కారు కొనుగోలు చేస్తున్నారా... పవర్ విండోస్ గురించి ఈ విషయాలు తెలుసా..?
సాధారణంగా కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు చాలా మందికి అనేక సందేహాలు ఉంటాయి. ఎటువంటి ఫీచర్లు ఉన్న కార్లను కొనుగోలు చేయాలి, అసలు కార్లలో ఉండాల్సిన ఫీచర్లు ఏంటని తెగ ఆరా తీస్తుంటారు. అలాంటి ఫీచర్లలో పవర్ విండోస్ ఫీచర్ ఒకటి. అయితే పవర్ విండోస్ ఫీచర్ వల్ల లాభాలేంటి, నష్టాలేంటి అనేది ఈ కథనంలో తెలుసుకోండి.
ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న అనేక కార్లలో పవర్ విండోస్ ఫీచర్ కచ్ఛితంగా ఉంటుంది. అయితే గతంలో ఈ ఫీచర్ కేవలం ప్రీమియం కార్లకు మాత్రమే పరిమితం అయ్యేది. కార్ల అద్దాలను గతంలో మాన్యువల్‌గా తెరవాల్సి వచ్చేది. ప్రస్తుతం ఒక్క స్విచ్ ద్వారా అన్ని విండోస్‌ను ఒకేసారి నియంత్రించవచ్చు.

పవర్ విండోస్‌తో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. డ్రైవర్ సహా ఇతర ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణానికి సహకరిస్తాయి. ఎటువంటి శారీరక శ్రమ అవసరం లేకుండా. కేవలం ఒక్క బటన్‌ను నొక్కడం త్వారా విండోస్‌ను తెరవడం లేదా మూసివేయవచ్చు. ఇందుకోసం డ్రైవర్ సీట్ వద్ద ప్రత్యేకమైన స్విచ్ ఉంటుంది.
పవర్ విండోస్ కారణంగా అదనపు భద్రతను పొందుతారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఒకే సమయంలో అన్ని విండోస్‌ను వెంటనే మూసివేయవచ్చు లేదా తెరవచ్చు. వన్ టచ్ విండో సిస్టమ్ ఆధారంగా అన్నింటినీ నియంత్రించవచ్చు. ఫలితంగా అకస్మాత్తుగా వచ్చే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు.

పవర్ విండోస్ కారణంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దాంతోపాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఈ పవర్ విండోస్ కారణంగా కార్ల ధర కొంచెం అధికంగా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు నిర్వహణ, మరమ్మతు ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. పవర్ విండో మెకానిజం విఫలం అయితే రిపేర్ చేసేందుకు సాధారణం కంటే ఎక్కువ సమయం పడుతుంది.
దీంతోపాటు పవర్ విండోస్.. పూర్తిగా కార్లోని విద్యుత్ వ్యవస్థపైన ఆధార పడుతుంది. కార్లోని విద్యుత్ వ్యవస్థలో ఏదైనా సమస్య తలెత్తిన సమయంలో పవర్ విండోస్ సిస్టమ్ కూడా పనిచేయదు. అలాంటి సందర్భాల్లో కొంచెం అవస్థలు పడాల్సి వస్తుంది. అందువల్ల కార్లను కొనుగోలు చేసే సమయంలో పవర్ విండోస్ సిస్టమ్ ఫీచర్ ఉందా లేదా అనేది తెలుసుకోండి.

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య : కొత్త కార్లను కొనుగోలు చేసే సమయంలో పవర్ విండోస్ సహా ఇతర అనేక కీలక ఫీచర్ల ప్రయోజనాలు, వాటి వల్ల వచ్చే ఇబ్బందులను పూర్తిగా తెలుసుకొన్న తర్వాతే కార్లను కొనుగోలు చేయండి. దాంతోపాటు మీ వ్యక్తిగత అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవడం ఎంతో ఉత్తమం. పూర్తి అవగాహనతో ప్రవర్తించండి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








