తక్కువ ఖర్చుతో పోర్షే 911 తరహా ఎలక్ట్రిక్‌ కారు.. ఈ వీడియో చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు.!

భారత్‌లో తయారీ సంస్థల అనుమతి లేకుండా కార్లలో మార్పులు చేయడం చ‌ట్టరీత్యా నేరంగా అయితే కొన్ని గ్యారేజీలు మాత్రం పాత కార్లను లగ్జరీ కార్ల మాదిరిగా తయారుచేస్తున్నాయి. కేరళకు చెందిన రాకేష్‌ తాజాగా అద్భుతం చేశాడు.

రాకేష్‌ బాబు అనే యువకుడు లగ్జరీ పోర్షే 911 (Porsche 911) తరహా మినియేచర్‌ ఎలక్ట్రిక్‌ కారును తయారు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. అనేక మంది నెటిజన్లు ఈ వీడియోపై పొగడ్తలు కురిపిస్తున్నారు.

porsche 911

రాకేష్‌ బాబు ఇప్పటికే అనేక పాత వాహనాలను మార్పులు చేసి ప్రసిద్ది చెందాడు. పిల్లల కోసం తన గ్యారేజీలో పోర్షే 911 మినియేచర్‌ను పోలిన ఎలక్ట్రిక్‌ కారును (Porsche 911 miniature) తయారు చేశాడు. ఈ కారు ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ ఎలక్ట్రిక్‌ కారు ముందు భాగం పోర్షే 911ని పోలి ఉంటుంది. ఈ కారుకు టీవీఎస్ XL100 హెడ్‌ ల్యాంప్ అమర్చారు. మరియు ఫాగ్‌ ల్యాంప్‌, ఏంజెల్‌ లైట్లను ఏర్పాటుచేశారు. హోండా యాక్టివా నుంచి స‌స్పెన్షన్‌ సెటప్‌ను తీసుకున్నారు. అదే విధంగా అల్లాయ్ తరహా వీల్స్‌ను ఏర్పాటుచేశారు.

kerala miniature car builder

పిల్లలకు ప్రత్యేకం : సాధారణ పోర్షే 911 కారులో పోలిస్తే.. కేరళకు చెందిన రాకేష్‌ బాబు తయారుచేసిన ఎలక్ట్రిక్‌ కారులో పిల్లలు సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు. రూఫ్‌ను ఖాళీగా ఉంచారు. అదే ఇంటీరియర్‌ మాత్రం ఆకట్టుకొనేలా డిజైన్‌ చేశారు. కార్లు లైట్లు సహా ముందుకు, వెనక్కి వెళ్లేందుకు ప్రత్యేక స్విచ్‌లను కలిగి ఉన్నాయి. కారు వెలుపలి భాగం పసుపు రంగులో పెయింటింగ్ చేశారు.

40-50 కి.మీ రేంజ్ : రాకేష్‌ బాబు తయారు చేసిన ఎలక్ట్రిక్‌ కారు 48V బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. 750W ఎలక్ట్రిక్ మోటార్‌ను వినియోగించారు. ఈ బ్యాటరీ సింగిల్ ఛార్జింగ్‌తో 40-50 కి.మీ రేంజ్‌ ఇస్తుందని రాకేష్‌ బాబు తెలిపారు. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌ వెనుక చక్రాలకు శక్తిని పంపిస్తుంది.

man builds porsche 911 electric car miniature

*కొన్ని రోజుల క్రితం కేరళ రాష్ట్రానికే చెందిన హదీఫ్‌.. పాత మారుతి 800 కారును లగ్జరీ రోల్స్‌ రాయిస్‌ కారుగా మార్చాడు. అది కూడా కేవలం రూ.45 వేలు మాత్రమే ఖర్చు అయినట్లు తెలిపాడు. సాధారణ కార్లను లగ్జరీ కార్లుగా మార్చడమంటే తనకు చాలా ఇష్టమని హదీఫ్‌ తెలిపాడు.

మారుతి 800 కారుకు కొన్ని మార్పులు చేసి రోల్స్‌ రాయిస్ కారుగా తయారు చేశాడు. కారు ఇంటీరియర్‌, ఎక్స్‌టీరియర్‌లో భారీ మార్పులు చేశాడు. ముందు భాగంలో పెద్ద సైజు గ్రిల్‌ అమర్చాడు. మరియు బ్యానెట్‌పై స్పిరిట్‌ ఆఫ్ ఎక్స్‌టసీ అనే పేరును జత చేశాడు. ఫలితంగా కారుకు మంచి లుక్ వచ్చింది. దీంతోపాటు కార్లలో ఉండే బీఎండబ్ల్యూ తరహా ఫీచర్లను అమర్చాడు.

kerala man builds porsche 911 electric car miniature

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Monday, October 23, 2023, 18:09 [IST]
English summary
Porsche 911 electric car miniature made by kerala miniature car builder
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+