జస్ట్ జోక్.. ప్రేమలు ‘ఆది' ఇంటికి కొత్త గెస్ట్.. వరుస హిట్లు కొట్టి కారు పట్టిన విలన్.. సినీతారల శుభాకాంక్షలు

ఇటీవల కాలంలో పెద్ద హీరోల సినిమాలే కాకుండా చిన్న సినిమాలు సైతం బాగా హిట్ అవుతున్నాయి. కంటెంట్ నచ్చితే చాలు చిన్న సినిమాను కూడా భారత ప్రేక్షకులు ఎక్కడికో తీసుకెళ్తుంటారు. ఇలాంటి వాటిలో చిన్న పాత్ర పోషించిన కూడా మంచి పేరు వస్తుంది. అలాంటిది తక్కువ బడ్జెట్‌లో చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన ఒక సినిమాలో కీ రోల్ పోషించిన నటుడికి మరింత పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అలాంటి నటుడే ప్రేమలు ఆది. ఈ సినిమా మళయాళంలో విడుదలై ఘన విజయం సాధించగా, తెలుగులో కూడా రిలీజ్ కాగా ఇక్కడ కూడా బిగ్ హిట్‌గా నిలిచింది. అన్ని వర్గాల వారి నుంచి కూడా ప్రేమలుకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అందులోని క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా నేచురల్‌గా నటించారు.

ముఖ్యంగా యూత్‌ ఈ సినిమాకు బాగా అట్రాక్ట్ అయ్యారు. ప్రేమలులో హీరో, హీరోయిన్‌తో పాటు మరో క్యారెక్టర్‌‌ కూడా ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. ఈ క్యారెక్టర్‌ పేరే 'ఆది'. సినిమాలో ఆది నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. 'జస్ట్ జోక్' అటూ అందరినీ నవ్విస్తూ, కొన్ని సార్లు కోపంగా, మరికొన్ని సమయాల్లో అమాయకంగా కనిపించే క్యారెక్టర్ పోషించిన ఆది ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచాడు.

Premalu Movie Actor New Volkswagen Taigun Gt

ప్రేమలు సక్సెస్ తర్వాత అతని రేంజ్ అమాంతం పెరిగిపోయింది. తెలుగులో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రేమలులో మాత్రమే కాకుండా తాజాగా వచ్చిన అమరన్ సినిమాలో కూడా మంచి నటన కనబరిచాడు. ఈ సినిమా కూడా బిగ్ హిట్‌గా నిలిచింది. వరుస హిట్‌లతో దూసుకుపోతున్న ఆది అసలు పేరు 'శ్యామ్‌మోహన్‌ మేధావి'.శ్యామ్ మొదట్లో షార్ట్ ఫిల్మ్‌లు చేయడం ద్వారా ఈ రంగంలోకి అడుగుపెట్టాడు. సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు.

వరుస హిట్లతో దూసుకుపోతున్న నటుడు ఇటీవల కొత్తగా ఫోక్స్‌వ్యాగన్(Volkswagen) కంపెనీకి చెందిన ఒక కారును కొనుగోలు చేశాడు. శ్యామ్ కొన్న మోడల్ పేరు 'టైగూన్ జీటీ(taigun gt)'. ఈ కొత్త మిడ్ సైజ్ ఎస్‌యూవీని కొచ్చి షోరూమ్‌ నుంచి తన భార్యతో కలిసి డెలివరీ అందుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను శ్యామ్ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్ట్ చేశారు. దీంతో ఆయనకు సినీతారల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Premalu Movie Actor Shyam Mohan Volkswagen Taigun Gt

శ్యామ్ కొన్నటువంటి ఫోక్స్‌వ్యాగన్ టైగూన్ జీటీ ధర రూ.14.08 లక్షలుగా ఉంది. ఇది 17- అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ మిడ్‌సైజ్ ఎస్‌యూవీ 1.0-లీటర్ TSI ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 113 bhp పవర్, 178 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. అలాగే, ఆటోమెటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉంది.

కారు ఇంటీరియర్‌లో చాలా అధునాతన ఫీచర్లు ఉన్నాయి. గ్లోస్ బ్లాక్ డ్యాష్‌బోర్డ్, బ్లాక్‌తో బ్లాక్ లెథెరెట్ అప్హోల్స్టరీ, అల్యూమినియం పెడల్స్, టచ్ స్క్రీన్ ఇన్పోటైన్‌మెంట్ సిస్టం, ఫ్రంట్ హెడ్‌రెస్ట్‌లపై జీటీ బ్యాడ్జింగ్‌, స్పోర్ట్ స్టీరింగ్ వీల్, స్మోక్డ్ LED హెడ్‌ల్యాంప్‌లు, కార్బన్ స్టీల్ గ్రే రూఫ్, సన్ వైజర్‌లు మొదలగు ఫీచర్లు ఉన్నాయి.

Actor Shyam Mohan New Volkswagen Taigun Gt

ప్రస్తుతం మార్కెట్లో ఇదే సీరిస్‌లో జీటీ ప్లస్ కూడా అందుబాటులో ఉంది. ఇది 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో 148 bhp పవర్, 250 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. జీటీ మోడల్‌లో ఉండే ఫీచర్లు జీటీ ప్లస్‌లో ఉన్నాయి. ఫెస్టివల్ సీజన్ ఇంకా కొద్ది రోజుల ఉన్న తరుణంలో జర్మనీ ఫోక్స్‌వ్యాగన్ తన జీటీ, జీటీ ప్లస్ మోడళ్లపై తగ్గింపులు, క్యాష్‌బ్యాక్‌లు, లాయల్టీ బోనస్‌లను అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, November 14, 2024, 12:20 [IST]
English summary
Premalu movie actor shyam mohan brings home new volkswagen taigun gt
Read more on: #volkswagen #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+