ప్రీతి జింటా కారు చావుకొచ్చిన ఓప్రా విన్‌ఫ్రే పార్టీ..!!

Preity Zinta
టాక్ షో ద్వారా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఓప్రా విన్‌ఫ్రేను స్వాగతించేందుకు పర్మెషావర్ గోద్రెజ్ నిర్వహించిన వెల్‌కమ్ పార్టీ, బాలీవుడ్ నటి ప్రీతి జింటాకు మాత్రం చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఈ కార్యక్రమంలో ప్రీతి జింటా ఫేవరెట్ కారు తుక్కు తుక్కు అయిపోయింది. ప్రీతి జింటా పేర్కొన్న దాని ప్రకారం, ప్రశాతంగా సాగిపోతున్న ఆ సాయంత్ర సమయంలో ఆమె కోట్ (సందేశం) కోసం మీడియా ప్రతినిధులు ప్రీతి జింటా కారుపై నుండి ఒక్కసారిగా ఎగబటంతో, కారుకు గీతలు, సొట్టలు పడటమే కాకుండా సైడ్ మిర్రర్లను కూడా విరగొట్టారట.

ఈ విషయాన్ని ప్రీతి జింటా స్వయంగా తన ట్విట్వర్ ఖాతాలో పేర్కొన్నారు. "ఇలాంటి కార్యక్రమాల్లో అదే ఏ మీడియా వ్యక్తి అయినా గాయపడి ఉండుంటే, అది పెద్ద సెన్సేషన్ న్యూస్‌గా మారుండేది. రెండు పోలీసు వ్యానులు, కనీసం 10 మంది భద్రతా సిబ్బంధి ఉన్నప్పటికీ ఈ సంఘటన చోటుచేసుకుందంటూ" మైక్రోబ్లాగింగ్ సైట్‌లో ప్రీతి జింటా పేర్కొంది.

గోద్రెజ్ పార్టీకి హాజరు కావడానికి ముందుగా, ఓప్రా విన్‌ఫ్రే ఐశ్యర్య-అభిషేక్ బచ్చన్‌లకు జన్మించిన పాపను చూసేందుకు అమితాబచ్ బచ్చన్ ఇంటికి వెళ్లింది. అక్కడి నుండి అమితాబ్ బచ్చనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ఆమెను పార్టీ స్థలానికి తీసుకువచ్చారు.

నెక్స్ట్ ఛాప్టర్ అనే షోను రికార్డ్ చేసేందుకు, అలాగే జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు గానూ ఓప్రా విన్‌ఫ్రే ఇండియాకు విచ్చేసింది. భారత్లో ఇది ఆమె తొలి పర్యటన కావడంతో, ఆమెను సత్కరించేందుకు గానూ పర్మెషావర్ గోద్రెజ్ యొక్క జుహు రెసిడెన్స్‌లో ఓ అభినందన సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, అబిషేక్ బచ్చన్, శిల్పా శెట్టి, లారా దత్త వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖ సినీ నటులతో పాటుగా, ప్రముఖ నవాల రచయిత షోభా డి, ఆభరణాల డిజైనర్ ఫరా ఖాన్ అలీ తదితరులు హాజరయ్యారు.

More from DriveSpark

Article Published On: Wednesday, January 18, 2012, 16:22 [IST]
English summary
Bollywood actress Preity Zinta had a bad day yesterday after her car suffered severe damage in the hands of the press when whe attended the welcome party organized to welcome US Talk Show Queen Oprah Winfrey. The car suffered several scratches and dents when media persons pounced on it in an effort to get a quote from Ms Zinta. The actress vented her ire against the media persons through a micro blogging site.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+