తాను డిజైన్ చేసిన కారును తల్లి బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చిన కొడుకు.. వీడియో చూసారా?

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ డిజైన్ అండ్ క్రియేటివ్ ఆఫీసర్ అయిన ప్రతాప్ బోస్.. ఇటీవల తన తల్లి కోసం XUV 3XO కొనుగోలు చేశారు. దీనికి సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎక్స్‌యూవీ 300 వంటి అనేక ఉత్పతుల డిజైన్ మరియు బ్రాండ్ లోగో రీడిజైన్ వెనుక ఉన్న ప్రతాప్ బోస్ కంపెనీ యొక్క ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ డెలివరీ తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం..

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కారును తన తల్లితో కలిసి డెలివరీ తీసుకున్న ప్రతాప్ బోస్.. సోషల్ మీడియాలో ఇలా పేర్కొన్నారు. ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ నాకు ఓ ప్రత్యేకమైన డెలివరీ. @MahindraXUV300 మరియు బృందానికి ధన్యవాదాలు అని వెల్లడించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు కొత్త కారు డెలివరీ తీసుకున్న ప్రతాప్ బోస్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Pratap Bose Buys Mahindra XUV 3XO For His Mother

నిజానికి ప్రతాప్ బోస్ ఈ కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కారును తన తల్లి కోసం కొనుగోలు చేశారు. ప్రతాప్ తల్లి మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ మీద ఆసక్తి చూపడం వల్ల ఈ కారును కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. తాను ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా ఉన్నప్పటికీ.. తాను డిజైన్ చేసిన కారును కొనుగోలు చేయడం ఇదే తొలిసారి అని ప్రతాప్ బోస్ వెల్లడించారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కారు కొనుగోలు చేసి ప్రతాప్ తల్లి 75వ పుట్టిన రోజు కానుకగా అందించారు. అయితే ఇక్కడ కనిపించే కారు ఏ వేరియంట్ అనేది తెలియడం లేదు. అయితే ఇది నలుపు రంగులో ఆకర్షణీయంగా ఉండటం చూడవచ్చు. ఈ మహీంద్రా కంపెనీ యొక్క కొత్త కారు ఇప్పటికే ఎంతోమంది కస్టమర్లను ఆకర్శించడం విజయం పొంది, గొప్ప అమ్మకాలను సాధించింది.

Pratap Bose Buys Mahindra XUV 3XO For His Mother

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ

మహీంద్రా కంపెనీ గత కొన్ని రోజులకు ముందే ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ లాంచ్ చేసింది. ఇది చూడటానికి కొంత ఎక్స్‌యూవీ 300 మాదిరిగా అనిపించినప్పటికీ అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ ప్రారంభించిన కేవలం గంట సమయంలో 50000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందగలిగింది. దీన్ని బట్టి చూస్తే ఈ కారుకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా ఇటీవలే డెలివరీలు ప్రారంభమయ్యాయి.

కంపెనీ ఇప్పటికే దేశవ్యాప్తంగా 3000 కంటే ఎక్కువ డెలివరీలను పూర్తి చేసింది. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ధర ఇండియన్ మార్కెట్లో రూ.7.49 లక్షల నుంచి రూ.15.49 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు మంచి డిజైన్ పొందుతుంది. ఇందులో సీ-షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు మరియు రీడిజైన్ చేయబడిన అల్లాయ్ వీల్స్ మొదలైనవి ఉన్నాయి.

ఫీచర్స్ విషయానికి వస్తే.. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ మాత్రమే కాకుండా పనోరమిక్ సన్‌రూఫ్‌ కూడా పొందుతుంది. వీటితో పాటు ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన పెద్ద 10.35 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, లెథెరెట్ అప్హోల్స్టరీ, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి మరిన్ని ఫీచర్స్ ఉన్నాయి.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Saturday, June 15, 2024, 12:00 [IST]
English summary
Pratap bose buys mahindra xuv 3xo for his mother birthday gift
Read more on: #off beat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+