వేలానికి సిద్దమైన ప్రిన్సెస్ డయానా కారు; పూర్తి వివరాలు

బ్రిటన్ యువరాణి డయానా గురించి దాదాపు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే డయానా గురించి దాదాపు అందరికి తెలిసిందే. సాధారణంగా బ్రిటన్ యువరాణి డయానా చాలా విలాసవంతమైన జీవితం గడుపుతుంది. అంతే కాదు ఈమె ఎంతోమందికి ఉపకారం కూడా చేస్తుంది. ఇందులో భాగంగానే 1997 లో జరిగిన రోడ్డు ప్రమాదానికి గురైన వారిని కూడా ఎంతగానో ఆదుకుంది.

వేలానికి సిద్దమైన ప్రిన్సెస్ డయానా కారు; పూర్తి వివరాలు

ప్రిన్సెస్ డయానా 1961 లో జన్మించింది. 1981లో ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ చిన్న కుమారుడు ప్రిన్స్ చార్లెస్ ని వివాహం చేసుకుంది. ఆ తరువాత డయానా ఇంగ్లాండ్ ఒక ప్రఖ్యాత వ్యక్తిగా మారింది.

వేలానికి సిద్దమైన ప్రిన్సెస్ డయానా కారు; పూర్తి వివరాలు

ఇదిలా ఉండగా ప్రిన్సెస్ డయానాకు చెందిన 1981 ఫోర్డ్ ఎస్కార్ట్ ఘియా సెలూన్ కారు ఇప్పుడు వేలానికి సిద్ధంగా ఉంది. ఇది జూన్ 29 న ఎసెక్స్‌లోని రీమాన్ డాన్సీ యొక్క రాయల్టీ, పురాతన వస్తువులు మరియు ఫైన్ ఆర్ట్ సేల్ సందర్భంగా విక్రయించబడుతుంది.

వేలానికి సిద్దమైన ప్రిన్సెస్ డయానా కారు; పూర్తి వివరాలు

1981 మే నెలలో వారి రాయల్ వెడ్డింగ్‌కు రెండు నెలల ముందు ఈ కారును ప్రిన్స్ చార్లెస్ ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ ఐదు-డోర్ల హ్యాచ్‌బ్యాక్ ను డయానా 1982 ఆగస్టు వరకు ఉపయోగించింది.

వేలానికి సిద్దమైన ప్రిన్సెస్ డయానా కారు; పూర్తి వివరాలు

ఈ కారు 20 సంవత్సరాలకు పైగా కనపడనప్పటికీ, ఇది ఇప్పటికి రాయల్ గ్యారేజ్ లో మంచి స్థితిలోనే ఉంది. ఈ కారు యొక్క అసలు రిజిస్ట్రేషన్ నెంబర్ WEV 297W ప్లేట్ ఇప్పటికి అలాగే ఉంది. రీమాన్ డాన్సీ ప్రకారం, ఈ ఘియా సెలూన్ కారు అసలు రంగులో మరియు అప్హోల్స్టరీతో మంచి కండిషన్ లో ఉంది.

వేలానికి సిద్దమైన ప్రిన్సెస్ డయానా కారు; పూర్తి వివరాలు

కారులోని మీటర్ ప్రకారం, ఈ కారు 83,000 మైళ్ళు ప్రయాణించింది, అంటే ఇది దాదాపుగా 1,33,575 కిలోమీటర్లు ప్రయాణించింది. అప్పట్ల డయానా కారు డ్రైవ్ చేస్తున్న ఫోటోలు ఇప్పటికి అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒకటి ప్రిన్స్ పోలో ఆడుతున్నప్పుడు ఆమె దానిలో కూర్చున్నట్లు చూడవచ్చు.

వేలానికి సిద్దమైన ప్రిన్సెస్ డయానా కారు; పూర్తి వివరాలు

ఈ కారులో బోనెట్‌లో సిల్వర్ ఫ్రాగ్ మస్కట్ కూడా ఉంది. ఇది డయానా సోదరి లేడీ సారా స్పెన్సర్ ఇచ్చిన గిఫ్ట్ కాపీ. ఈ కారులో ఏర్పాటు చేసిన రేడియో సిస్టం చెక్కుచెదరకుండా ఉంది. ఇప్పటికి కూడా ఈ కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది.

వేలానికి సిద్దమైన ప్రిన్సెస్ డయానా కారు; పూర్తి వివరాలు

ఘియా సలోన్ కారులో అమర్చిన 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 78 బిహెచ్‌పి పవర్, 3,000 ఆర్‌పిఎమ్ వద్ద 125 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 4 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

వేలానికి సిద్దమైన ప్రిన్సెస్ డయానా కారు; పూర్తి వివరాలు

అత్యంత ప్రాచుర్యం పొందిన వ్యక్తులలో ఒకరైన ప్రిన్సెస్ డయానాకు కార్లంటే చాలా ఇష్టం. కావున ఆమె ఇప్పటికే చాలా కార్లను కలిగి ఉంది. డయానా యొక్క ఆడి కన్వర్టిబుల్‌ కారు గత ఏడాది $ 58,000 కు విక్రయించబడింది. ఇప్పుడు వేలానికి సిద్దమైన ఈ కారు ఎంత ధరకు వేలం పాటలో విక్రయించబడుతుందో వేచి చూడాలి.

Image Courtesy: Lewis Rabett/Instagram

Most Read Articles

English summary
Princess Diana's Ford Escort Ghia Saloon Car To Go For Auction. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X