానులు తరచుగా పైకప్పును ఉపయోగిస్తూ ఉంటారు.

MOST READ:80 మంది అరెస్ట్ 40 వాహనాలు సీజ్.. ఇదంతా ఒక క్రిమినల్ అంత్యక్రియల్లో పాల్గొన్న ఫలితం

'తౌక్టే' తుఫాను వల్ల భారీగా దెబ్బతిన్న లగ్జరీ కార్[వీడియో]

ఈ విధంగా అతను కన్వర్టిబుల్ రూప్ ను కప్పాడు. కానీ రూప్ అధిక గాలులతో ఎగిరిపోవడం వల్ల, కారు లోపలి భాగం ఎక్కువగా తడిసిపోయింది. వర్షపు నీరు అక్కడ చేరడం వల్ల కారు యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కొంత ప్రభావితమవవుతుంది. ఆ సమయంలో ఇన్స్ట్రుమెంట్ స్క్రీన్ "సిస్టమ్ ఎర్రర్" ను చూపిస్తుందని యజమాని వీడియోలో చెప్పారు.

'తౌక్టే' తుఫాను వల్ల భారీగా దెబ్బతిన్న లగ్జరీ కార్[వీడియో]

ఈ విధంగా జరగకుండా వుండాలంటే కార్ యొక్క రూప్ భాగం కప్పబడి ఉండాలి. ఆ సమయంలో కార్ ఓనర్ డ్రైవర్ కి కార్ కీ ఇచ్చి పైకప్పును మూసివేయమని చెప్పాడు. అయితే డ్రైవర్ కీ ఆన్ కారు స్టార్ట్ చేసిన వెంటనే అది పూర్తి వేగంతో సమీపంలోని ఫిల్లర్ ని డాష్ ఇచ్చింది. స్తంభం మీద కూలిపోయింది.

MOST READ:లాక్‌డౌన్ లో రోడ్డుపై కనిపించిన కొత్త జంట మెడలో పూల మాలలు వేసిన పోలీసులు[వీడియో]

ఇది జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. కారు ఎలా ముందుకు సాగిందో కూడా తెలియదు. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటివి జరగడం జరగలేదని, అసలు వినలేదని కూడా రుశింద్ర సిన్హా విలపించారు. పైకప్పు ఆటోమాటిక్ గా తెరుచుకోవడం వల్ల క్యాబిన్లోకి వెళ్ళిన వర్షపు నీరు ఇన్స్ట్రుమెంట్ సిస్టమ్‌లోకి ప్రవేశించిందని, తద్వారా కీ ఆన్ చేయడానికి ముందే కారు గేర్‌లో ఉంటుందని తెలిసింది.

'తౌక్టే' తుఫాను వల్ల భారీగా దెబ్బతిన్న లగ్జరీ కార్[వీడియో]

ఈ సంఘటనంలో ప్రమాదానికి గురైన కారుకి సంబంధించిన బీమా పొందడానికి ప్రయత్నిస్తున్నానని కార్ ఓనర్ వీడియోలో పేర్కొన్నారు. కానీ ఈ భీమా పొందటానికి చాలా రోజులు పడుతుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన సిసిటివి వీడియో కూడా అవసరం. కానీ అలాంటి వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు. రుశింద్ర పొరుగువారి ఇంటి నుంచి సిసిటివి వీడియో తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏది ఏమైనా ఈ కారుకి భారీగా ప్రమాదం జరిగింది. కావున దీనిని ఉపయోగించడం చాలా కష్టం.

MOST READ:ఆటోపైలట్ మోడ్‌లో స్టంట్ చేసిన ఇండో-అమెరికన్ అరెస్ట్; వివరాలు

Most Read Articles

English summary
Porsche 718 Boxster Damaged Due To Tauktae Cyclone. Read in Telugu.
Story first published: Wednesday, May 19, 2021, 17:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X