జేమ్స్‌బాండ్ మూవీ షూట్ కాదండోయ్... పోర్షే ప్యానమెరా ప్రదర్శన !!
అత్యంత ఖరీదైన కార్లు మార్కెట్లోకి విడుదలవుతున్నాయంటే వాటిని కోరుకునే కస్టమర్లు కూడా అందే భారీ స్థాయిలో వాటి విడుదలను కోరుకుంటారు. సాధారణ కార్లు విడుదలయ్యే పద్దతిలో విడుదలయితే కిక్కేముందు అంటారు లగ్జరీ కార్ల ప్రేమికులు. అయితే వారి అంచనాలకు ఏ మాత్రం అందని రీతిలో పోర్షే తమ ప్యానమెరా కారును లిథివేనియాలో ప్రదర్శించింది.

అక్కడ జరిగిన సన్నివేశాన్ని తిలకించిన తరువాత అదేదో గిన్నిస్ బుక్ రికార్డ్ లేదా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల కోసం ప్రత్నిస్తున్నారా అని ఆశ్చర్యమేస్తుంది.

జర్మనీకి చెందిన పోర్షే సంస్థ యొక్క ప్యానమెరా లగ్జరీ కారును గాలిలో వ్రేళాడదీసుకుని హెలికాఫ్టర్ సహాయంతో నాలుగు చక్రాలకు తాడులతో హెలికాఫ్టర్‌కు అనుసంధానం చేస్తూ లిథువేనియాలోకి డెలివరీ ఇచ్చారు.

దీనిని తిలకించడానికి భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. ఒక విధంగా చెప్పాలి అంటే చిన్న పిల్లల బొమ్మలాటలా ఉంటుంది. అయితే ఇది అక్షరాలా నిజం.

రెండవ తరానికి చెందిన పోర్షే ప్యానమెరా ప్రారంభంలో మూడు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది.

రెండవ తరానికి చెందిన ప్యానమెరాలోని 4ఎస్ వేరియంట్ 434బిహెచ్‌పి పవర్, 4ఎస్ డీజల్ వేరియంట్ 416బిహెచ్‌పి పవర్ మరియు టాప్ ఎండ్ వేరియంట్ టుర్బో సుమారుగా 542బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

రెండవ తరానికి చెందిన ప్యానమెరాలోని 4ఎస్ వేరియంట్ 434బిహెచ్‌పి పవర్, 4ఎస్ డీజల్ వేరియంట్ 416బిహెచ్‌పి పవర్ మరియు టాప్ ఎండ్ వేరియంట్ టుర్బో సుమారుగా 542బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

పోర్షే ఈ ప్యానమెరా సెకండ్ జనరేషన్‌ను వచ్చే నవంబర్ నాటికి యూరోపియన్ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానుంది. మరియు వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి హైబ్రిడ్‌ను కూడా తీసుకురానుంది.

పోర్షే సంస్థ ఈ ప్యానమెరాకు చెందిన ధర వివరాలను వెల్లడించలేదు. మరియు విడుదల వివరాలు కూడా వెల్లడవ్వలేదు. అయితే అతి త్వరలో ప్రారంభం కానున్న ప్యారిస్ మోటార్ షో లో దీనిని ప్రదర్శించనున్నారు.

సమయానికి అనుగుణంగా కూడా మరిన్ని వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురానుంది పోర్షే. వాటిలో అదనంగా 4-లీటర్ల సామర్థ్యం ఉన్న వి8 ఇంజన్‌ను అందివ్వనున్నారు.

ప్యానమెరాలోని టాప్ ఎండ్ వేరియంట్ల హైబ్రిడ్‌లో అందివ్వనున్న ఈ ఇంజన్ సుమారుగా 700బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయును.

చైనాలో విమాన రెస్టారెంట్: భారత్‌లో ఎక్కడుందో తెలుసా ?

- ఏ రిస్కు లేకుండా కారు భీమా చేసుకోండి.... పూర్తి వివరాలకు !!


Click it and Unblock the Notifications








