ప్రపంచంలోనే అత్యంత పొడవైన అటల్ టన్నెల్ ప్రారంభించిన నరేంద్ర మోదీ.. ఈ టన్నెల్ గురించి మీకు తెలుసా !

ప్రపంచంలో అత్యంత పొడవైన అటల్ టన్నెల్ ఈ రోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దీనిని మనాలి నుండి లేహ్ మధ్య నిర్మించారు. ఈ టన్నెల్ మనాలి మరియు లే మధ్య దూరాన్ని 46 కిలోమీటర్లు తగ్గిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ దేశానికీ ఈ అటల్ టన్నెల్‌ని అంకితం చేశారు.

ప్రపంచంలోనే అత్యంత పొడవైన అటల్ టన్నెల్ ప్రారంభించిన నరేంద్ర మోదీ.. ఈ టన్నెల్ గురించి మీకు తెలుసా !

ఈ సొరంగం 10,000 అడుగుల ఎత్తులో నిర్మించబడింది మరియు దీని పొడవు 9.02 కిలోమీటర్లు. ఈ సొరంగ మార్గం మనాలి మరియు లే మధ్య 46 కిలోమీటర్ల దూరాన్ని తగ్గిస్తుంది మరియు ప్రయాణీకులకు 4 గంటల సమయం ఆదా చేస్తుంది. సుమారు ఈ సొరంగ మార్గం యొక్క నిర్మాణానానికి 3,300 కోట్ల రూపాయల ఖర్చు అయింది.

ప్రపంచంలోనే అత్యంత పొడవైన అటల్ టన్నెల్ ప్రారంభించిన నరేంద్ర మోదీ.. ఈ టన్నెల్ గురించి మీకు తెలుసా !

అటల్ టన్నెల్ ప్రతిరోజూ 3 వేల కార్లు మరియు 1500 ట్రక్కులు ప్రయాణించే విధంగా నిర్మించబడింది. ప్రతి 250 మీటర్లకు సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి మరియు సొరంగం లోపల ప్రతి 500 మీటర్లకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నిర్మించబడింది.

ప్రపంచంలోనే అత్యంత పొడవైన అటల్ టన్నెల్ ప్రారంభించిన నరేంద్ర మోదీ.. ఈ టన్నెల్ గురించి మీకు తెలుసా !

భద్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రతి 60 మీటర్లకు సొరంగంలో ఫైర్ హైడ్రాంట్లు ఏర్పాటు చేయబడ్డాయి మరియు ప్రతి 150 మీటర్లకు టెలిఫోన్ సౌకర్యాలు కల్పించబడ్డాయి. దీనితో ప్రతి 1 కిలోమీటరుకు ఎయిర్ క్వాలిటీ మానిటర్ ఏర్పాటు చేయబడింది. ఈ సొరంగం యొక్క రెండు వైపులా 1 మీటర్ పేవ్మెంట్ ఉంది, ఇది కలిసి 10.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంది.

ప్రపంచంలోనే అత్యంత పొడవైన అటల్ టన్నెల్ ప్రారంభించిన నరేంద్ర మోదీ.. ఈ టన్నెల్ గురించి మీకు తెలుసా !

లేహ్‌ను మెయిన్ స్ట్రీమ్ కి అనుసంధానించడానికి ఇది ఒక ముఖ్యమైన దశగా భావించబడుతుంది. ఈ సొరంగం నిర్మాణం వల్ల, లడఖ్‌లోని సైనికులకు ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది. తద్వారా శీతాకాలంలో కూడా ఆయుధాలు మరియు రేషన్ సులభంగా సరఫరా చేయబడతాయి.

ప్రపంచంలోనే అత్యంత పొడవైన అటల్ టన్నెల్ ప్రారంభించిన నరేంద్ర మోదీ.. ఈ టన్నెల్ గురించి మీకు తెలుసా !

ఈ సొరంగ మార్గం యొక్క నిర్మాణానికి 6 సంవత్సరాల కన్నా తక్కువ కాలం పడుతుందని ఊహించారు, కానీ ఇది పదేళ్ళలో పూర్తయింది. ఇందులో ఎక్కువ భాగం బోర్డర్ రోడ్స్ సంస్థ నిర్మించింది. ఈ సమయంలో వాతావరణం, కొండ భూభాగం వంటి అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు.

ప్రపంచంలోనే అత్యంత పొడవైన అటల్ టన్నెల్ ప్రారంభించిన నరేంద్ర మోదీ.. ఈ టన్నెల్ గురించి మీకు తెలుసా !

అటల్ టన్నెల్‌లో వేగా పరిమితి గంటకు 80 కి.మీ. ఈ సొరంగం హిమాలయాల పిర్ పంజాల్ పర్వత శ్రేణి మధ్యలో నిర్మించబడింది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన రహదారి సొరంగం మరియు ఇప్పుడు ఈ రికార్డులో కూడా భారతదేశం పేరు నిలుస్తుంది. దీనితో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ను భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్‌లోని చెనాబ్ నదిపై నిర్మిస్తున్నారు, ఇది 2022 నాటికి పూర్తవుతుంది.

ప్రపంచంలోనే అత్యంత పొడవైన అటల్ టన్నెల్ ప్రారంభించిన నరేంద్ర మోదీ.. ఈ టన్నెల్ గురించి మీకు తెలుసా !

ఈ అటల్ టన్నెల్ ప్రారంభించే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు. అటల్ టన్నెల్ మాజీ ప్రధాని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టారు. ఏది ఏమైనా ఈ అత్యంత పొడవైన అటల్ టన్నెల్ వల్ల మన దేశం కూడా ఒక రికార్డ్ సాధించింది.

More from DriveSpark

Article Published On: Saturday, October 3, 2020, 14:52 [IST]
English summary
PM Modi Inaugurates Atal Tunnel. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+