ఇదేంది భయ్యా.. కార్ల అమ్మకాల్లో లాస్ వచ్చిందా ఏంటి.. నెయ్యి అమ్ముకుంటుంది ఈ కంపెనీ

ప్రపంచంలోని అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను తయారు చేసే పోర్షే కంపెనీ ఇప్పుడు నెయ్యిని కూడా తయారు చేసి అమ్ముతోందంటూ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో వైరల్ అయ్యింది. ఈ వార్త చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. పోర్షే వంటి ప్రీమియం బ్రాండ్‌లు బ్యాగులు, పర్సులు, వాటర్ బాటిల్స్ వంటి లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను విక్రయించడం తెలిసిందే, కానీ ఆహార ఉత్పత్తుల విక్రయం గురించి తెలిసి అందరూ షాక్ అయ్యారు. అసలు ఈ వీడియోలో ఉన్న నిజానిజాలు ఏమిటి? పోర్షే నిజంగా నెయ్యి అమ్ముతోందా? ఈ వైరల్ వీడియో వెనుక ఉన్న వాస్తవాలను ఈ వార్తలో పరిశీలిద్దాం.

లగ్జరీ కార్లకు పేరుగాంచిన పోర్షే (Porsche) కంపెనీ ఇప్పుడు నెయ్యిని కూడా అమ్ముతోందనే వార్త సోషల్ మీడియాలో కలకలం రేపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో abhisheikk అనే అకౌంట్ నుంచి విడుదలైన ఒక వీడియోలో, పోర్షే సెంటర్‌లో పోర్షే బ్రాండ్ ఉన్న నెయ్యి బాటిల్స్ అమ్ముడవుతున్నాయని చూపించారు. ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ కార్ల ప్రియులను, సోషల్ మీడియా యూజర్లను ఆశ్చర్యానికి గురిచేసింది.

సాధారణంగా పోర్షే వంటి ప్రీమియం బ్రాండ్‌లు తమ బ్రాండ్ విలువను పెంచుకోవడానికి వివిధ రకాల లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను విక్రయిస్తాయి. బ్యాగులు, పర్సులు, జాకెట్‌లు, వాటర్ బాటిల్స్, టీ కప్పులు వంటివి పోర్షే బ్రాండ్‌తో విక్రయించడం చాలా మందికి తెలుసు.

Porsche Ghee Viral Video Is the Luxury Car Brand Selling Ghee The Truth Behind the Buzz

అయితే, నెయ్యి విక్రయం అనే వార్త చాలా మందిని ఆశ్చర్యంలో పడేసింది. వైరల్ వీడియోలో చూపించిన నెయ్యి బాటిల్‌పై పోర్షే లోగో స్పష్టంగా కనిపిస్తోంది. ఇది చూసిన చాలా మంది ఈ వీడియోను విపరీతంగా షేర్ చేశారు.

ఈ వీడియో నిజానిజాలపై డ్రైవ్‌స్పార్క్ చేసిన పరిశోధనలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. వీడియోను పోస్ట్ చేసిన అభిషేక్ అనే వ్యక్తి @porschecentredubai, @porsche.middleeast, @porsche, porsche_club_uae వంటి పేజీలను ట్యాగ్ చేశారు. దీంతో దుబాయ్‌లోని పోర్షే సెంటర్‌లో ఈ నెయ్యి అందుబాటులో ఉందా అని పరిశీలించారు.

Porsche Ghee Viral Video Is the Luxury Car Brand Selling Ghee The Truth Behind the Buzz

అయితే, పోర్షే అధికారిక వెబ్‌సైట్లలో గానీ, దుబాయ్ పోర్షే సెంటర్ల వెబ్‌సైట్లలో గానీ నెయ్యి అమ్మకాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. పోర్షే లైఫ్‌స్టైల్ ఉత్పత్తుల జాబితాలో నెయ్యి ప్రస్తావన ఎక్కడా కనిపించలేదు. ఆన్‌లైన్‌లో పోర్షే నెయ్యి అని వెతికినా ఎలాంటి నమ్మదగిన సమాచారం లేదా ఉత్పత్తి లభ్యత కనిపించలేదు.

ఈ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి కూడా ఈ నెయ్యిని ఎలా, ఎక్కడ కొనుగోలు చేయవచ్చనే వివరాలను స్పష్టంగా వెల్లడించలేదు. దీంతో పోర్షే నెయ్యి అనేది నిజమా లేక ఒక రూమరా అనే సందిగ్ధత ప్రజల్లో ఇంకా కొనసాగుతోంది.

ఈ వీడియోపై నెటిజన్లు అనేక ఫన్నీ కామెంట్లు చేశారు. ఒకరు అందుకేనేమో పోర్షే కార్లు అంత స్మూత్‌గా వెళ్తున్నాయి అని సరదాగా కామెంట్ చేశారు. మరొకరు లంబోర్ఘిని (Lamborghini) కంపెనీ తమ పేరులో Ghee వస్తుంది కాబట్టి వాళ్లు కూడా ఇలా చేయొచ్చు అని చమత్కరించారు. ఇంకొకరు 9/11 అని రేటింగ్ ఇచ్చారు(ఇది పోర్షే 911 కారును సూచిస్తుంది) అని రాశారు. ఈ కామెంట్స్ చూస్తే ఈ వార్త ఎంత వినోదాత్మకంగా మారిందో అర్థమవుతుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: పోర్షే కంపెనీ లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను విక్రయిస్తున్నప్పటికీ, నెయ్యి ఉత్పత్తి, అమ్మకాల గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ వీడియో ఆథెంటిసిటీ అనుమానాస్పదంగానే ఉంది. దీనిపై పోర్షే సంస్థ స్పష్టమైన ప్రకటన చేస్తేనే నిజం తెలుస్తుంది. అంతవరకు ఇది ఒక వైరల్ పుకారుగానే మిగిలిపోతుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, September 30, 2025, 16:26 [IST]
English summary
Porsche ghee viral video is the luxury car brand selling ghee the truth behind the buzz
Read more on: #porsche #luxuary car #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+