భారత రాష్ట్రపతి 'ద్రౌపతి ముర్ము' ఉపయోగించే కారు.. ఇదే: చూసారా..?

ముందుగా భారతదేశానికి 15 వ రాష్ట్రపతిగా పదవిని చేపట్టిన 'ద్రౌపతి ముర్ము' గారికి మా డ్రైవ్‌స్పార్క్ తరపున శుభాకాక్షలు. భారతదేశానికి ప్రధమ పౌరురాలుగా ఈ రోజు (2022 జులై 25) ప్రమాణస్వీకారం చేసిన 'ద్రౌపతి ముర్ము'(Draupadi Murmu) గురించి ఈ రోజు యావత్ భారతదేశానికి తెలుసు. ఎక్కడో ఒడిశా రాష్ట్రంలోని మయూర్‌భంజ్ జిల్లాలో 'ఊపర్‌బేడా గ్రామం' గిరిజన తెగలో పుట్టిన ముర్ము ఈ రోజు భారతదేశంలో అత్యున్నత పదవిని అలంకరించింది. ఇది భారతదేశం మొత్తం గర్వించదగ్గ విషయం.

భారత రాష్ట్రపతి 'ద్రౌపతి ముర్ము' ఉపయోగించే కారు.. ఇదే: చూసారా..?

'ద్రౌపతి ముర్ము' చిన్ననాటి నుంచి ఎన్నో ఆటంకాలను, కష్టాలను ఎదుర్కుంటూ.. సచివాలయంలో ఒక చిన్న ఉద్యోగంలో ప్రారంభమైన తన జీవితం ఈ రోజు అందరికి ఆదర్శప్రాయంగా నిలిచింది. నిజానికి సచివాలయంలో ఒక చిరుద్యోగి నుంచి ఈ రోజు భారతదేశానికి రాష్ట్రపతి అవ్వగలిగే స్థాయికి ఈమె ఎదిగింది అంటే.. తాను తన జీవితంతో ఒక యుద్ధం చేసిందనే చెప్పాలి.

భారత రాష్ట్రపతి 'ద్రౌపతి ముర్ము' ఉపయోగించే కారు.. ఇదే: చూసారా..?

ద్రౌపతి ముర్ము ఈ రోజు భారదేశానికి 15 వ రాష్ట్రపతి మాత్రమే కాదు.. మొదటి గిరిజన రాష్ట్రపతి కూడా. ముర్ము గిరిజన జాతిలో పుట్టిన ఆణిముత్యం.. ఈమె గురించి ఎన్ని చెప్పినా తక్కువే,

అయితే భారత రాష్ట్రపతిగా పదవిని స్వీకరించిన ముర్ము.. ఎలాంటి కారులో తిరగనుంది, ఆ కారు యొక్క విశేషాలేమిటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం.. రండి.

భారత రాష్ట్రపతి 'ద్రౌపతి ముర్ము' ఉపయోగించే కారు.. ఇదే: చూసారా..?

దేశానికి రాష్ట్రపతిగా ఉండే వ్యక్తికి నివసించడానికి రాజ్ భవన్ మాత్రమే కాదు, తిరగడానికి పటిష్టమైన భద్రతలు కలిగిన 'మెర్సిడెస్ బెంజ్ యొక్క మేబ్యాచ్ ఎస్600 పుల్మాన్ గార్డ్' కూడా కేటాయించడం జరుగుతుంది.

భారత రాష్ట్రపతి 'ద్రౌపతి ముర్ము' ఉపయోగించే కారు.. ఇదే: చూసారా..?

మెర్సిడెస్ మేబాచ్ ఎస్ 600 పుల్మాన్ గార్డ్ ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటి. ఇది రాష్ట్రపతిని సురక్షితంగా ఉంచడానికి అవసరమైన అన్ని భద్రతా పరికరాలను కలిగి ఉంటుంది. కావున బాంబుల వంటివి కూడా ఈ కారును ఏమి చేయలేవు. రాష్ట్రపతి సురక్షిత ప్రయాణం కోసం ప్రత్యేకంగా కస్టమైజ్ చేయబడిన 'మెర్సిడెస్ మేబాచ్ ఎస్ 600 పుల్మాన్ గార్డ్' విఆర్ 10 బాలిస్టిక్ రక్షణతో వస్తుంది. ఈ కారు దాదాపు ఏ విధమైన దాడి నుండి అయిన కాపాడటానికి అనుకూలంగా తయారుచేయబడి ఉంటుంది.

భారత రాష్ట్రపతి 'ద్రౌపతి ముర్ము' ఉపయోగించే కారు.. ఇదే: చూసారా..?

సాధారణంగా హ్యాండ్ గ్రెనేడ్ వంటి వాటి నుంచి మాత్రమే కాకుండా.. మెషిన్ గన్ వంటి వాటి నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. అదే సమయంలో అనుకోని పరిస్థితుల్లో గ్యాస్ దాడులు వంటివి జరిగితే లోపలి వ్యక్తులను రక్షించడానికి ఈ కారులోపల ఆక్సిజన్ సిలిండర్లు కూడా అందుబాటులో ఉంటాయి. రాష్ట్రపతి ఉపయోగించే ఈ కారు మొత్తం బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ తో అమర్చబడి ఉంటుంది. ఇది స్టీల్ స్ప్రింగ్‌లతో, మంచి డీక్లెరేషన్ మరియు రన్-ఫ్లాట్ టైర్లను కలిగి ఉంటుంది.

భారత రాష్ట్రపతి 'ద్రౌపతి ముర్ము' ఉపయోగించే కారు.. ఇదే: చూసారా..?

రక్షణ మరియు భద్రతా పరికరాలతో పాటు, 21.3 అడుగుల పొడవైన లిమోసిన్ విలాసవంతమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది. అన్ని రకాల ఫీచర్స్ మరియు రక్షణ కవచాలు కలిగి ఉండటం వల్ల దీని బరువు 5 టన్నులకు పైగా ఉంటుంది. అయితే దీని కొలతలను ఒక సారి గమనిస్తే, దీని పొడవు 5,453 మిమీ, వెడల్పు 1,899 మిమీ, ఎత్తు 1,498 మిమీ మరియు 3,365 మిమీ వీల్‌బేస్ కలిగి ఉంది.

భారత రాష్ట్రపతి కారు భద్రతా కారణాల దృష్ట్యా నంబర్ ప్లేట్‌తో రాదు, కానీ స్టేట్ ఎంబ్లెమ్ కలిగి ఉంటుంది. ఇవన్నీ భారత రాష్ట్రపతి భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది.

భారత రాష్ట్రపతి 'ద్రౌపతి ముర్ము' ఉపయోగించే కారు.. ఇదే: చూసారా..?

మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 600 పుల్మాన్ 6.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 530 బిహెచ్‌పి మరియు 830 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది కేవలం 8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 160 కిమీ వరకు ఉంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 80 లీటర్లు.

భారత రాష్ట్రపతి 'ద్రౌపతి ముర్ము' ఉపయోగించే కారు.. ఇదే: చూసారా..?

రాష్ట్రపతి వినియోగించే కారులో సులభంగా నలుగురు వ్యక్తులు కూర్చోవచ్చు. అయితే ఇందులో 530 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. ఈ కారు ధర 10 కోట్లకంటే ఎక్కువ ఉంటుంది. మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 600 పుల్మాన్ గార్డ్‌ కారు రాష్ట్రపతి ప్రయాణానికి ప్రత్యేకంగా తయారుచేయబడిన ఒక రక్షక కవచం అనటంలో ఎలాంటి సందేహం లేదు.

More from DriveSpark

Article Published On: Tuesday, July 26, 2022, 8:00 [IST]
English summary
President draupadi murmu ride on mercedes maybach s600 pullman guard details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+