కరోనా ఎఫెక్ట్ : కారులోనే పోర్టబుల్ టాయిలెట్

భారతదేశంలో కరోనా వైరస్ రోజు రోజుకి అధికంగా వ్యాపిస్తుంది. ఈ భయంకరమైన వైరస్ సంక్రమణ కేసులు కూడా ఎక్కువవుతున్నాయి. కరోనా వైరస్ పబ్లిక్ టాయిలెట్స్ వల్ల వ్యాపిస్తుందనే భయంతో ప్రజలు చాలా దూరం ప్రయాణించడానికి ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో భాగంగా మహీంద్రా బొలెరో కారులో ప్రయాణికులకు అనుకూలంగా పోర్టబుల్ టాయిలెట్ ఏర్పాటు చేయడం జరిగింది.

కరోనా ఎఫెక్ట్ : కారులోనే పోర్టబుల్ టాయిలెట్

మహీంద్రా బొలెరో ఎస్‌యూవీలో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునేవారికి పోర్టబుల్ టాయిలెట్ అమర్చారు. కేరళకు చెందిన ఓజాస్ ఆటోమొబైల్స్, టాయిలెట్ సీటును మహీంద్రా బొలెరోలో ప్రత్యేకంగా రూపొందించారు. దీనిని ఏర్పాటుచేయడానికి కారులోని వెనుక సీటు తొలగించబడింది. ఇది బూట్ స్థలాన్ని కూడా తగ్గిస్తుంది.

కరోనా ఎఫెక్ట్ : కారులోనే పోర్టబుల్ టాయిలెట్

ఒకవేళ కావాలనుకుంటే కారులో సీటును తిరిగి అమర్చవచ్చు. దీనికి పెద్దగా ప్రయత్నం అవసరం లేదు. ఈ టాయిలెట్‌లో ఫ్లష్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. కరోనా సంక్రమణ వ్యాప్తిని ట్రాక్ చేస్తూ, సన్నిహితంగా పని చేయడానికి ఇది ప్రత్యేకంగా రూపొందించబడింది.

MOST READ:అక్కడ మోటార్ సైకిల్స్ ఉపయోగించడం నిషేధం, ఎక్కడో తెలుసా !

కరోనా ఎఫెక్ట్ : కారులోనే పోర్టబుల్ టాయిలెట్

ఫ్లష్ నడపడానికి 12 వోల్ట్ మోటారును అమర్చారు. ఈ మోటారు కారు యొక్క బ్యాటరీ నుండి ఫ్లష్ చేయడానికి శక్తిని పొందుతుంది. రెండు అల్యూమినియం ట్యాంకులు అందించబడ్డాయి. ఇవి ప్రయాణికులు ఉపయోగించుకోవడానికి చాలా అనుకూలంగా ఉటుంది.

కరోనా ఎఫెక్ట్ : కారులోనే పోర్టబుల్ టాయిలెట్

ట్యాంక్ GRP పూతతో కూడిన అల్యూమినియంతో తయారు చేయబడింది. ఈ టాయిలెట్ విమానాలలో ఉపయోగించే పోర్టబుల్ టాయిలెట్ లాంటిది. సబ్బు, తువ్వాళ్లు మరియు హ్యాండ్ శానిటైజర్లకు కూడా స్థలం ఏర్పాటుచేయబడి ఉంటుంది.

MOST READ:ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ మోనోవీల్

కరోనా ఎఫెక్ట్ : కారులోనే పోర్టబుల్ టాయిలెట్

మహీంద్రా బొలెరోలో ఏర్పాటు చేసిన ఈ పోర్టబుల్ టాయిలెట్ ధర రూ. 65,000. చివరి సీటు దగ్గర ఉన్న కిటికీలకు తెరలు ఉన్నాయి. ఈ పోర్టబుల్ టాయిలెట్ మహీంద్రా బొలెరోలో మాత్రమే కాకుండా, నేల నుండి పైకప్పు వరకు 40 అంగుళాలు కొలిచే ఏ కారులోనైనా ఏర్పాటు చేయవచ్చు.

కరోనా ఎఫెక్ట్ : కారులోనే పోర్టబుల్ టాయిలెట్

మహీంద్రా బొలెరో కారులో ఇతర మార్పులు లేకుండా టాయిలెట్ అమర్చారు. మహీంద్రా సిఇఓ ఆనంద్ మహీంద్రా కూడా ఈ ప్రాజెక్ట్ భిన్నంగా ఉందని ప్రశంసించారు. ఓజాస్ ఆటోమొబైల్ కార్లను తయారుచేసే ప్రముఖ సంస్థ. కరోనా సంక్షోభం ఉన్న ఈ కష్ట సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి ఈ పోర్టబుల్ టాయిలెట్ ఏర్పాటు చేసి చాలా ఉపయోగపడేలా చేసింది.

Image Courtesy: Manorama Online

MOST READ: మీకు తెలుసా.. అక్కడ ట్రైన్ బోగి రెస్టారెంట్‌గా మారింది

Most Read Articles

English summary
Portable toilet seat fitted in Mahindra Bolero boot. Read in Telugu.
Story first published: Friday, June 26, 2020, 11:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X