పోలీసు కారును తోసిన ఖైదీలు.. వీడియో వైరల్‌, ఉన్నతాధికారులు సీరియస్‌, అసలేం జరిగిందంటే.!!

ఫ్యూయెల్‌ అయిపోయిన మహీంద్రా స్కార్పియో(Mahindra Scorpio) కారును కొంతమంది ముందుకు తోశారు. అయితే ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్‌ ఉంది. ఆ మహీంద్రా స్కార్పియో పోలీస్‌ వాహనం. ఆ వాహనాన్ని తోసింది ఆ పోలీసులు పట్టుకున్న నేరస్థులు.. షాక్‌ అయ్యారా.. ఇది ఎక్కడ.. ఎందుకిలా జరిగిందో ఈ కథనంలో తెలుసుకోండి.

పోలీస్‌ వాహనాన్ని అందులోని(Prisoners Push Police Vehicle) నేరస్థులు తోస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం ఈ సంఘటన ఉన్నతాధికారుల్లో చర్చనీయాంశంగా కూడా మారింది. బీహార్‌లోని భాగల్‌పూర్‌ ప్రాంతంలో ఈ వింత చోటుచేసుకుంది. అసలెందుకిలా జరిగిందంటే..

Prisoners-Pushed-The-Police-Vehicle

ఓ కేసులో ఖైదీలుగా ఉన్న కొందరు వ్యక్తులను కోర్టులో హాజరు పరిచేందుకు పోలీసులు తమ అధికారిక వాహనం మహీంద్రా స్కార్పియోలో తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో కొంత దూరం వెళ్లగానే కారులో డీజిల్‌ అయిపోయింది. దీంతో పోలీసులు వాహనంలో ఉన్న ఖైదీలచే కారును తోయించారు. కోర్టు వరకు కారును తోసుకుంటూనే తీసుకెళ్లారు. అయితే ఆ సమయంలో వారు పారిపోయే అవకాశం ఉన్నా.. ఖైదీలు ఆ పని చేయలేదు.

కాగా ఈ సంఘటన పోలీస్‌ శాఖ(Prisoners Pushed Police Vehicle In Bihar) ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో ఘటనపై వారు విచారణ జరుపుతున్నారు. తప్పు చేసన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా పోలీసులు చేసిన ఈ చర్యను నెటిజన్లు తప్పు బడుతున్నారు. పోలీసు వాహనంలోని నేరస్థులచే ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని వ్యాఖ్యానించారు.

Prisoners-Pushed-The-Police-Vehicle

లేదంటే ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా కారును(Prisoners Pushed Police Vehicle Viral Video) ఓ చోట పార్క్‌ చేసి వారిని వేరే వాహనంలో తరలించవచ్చు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంకా కారును స్టార్ట్‌ చేసేటప్పుడు అందులో ఫ్యూయెల్‌ ఉందో లేదో చెక్‌ చేసుకోలేదా అని పేర్కొన్నారు. ఏదేమైనా ఈ సంఘటన ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

కాగా మార్గ మధ్యలో కారులో ఫ్యూయెల్‌ అయిపోయినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రోడ్డుపై కారు ఆగిపోతే.. ఇతర వాహనాలకు, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాన్ని రోడ్డుకు ఒక వైపునకు ఆపి సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత ట్రక్కు సహాయంతో సమీప పెట్రోల్‌ బంకుకు తరలించవచ్చు. లేదా మరెవరైనా బంకుకు వెళ్లి క్యాన్‌లో ఫ్యూయెల్‌ తీసుకుని వచ్చి వాహనంలో నింపుకోవచ్చు.

Prisoners-Pushed-The-Police-Vehicle

కానీ ఆగిపోయిన కారును ఇలా రోడ్డుపై నెట్టడం సరికాదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అది కూడా విచారణలో ఉన్న నిందితుల చేత ఇలా చేయడం సమంజసం కాదు అని గుర్తుంచుకోవాలి. ఈ కారణంగా పోలీసు శాఖ విచారణ జరిపి సంబంధిత పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, February 6, 2024, 11:49 [IST]
English summary
Prisoners pushed the police vehicle in bihar because the car ran out of fuel viral video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+