భారత వైమానిక దళాన్ని అభినందించిన నరేంద్ర మోడీ, ఎందుకో తెలుసా.. !
భారతదేశంలో రాను రాను చమురు వినియోగం చాలా ఎక్కువైంది. ఎందుకంటే పెరుగుతున్న వాహనాలకు దేశంలో ఉండే చమురు ఉత్పత్తులు సరిపోకపోవడంతో ఇతర దేశాలనుండి చమురు దిగుమతి చేసుకుంటున్న విషయం అందరికి తెలిసిందే. కానీ భారత వైమానిక దళంలో ఎఎన్-32 రవాణా విమానంలో ఐఎఎఫ్ బయో ఇంధనాన్ని ఉపయోగించి ప్రధాని ప్రశంసలు అందుకున్నారు. అసలు వైమానిక దళం ఉపయోగించిన బయో ఇంధనం ఏది, ప్రధాని ఎందుకు ప్రసంశించారు అనే దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం!

భారత రక్షణ వ్యవస్థకు వైమానికదళం తలమానికంగా ఉంది. రక్షణ వ్యవస్థకు ఖర్చులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. సాధారణంగా విమానాలకు చమురు ఉపయోగించేవారు. కానీ ఇటీవల కాలంలో వైమానిక దళ రవాణా విమానం ప్రయాణించడానికి 10 శాతం దేశీయంగా ఉత్పత్తి చేయబడిన బయో- జెట్ ఇంధనాన్ని ఉపయోగించారు. ఈ విధంగా విమానానికి దేశీయ బయో - జెట్ ఇంధనాన్ని ఉపయోగించడం చాలా గర్వకారణం అని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు.

నరేంద్ర మోడీ ప్రతినెల నిర్వహించే "మన్ కి బాత్" రేడియో కార్యక్రమంలో భారత వైమానిక దళాన్ని ప్రశంసించారు. ఈ విధంగా బయో ఇంధనాన్ని ఉపయోగించడం వల్ల ఇతర దేశాలనుంచి ముడి చమురుని దిగుమతి చేసుకోవడం తగ్గుతుందని చెప్పారు. అంతే కాకుండా కార్బన్ ఉద్గారాలను తగ్గించినట్లు కూడా ఉంటుందన్నారు.

బయో ఇంధనాన్ని ఉపయోగించడం వల్ల కార్బన్ వినియోగం తగ్గుతుందని, తద్వారా పర్యావరణం సమతుల్యం జరుగుతుందని, వాతావరణం కలుషితం కాకుండా ఉండటం వల్ల జీవులు చాల సుఖంగా జీవించగలుగుతాయని చెప్పారు.

బయో జెట్ ఇంజిన్ మిశ్రమాన్ని రెండు ఇంజిన్లలో ఉపయోగించడం ఇదే మొదటిసారి. అంతే కాదు ఈ ఇంధనాన్ని ఉపయోగించే ఈ విమానం లే నుండి బయలుదేరింది. బయో-జెట్ ఇంధనాన్ని "నాన్ ఎడిబుల్ ట్రీ ద్వారా ఉత్పత్తి చేసే నూనె" నుండి తయారు చేసి, భారతదేశంలోని వివిధ గిరిజన ప్రాంతాల నుండి సేకరించినట్లు ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ ప్రయత్నాలు కార్బన్ ఉద్గారాలను తగ్గించడమే కాక, ముడి చమురు దిగుమతులపై భారతదేశం ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తాయి. ఈ ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరినీ, ముఖ్యంగా సిఎస్ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం శాస్త్రవేత్తలను నేను అభినందిస్తున్నాను.

బయో ఇంధనంతో విమానం ఎగరడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం సాధ్యం చేయడం హర్షించదగ్గ విషయం. ఇటువంటి ప్రయత్నాలు ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా చొరవకు కూడా అధికారం ఇస్తాయని ప్రధాని ప్రస్తావించారు.


Click it and Unblock the Notifications








