క్రిమినల్స్ నుండి సీజ్ చేసిన కార్లతో మంచి పనులు చేస్తున్న పోలీసులు!

ప్రమాదాల్లో గాయపడి, అవయవ మార్పిడి అవసరమైన వారికి సకాలంలో అవయవాలను అందజేయగలితే వారికి సరికొత్త జీవితం ప్రసాదించడం సాధ్యమవుతుంది. అవయవ దాతల నుండి సేకరించిన అవయవాలను వీలైనంత త్వరగా ఆస్పత్రికి చేర్చగలిగితేనే వాటికి ఫలితం ఉంటుంది.

క్రిమినల్స్ నుండి సీజ్ చేసిన కార్లతో మంచి పనులు చేస్తున్న పోలీసులు!

మరి అంత వేగంగా అవయవాలను ఆస్పత్రులకు చేర్చాలంటే, అంతే వేగవంతమైన రవాణా వ్యవస్థ కూడా అవసరం అవుతుంది. సరిగ్గా ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకొన్న పోర్చుగల్ యొక్క నేషనల్ రిపబ్లికన్ గార్డ్ ఓ సూపర్ కారును అవయవ మార్పిడి రవాణా వాహనంగా మార్చింది.

క్రిమినల్స్ నుండి సీజ్ చేసిన కార్లతో మంచి పనులు చేస్తున్న పోలీసులు!

పోర్చుగల్ నేషనల్ రిపబ్లికన్ గార్డ్ తమ గ్యారేజీలో కొత్తగా నిస్సాన్ జిటి-ఆర్ సూపర్‌కారును జోడించింది. ఇందులో పెద్ద విషయమేముంది అనుకోకండి. ఈ మంచి కార్యం కోసం ఉపయోగిస్తున్న నిస్సాజన్ జిటి-ఆర్ సూపర్‌కారును ఓ క్రిమినల్ నుండి సీజ్ చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

MOST READ:2021 VIVO IPL అధికారిక భాగస్వామిగా టాటా సఫారీ

క్రిమినల్స్ నుండి సీజ్ చేసిన కార్లతో మంచి పనులు చేస్తున్న పోలీసులు!

పోర్చుగల్ రక్షణ అధికారులు ఓ క్రిమినల్ కేసులో మరో కారుతో పాటుగా ఈ స్పోర్ట్స్ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇలా సీజ్ చేసిన కారుని నిరుపయోగంగా చెత్త క్రింద పడేయటానికి బదులుగాస దానిని మంచి పనుల కోసం ఉపయోగించాలని అక్కడి అధికారుల భావించారు.

క్రిమినల్స్ నుండి సీజ్ చేసిన కార్లతో మంచి పనులు చేస్తున్న పోలీసులు!

అందుకే, ఇప్పుడు ఈ సూపర్‌కారును అత్యవసరంలో ఉన్న వారికి అవయవాలను రవాణా చేయడం కోసం ఉపయోగిస్తున్నారు. ఈ మేరకు ది గార్డా నేషనల్ రిపబ్లికనా (నేషనల్ రిపబ్లికన్ గార్డ్ ఆఫ్ పోర్చుగల్) తమ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో ఈ కారుకు సంబంధించిన చిత్రాలను కూడా పోస్ట్ చేసింది.

MOST READ:అర్ధరాత్రి స్విగ్గీ డెలివరీ బాయ్‌కి కెటిఎమ్ బైక్ ఇచ్చిన వ్యక్తి, ఎందుకో తెలుసా?

క్రిమినల్స్ నుండి సీజ్ చేసిన కార్లతో మంచి పనులు చేస్తున్న పోలీసులు!

డార్క్ బ్లూ కలర్‍లో ఉన్న నిస్సాన్ జిటి-ఆర్ స్పోర్ట్స్ కారుపై అక్కడి పోలీసుల వాహనాలపై కనిపించే యల్లో మరియు టీల్ కలర్ పెయింట్‌తో దీనిని కస్టమైజ్ చేశారు. అంతేకాకుండా ఈ కారు బోనెట్ మరియు టెయిల్‌గేట్‌పై ‘ట్రాన్స్‌పోర్ట్ డి అర్గోస్' (ఆర్గాన్ ట్రాన్స్‌పోర్ట్) అనే స్టిక్కరింగ్ కూడా ఉంటుంది.

క్రిమినల్స్ నుండి సీజ్ చేసిన కార్లతో మంచి పనులు చేస్తున్న పోలీసులు!

అంతేకాకుండా, ఈ కారు లోపలి వైపు విండ్‌షీల్డ్ పైభాగంలో మరియు ఫ్రంట్ బంపర్‌రో పోలీసులు ఉపయోగించే స్ట్రోబ్ లైట్లను మరియు పెద్దగా శబ్ధం చేసే బీకన్లను కూడా ఉపయోగించారు. పోర్చుగల్ నేషనల్ రిపబ్లికన్ గార్డ్ తమ ఫేస్‌బుక్ ఖాతాలో ఈ ఫొటోను షేర్ చేస్తూ ‘అవయవ మార్పిడి యొక్క నాణ్యత మరియు భద్రత రవాణాకు అవసరమైన సమయాన్ని బట్టి ఉంటుంది' అని పేర్కొంది.

MOST READ:200 రూపాయల ట్రాఫిక్ ఫైన్ రద్దు కోసం రూ. 10,000 ఖర్చు చేసిన వ్యాపారవేత్త

క్రిమినల్స్ నుండి సీజ్ చేసిన కార్లతో మంచి పనులు చేస్తున్న పోలీసులు!

పోర్చుగల్ నేషనల్ రిపబ్లికన్ గార్డ్ ఇప్పటి వరకూ 2,836 అవయవ రవాణాలను నిర్వహించిందని, ఈ ప్రక్రియలో అర మిలియన్ కిలోమీటర్లకు పైగా ప్రయాణించిందని, ఇది ప్రశంసనీయమైన ఘనత అని పేర్కొంది. లిస్బన్ మరియు పోర్టో నగరాల్లో నిస్సాన్ జిటి-ఆర్‌తో పాటుగా స్వాధీనం చేసుకున్న ఇతర వాహనాన్ని కూడా అవయవ రవాణా కోసం ఉపయోగించనున్నారు.

క్రిమినల్స్ నుండి సీజ్ చేసిన కార్లతో మంచి పనులు చేస్తున్న పోలీసులు!

నిస్సాన్ జిటి-ఆర్ స్పోర్ట్స్ కార్ విషయానికి వస్తే, ఇది ఈ జపనీస్ బ్రాండ్ నుండి లభిస్తున్న శక్తివంతమైన మోడళ్లలో ఒకటి. ఈ సూపర్‌కారులో పవర్‌ఫుల్ 3.8-లీటర్, ట్విన్ టర్బోచార్జ్డ్, వి6 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 570 పిఎస్ పవర్‌ను మరియు 637 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

MOST READ:ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన జాగ్వార్ ఐ-పేస్ : ధర, ఫీచర్లు & వివరాలు

క్రిమినల్స్ నుండి సీజ్ చేసిన కార్లతో మంచి పనులు చేస్తున్న పోలీసులు!

ఈ ఇంజన్ 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానించబడి ఉంటుంది. ఈ కారు కేవలం 3 సెకన్ల కన్నా తక్కువ వ్యవధిలోనే గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. మనదేశంలో కూడా నిస్సాన్ జిటి-ఆర్ స్పోర్ట్స్ కార్ అందుబాటులో ఉంది. ఈ కారును కంపెనీ విదేశాల నుండి దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయిస్తుంది.

Most Read Articles

English summary
Portugal National Guard Uses Seized Nissan GT-R For Organ Transportation. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X