తాళం చెవి పోయిందా..? అయితే ఈ యాప్‌తో ప్రింట్ చేసుకోండి..!

By Ravi

మీ కారు, బైక్ లేదా ఇంటి తాళం ఏదేనా సరే పోగొట్టుకున్నారా.. అయితే కంగారు పడకండి. మీ వాహనాలు, ఇళ్లకు సంబంధించిన తాళం చెవులను అచ్చుగుద్దినట్లు అలానే, కేవలం ఒక్క నిమిషంలో ప్రింట్ చేసిచ్చేందుకు ఓ సరికొత్త అప్లికేషన్ పుట్టుకొచ్చింది.

న్యూయార్క్‌కి చెందిన కీమి (KeyMe) అప్లికేషన్ సాయంతో ఇది సాధ్యమవుతుంది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా మీ వాహనాలు, ఇళ్లకు సంబంధించిన తాళం చెవులను ముందుగా ఫొటో తీసుకొని, ఈ అప్లికేషన్‌లో స్టోర్ చేసుకోవటమే.

Print Your Lost Keys With This New App

ఎప్పుడైనా తాళం చెవి పోయినట్లయితే, ఈ ఫొటో సాయంతో, ఒక్క నిమిషం లోపే కీని ప్రింట్ చేసుకోవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఓ తెల్లటి కాగితంపై తాళం చెవులను ఇరువైపులా ఫొటో తీసి ఉంచుకోవాలి.

ఈ అప్లికేషన్ సదరు ఫొటోలను కంపెనీ సిస్టమ్‌లోకి అప్‌లోడ్ చేస్తుంది. న్యూయార్క్ సిటీ వ్యాప్తంగా దాదాపు రెండు డజన్లకు పైగా కీమి ఆటోమేటెడ్ లొకేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా యూజర్లు, తాళం చెవులను ప్రింట్ చేయించుకోవచ్చు. బాగుంది కదూ ఈ కొత్త టెక్నాలజీ..!

More from DriveSpark

Article Published On: Tuesday, February 10, 2015, 9:47 [IST]
English summary
Lost your keys? A new app lets users take a photo of their keys and use it to print another set in under a minute. The app by New York-based KeyMe allows users to take a photograph of their home, office or car keys.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+