అందమైన నిర్మాత చేతికి మరింత అందం.. ఏకంగా కోట్లు విలువ చేసే లగ్జరీ కారునే సొంతం చేసుకుంది

హిందీ చిత్రసీమలో దర్శకురాలిగా, నిర్మాతగా, వ్యాపారాలను నిర్వహించే వ్యాపారవేత్తగా పేరు సంపాదించుకున్న ఏక్తా కపూర్ గురించి అందరికీ తెలిసిందే. ఆమె ఒక ఫ్యాషన్ ఐకాన్‌గా కూడా గుర్తింపు పొందింది. ఆమె బాలాజీ టెలిఫిల్మ్స్ లిమిటెడ్ ద్వారా సినిమాలు, వెబ్ సిరీస్‌‌లు, టీవీ షోలను నిర్మిస్తోంది. ఈ సంస్థకు యజమాని బాలీవుడ్ నటుడు జీతేంద్ర. ఆయన సతిమణి శోభా కపూర్‌ దీనికి మేనేజింగ్‌ డైరెక్టర్‌‌గా ఉన్నారు. ఈ దంపతుల కుమార్తే ఏక్తా కపూర్. ఈమె హిందీతో పాటు పలు చిత్ర పరిశ్రమలో మంచి పేరును కలిగి ఉంది. తన తండ్రి స్థాపించిన బాలాజీ టెలిఫిల్మ్స్ లిమిటెడ్‌కు క్రియేటివ్ హెడ్‌, కో-మేనేజింగ్ డైరెక్టర్‌గా సంస్థ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె తరచుగా వివిధ సినిమా ఫంక్షన్లు, పార్టీల్లో కూడా కనిపిస్తుంటారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటారు. అయితే తాజాగా ఆమె వార్తల్లో నిలిచారు.

ఏక్తా కపూర్ ఇటీవల ఖరీదైన కారును కొనుగోలు చేశారు. ఆమె కొన్నటువంటి లగ్జరీ కారు పేరు 'రేంజ్ రోవర్ ఎస్వీ ఆటోబయోగ్రఫీ (range rover sv autobiography)'. దీని ధర ఎంతో తెలిస్తే షాక్ అయిపోతారు. అక్షరాల ఇది రూ.5.70 కోట్లు ఉంటుంది. అంత ఖరీదు చేసే లగ్జరీ కారును కొనడంతో చిత్ర పరిశ్రమలో ఇదే హాట్ టాపిక్ అయింది. సోషల్‌మీడియాలో కూడా చాలా మంది దీని గురించి చర్చించుకుంటున్నారు.

Ekta Kapoor Range Rover Sv Autobiography

తాజాగా ఏక్తా కపూర్ తాను కొన్నటువంటి సరికొత్త రేంజ్ రోవర్ ఎస్వీ ఆటోబయోగ్రఫీ కారుకు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో షేర్ చేయగా, ఇది బాగా వైరల్ అవుతుంది. ఆమె అభిమానులు బాగా షేర్ చేస్తున్నారు. ఖరీదైన కారులో నుంచి బయటకు వస్తున్నట్లు ఈ వీడియోలో కనిపించింది. మాములుగా ఏక్తా కపూర్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఆమె వద్ద ఇప్పటికే పలు మోడళ్లు ఉన్నాయి.

ఆమె గ్యారేజీలో ఉన్నటువంటి కార్లన్ని కూడా టాప్ బ్రాండ్‌లకు చెందిన లగ్జరీ కార్లే. మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ మేబ్యాక్ ఎస్ 500, జాగ్వార్ ఎఫ్-పేస్, బెంట్లీ కాంటినెంటల్ జీటీ వంట లగ్జరీ కార్లు ఆమె వద్ద ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని కలిగి ఉంటాయి. వీటిలో బెంట్లీ కాంటినెంటల్ జీటీ కారు ధర దాదాపు రూ.3.50 కోట్ల వరకు ఉంటుంది.

Ekta Kapoor New Range Rover Sv Autobiography

ఇంకా మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ మేబ్యాక్ ఎస్ 500 ధర దాదాపు రూ. 2 కోట్ల వరకు ఉంటుంది. అదే జాగ్వార్ ఎఫ్-పేస్ కారు విలువ దాదాపు రూ.70 లక్షల వరకు ఉంది. ఆమె వద్ద ఉన్న కార్లలో చాలా వరకు కోటి రూపాయలకు పైనే ఉంటాయి. ఏక్తా కపూర్ ఎప్పుడూ కూడా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంది. అందుకే తన గ్యారేజీలొ కోట్ల విలువ చేసే లగ్జరీ కార్లను ఉంచుకుంటుంది.

ఇంకా ఏక్తా కపూర్ గురించి మాట్లాడకోవాలంటే, ఆమె లైఫ్‌స్టైల్ మొత్తం కూడా లగ్జరీ గానే ఉంటుంది. నిర్మాతగా కూడా సక్సెస్ అవుతూ సరి కొత్త సినిమాలు నిర్మిస్తుంది. ఇండియాలో 25 మంది అత్యంత శక్తివంతమైన మహిళా పారిశ్రామికవేత్తల లిస్ట్‌లో ఏక్తా కపూర్‌కు కూడా స్థానం ఉంది. ఆమె ఇప్పటి వరకు చాలా సినిమాలు, వెబ్‌సిరీస్‌లను నిర్మించారు. వాటిలో ఎక్కువగా బిగ్ హిట్ నిలిచినవే ఉన్నాయి.

Range Rover Sv Autobiography

లగ్జరీ కారు రేంజ్ రోవర్ ఎస్వీ ఆటోబయోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే దీనిలో అధునాతన సదుపాయాలు ఉంటాయి. ఎక్స్‌టీరియర్‌తో ఇంటిరీయర్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌లు, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు వంటివి ఉన్నాయి. పేరుకు తగ్గట్టుగానే ఈ కారులో ప్రయాణిస్తుంటే ఆ రేంజ్ వేరే లెవల్‌లో ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, December 3, 2024, 15:44 [IST]
English summary
Producer ekta kapoor spotted new range rover sv autobiography worth rs 5 7 crore
Read more on: #offbeat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+