రాష్ట్రపతి ప్రయాణానికి సిద్దమైన 10 కోట్ల రూపాయల కారు: మీరు చూసారా!!

భారతదేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి భద్రత ఎంత పటిష్టంగా ఉంటుందో దాదాపు అందరికి తెలుసు. అయితే రాష్ట్రపతి ఉపయోగించే కారు, అందులోని సౌకర్యాలు ఎలా ఉంటాయనే విషయం చాలా తక్కువమందికే తెలిసి ఉంటుంది. కావున మనం ఈ ఆర్టికల్ లో రాష్ట్రపతి ఉపయోగించే కారు గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

రాష్ట్రపతి ప్రయాణానికి సిద్దమైన 10 కోట్ల రూపాయల కారు

ప్రస్తుత భారత రాష్ట్రపతి 'రామ్ నాథ్ కోవింద్' గత సంవత్సరం తన ప్రయాణాల కోసం మెర్సిడెస్ మేబాచ్ ఎస్600 పుల్‌మాన్ గార్డ్‌ లగ్జరీ హై సెక్యూరిటీ కారును కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ కరోనా కారణంగా ఈ నిర్ణయం కాస్త విరమించుకోవడం జరిగింది.

రాష్ట్రపతి ప్రయాణానికి సిద్దమైన 10 కోట్ల రూపాయల కారు

కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి గత ఏడాది మార్చిలో కరోనా లాక్ డౌన్ అమలు చేయబడింది. కరోనా లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా దాదాపు అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ పతనానికి ప్రధాన కారణమైంది. ఈ నేపథ్యంలో, రాష్ట్రపతి కొత్త కారు కొనుగోలును కొంతవరకు విరమించుకున్నారు.

రాష్ట్రపతి ప్రయాణానికి సిద్దమైన 10 కోట్ల రూపాయల కారు

ప్రస్తుతం భారాతదేశంలో కరోనా పరిస్థితి కొంత నిలకడగా ఉన్నట్లు నివేదికల చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి కొత్త కారుని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. కావున ఖరీదైన మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 600 పుల్‌మాన్ గార్డ్‌ కారును కొనుగోలు చేయడానికి షెడ్యూల్ చేయబడింది.

రాష్ట్రపతి ప్రయాణానికి సిద్దమైన 10 కోట్ల రూపాయల కారు

ఈ ఏడాది జనవరిలో ఈ కారును కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు ఈ కారు కొనుగోలు చేయబడింది. ఇప్పటి వరకు, ప్రెసిడెంట్ మెర్సిడెస్ మేబాచ్ ఎస్600 పుల్‌మాన్ గార్డ్‌ను ప్రయాణానికి ఉపయోగించారు. మెర్సిడెస్ మేబాచ్ డబ్ల్యు221 ఎస్600 పుల్మాన్ క్వార్ట్జ్ అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటి.

రాష్ట్రపతి ప్రయాణానికి సిద్దమైన 10 కోట్ల రూపాయల కారు

మెర్సిడెస్ మేబాచ్ ఎస్600 పుల్‌మాన్ గార్డ్‌ కారును కంపెనీ మొదటిసారిగా 2011 లో ప్రవేశపెట్టింది. ఈ కారును మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉపయోగం కోసం కొనుగోలు చేశారు. ఈ కారు సురక్షితంగా ఉన్నప్పటికీ, అనేక కారణాల వల్ల కారును మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రపతి ప్రయాణానికి సిద్దమైన 10 కోట్ల రూపాయల కారు

అయితే ప్రస్తుతం నివేదికల ప్రకారం, కొత్త మెర్సిడెస్ మేబాచ్ మెర్సిడెస్ మేబాచ్ ఎస్600 పుల్‌మాన్ గార్డ్‌ కారు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నట్లు సమాచారం. రాష్ట్రపతి వినియోగం కోసం ఉపయోగించే ఈ కారు అధునాత ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటంతో పాటు కట్టుదిట్టమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

రాష్ట్రపతి ప్రయాణానికి సిద్దమైన 10 కోట్ల రూపాయల కారు

కొత్త మెర్సిడెస్ మే బ్యాక్ ఎస్600 పుల్‌మాన్ గార్డ్‌ కారు ఆరు మీటర్ల పొడవు ఉంది. ఈ కారు సాధారణ కార్ల కంటే పొడవుగా ఉంటుంది. ఈ కారు కొనాలనుకునే వారికి కనీసం 1.5 నుండి రెండు సంవత్సరాల వరకు వేచి ఉండవలసి వస్తుంది. ఈ సుదీర్ఘ నిరీక్షణ వల్ల కంపెనీ అనేక ఫీచర్స్ తో ఈ కారును నిర్మిస్తుంది.

రాష్ట్రపతి ప్రయాణానికి సిద్దమైన 10 కోట్ల రూపాయల కారు

రాష్ట్రపతి ఉపయోగం కోసం ఈ కారును కొనుగోలు చేయాలని రెండేళ్ల క్రితం ఆదేశించారు. అయితే ఈ కారు ఇప్పుడు భారతదేశంలోకి అడుగుపెట్టింది. ఈ కారు పేరు విఆర్9. ఈ కారు అధిక స్థాయి భద్రతా లక్షణాలను కలిగి ఉంది. ఈ కారు ఎంత పటిష్టమైన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంది అంటే, ఇది మారణాయుధాలు మరియు బాంబు దాడుల నుంచి కూడా లోపల ఉన్న వ్యక్తులను రక్షించగలదు.

రాష్ట్రపతి ప్రయాణానికి సిద్దమైన 10 కోట్ల రూపాయల కారు

ఈ కారు యొక్క చాసిస్, బాడీ ప్యానెల్ మరియు గ్లాస్ దొరకడం కష్టం. ఎన్ని బుల్లెట్లయినా ఈ కారులోకి చొచ్చుకుపోకుండా ఉంటుంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ త్వరలో ఈ కారులో తన ప్రయాణం ప్రారంభిస్తారు. ఇది రాష్ట్రపతి భద్రతకు ఎలాంటి భంగం కలగకుండా చూస్తుంది.

రాష్ట్రపతి ప్రయాణానికి సిద్దమైన 10 కోట్ల రూపాయల కారు

మెర్సిడెస్ మే బ్యాక్ ఎస్600 పుల్‌మాన్ గార్డ్‌ కారులో ట్విన్-టర్బో వి 12 ఇంజిన్ అమర్చబడి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 520 బిహెచ్‌పి పవర్ మరియు 900 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఈ కారు గరిష్ట వేగం గంటకు 160 కిమీ. ఈ కారు యొక్క అన్ని డోర్స్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ కలిగి ఉంటుంది.

రాష్ట్రపతి ప్రయాణానికి సిద్దమైన 10 కోట్ల రూపాయల కారు

ఈ కారు ధర దాదాపు రూ. 10 కోట్లకు పైగానే ఉంటుంది. ఈ అధిక ధర కారణంగా గత సంవత్సరం కారు వాయిదా వేయబడింది. రాష్ట్రపతికి అత్యధిక భద్రత అవసరం. ఎందుకంటే భారతదేశ మొదటి పౌరుడు భద్రత దేశం యొక్క ప్రతిష్టను తెలుసుపుతుంది. ఈ కారణంగా వారికి అధిక స్థాయి భద్రత కలిగిన కారు అందించబడుతుంది.

రాష్ట్రపతి ప్రయాణానికి సిద్దమైన 10 కోట్ల రూపాయల కారు

2007 - 2012 మధ్య సేవలందించిన భారత మొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కాలం నుంచి మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 600 పుల్మాన్ అధికారిక కారుగా ఉంది. మాజీ అధ్యక్షురాలు ప్రతిభా పాటిల్ మెర్సిడెస్ బెంజ్ ఎస్ నుండి ఎస్ 600 పుల్మాన్ గార్డ్‌కు అప్‌గ్రేడ్ అయ్యారు. క్లాస్ డబ్ల్యు 140 లిమోసిన్ కారుని మాజీ అధ్యక్షుడు ఎపిజె అబ్దుల్ కలాం ఉపయోగించారు.

Most Read Articles

English summary
President of india to get new mercedes maybach s600 pullman car soon details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X