అందమైన భార్యకు అద్భుతమైన కార్ గిఫ్ట్: మనసులాగే గిఫ్ట్ కూడా పెద్దదే..

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కొన్ని వార్తలు తెగ చక్కర్లు కొట్టేస్తున్నాయి. ఇందులో ఒకటి 'రవీందర్‌ మరియు మహాలక్ష్మి' వివాహం. దీనికి కారణం కూడా లేకుండా పోలేదు, ఎందుకంటే సీరియల్ నటి మహాలక్ష్మి చూడటానికి కుందనపు బొమ్మలాగా ఉంటుంది, అలాంటి మహాలక్ష్మి లావుగా ఉన్న తమిళ్ ప్రొడ్యూసర్ రవీందర్‌ని వివాహం చేసుకోవడమే. అందులోనూ వీరిద్దరిదీ రెండో వివాహం కావడం.

అందమైన భార్యకు అద్భుతమైన గిఫ్ట్: మనసులాగే గిఫ్ట్ కూడా పెద్దదే

చాలామంది అప్పట్లో మహాలక్ష్మి కేవలం డబ్బు కోసం మాత్రమే వివాహం చేసుకుంది అని పుకార్లు పుటించారు. కానీ ఇవేమీ పట్టించేకోకుండా ఈ కొత్త జంట సంతోషంతో ముందుకు సాగిపోతున్నారు. అయితే ఇటీవల దీపావళి పండుగ కానుకగా రవీందర్ తన భార్య మహాలక్ష్మికి ఒక ఖరీదైన కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతోంది.

అందమైన భార్యకు అద్భుతమైన గిఫ్ట్: మనసులాగే గిఫ్ట్ కూడా పెద్దదే

ఇటీవల దీపావళి పండుగను రవీందర్‌ & మహాలక్ష్మి చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా అప్పుడు సోషల్ మీడియాలో కనిపించాయి. అయితే ఇటీవల రవీందర్ తన భార్యకు ఎంజి మోటార్ కంపెనీ యొక్క గ్లోస్టర్ SUV ని గిఫ్ట్ గా అందించాడు. దీనికి సంబంధించిన ఫోటోలను మీరు ఇందులో చూడవచ్చు.

మనం జీవితాంతం ప్రేమించే వ్యక్తిని కనిపెట్టడం చాలా కష్టం. మనం ప్రేమించే వ్యక్తి తిరిగి మనల్ని అంతే గొప్పగా ప్రేమిస్తే అది మరింత గొప్పగా ఉంటుంది. కొత్త భార్య, కొత్త జీవితం, కొత్త కారు ఈజీ డ్రైవింగ్ అండ్ క్రేజీ' అంటూ ఈ సందర్భంగా పోస్ట్ చేశారు. ఇది కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనికి 90,000 కు పైగా లైకులు వచ్చాయి.

అందమైన భార్యకు అద్భుతమైన గిఫ్ట్: మనసులాగే గిఫ్ట్ కూడా పెద్దదే

రవీందర్ తన భార్యకు ఇచ్చిన కారు ఖరీదు దాదాపు రూ. 32 లక్షలు. గ్లోస్టర్ SUV 2020 లో దేశీయ మార్కెట్లో విడుదలైంది. ఇది ఆధునిక డిజైన్ కలిగి అటానమీ లెవల్-1 టెక్నాలజీని పొందింది. అటానమీ లెవల్-1 టెక్నాలజీతో భారత్‌లో విక్రయించబడిన తొలి కార్ మోడల్ కూడా ఇదే.

అందమైన భార్యకు అద్భుతమైన గిఫ్ట్: మనసులాగే గిఫ్ట్ కూడా పెద్దదే

ఎంజి గ్లోస్టర్ అద్భుతమైన లైటింగ్ సెటప్, పనోరమిక్ సన్‌రూఫ్, 19 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ అండ్ రియర్ ఫాగ్ లాంప్స్, స్టీరింగ్-అసిస్ట్ కార్నరింగ్ లాంప్స్, డ్యూయల్ బారెల్ ట్విన్ క్రోమ్ ఎగ్జాస్ట్ వంటివి వాటిని పొందుతుంది.

అందమైన భార్యకు అద్భుతమైన గిఫ్ట్: మనసులాగే గిఫ్ట్ కూడా పెద్దదే

ఈ ఎస్‌యూవీ యొక్క ఇంటీరియర్స్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోకి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకూండా ఇందులో ఐ-స్మార్ట్ కనెక్ట్ టెక్నాలజీ, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, 8 ఇంచెస్ MID ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పాడిల్ షిఫ్టర్లు, 3-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్, హీటెడ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ వంటివి కూడా ఉన్నాయి.

అందమైన భార్యకు అద్భుతమైన గిఫ్ట్: మనసులాగే గిఫ్ట్ కూడా పెద్దదే

ఎంజి గ్లోస్టర్ చూడటానికి భారీగా ఉంటుంది. కావున దీని పొడవు 4985 మి.మీ, వెడల్పు 1926 మి.మీ, ఎత్తు 1867 మి.మీ మరియు వీల్‌బేస్ 2950 మి.మీ వరకు ఉంటుంది. కావున వాహన వినియోగదారులకు మంచి క్యాబిన్ స్పేస్ తో పాటు మంచి లెగ్రూమ్, హెడ్ రూమ్ వంటివాటిని అందిస్తుంది.

అందమైన భార్యకు అద్భుతమైన గిఫ్ట్: మనసులాగే గిఫ్ట్ కూడా పెద్దదే

ఎంజి గ్లోస్టర్ బేస్ వేరియంట్లోని 2.0-లీటర్ టర్బో డీజిల్ 4000 ఆర్‌పిఎమ్ వద్ద 160 బిహెచ్‌పి పవర్ మరియు 1500 - 2400 ఆర్‌పిఎమ్ వద్ద 375 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టాప్-స్పెక్ ట్రిమ్స్‌లోని 2.0-లీటర్ ట్విన్-టర్బో యూనిట్ 4000 ఆర్‌పిఎమ్ వద్ద 216 బిహెచ్‌పి మరియు 1500 - 2400 ఆర్‌పిఎమ్ వద్ద 480 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. డీజిల్ ఇంజిన్ యొక్క రెండు వెర్షన్లు స్టాండర్డ్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడతాయి. కావున మంచి పనితీరుని అందిస్తాయి.

అందమైన భార్యకు అద్భుతమైన గిఫ్ట్: మనసులాగే గిఫ్ట్ కూడా పెద్దదే

ఎంజి గ్లోస్టర్ ఎస్‌యూవీ నాలుగు కలర్ ఆప్సన్లలో అందుబాటులో ఉంటుంది. అవి అగాటా రెడ్, మెటల్ బ్లాక్, మెటల్ యాష్ మరియు వార్మ్ వైట్ కలర్స్. అంతే కాకూండా ఇందులో మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

More from DriveSpark

Article Published On: Saturday, November 5, 2022, 15:49 [IST]
English summary
Producer ravindar gift costly car his wife mahalakshmi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+