సన్‌రూఫ్ ఫీచర్ ఉన్న కారును కొనుగోలు చేస్తున్నారా.. అయితే ఒక్కసారి ఈ విషయాలు తెెలుసుకోండి
ఆటోమొబైల్ రంగంలో టెక్నాలజీ వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా అనేక ఫీచర్లతో కార్లు, టూ వీలర్లను ఆటో మేకర్లు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా కార్లలో ఈ మార్పులు చాలా చూస్తున్నాం. వాటిలో ఇప్పుడు బాగా ఫేమస్ అవుతున్న ఫీచర్ సన్‌రూఫ్(Sunroof Cars). అయితే ఈ ఫీచర్ వల్ల లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయని మీకు తెెలుసా.??
కార్లలో సన్‌రూఫ్ ఫీచర్(Sunroof Feature) ఇప్పుడు చాలా మంది కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అందుకే కేవలం ప్రీమియం, టాప్- స్పెక్ వేరియంట్లకే పరిమితమైన సన్‌రూఫ్ ఫీచర్ ఇప్పుడు సాధారణ కార్లలో కూడా అందుబాటులోకి వచ్చింది. బయట వెెలుతురు సులభంగా కారు క్యాబిన్‌లోకి ప్రవేశించేలా చేయడమే ఈ ఫీచర్ ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా మీ కారును లగ్జరీగా కూడా మారుస్తాయి.

అయితే కారుకు లగ్జరీ ఫీచర్‌ను అందించడంతో పాటు సూర్యరశ్మి నేరుగా క్యాబిన్‌లోకి ప్రవేశించేలే చేసే సన్‌రూఫ్ ఫీచర్ ద్వారా కొన్ని డిస్అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయట. ముఖ్యంగా వేసవి కాలంలో సన్‌రూఫ్ ఫీచర్ ద్వారా నష్టాలు చాలా ఉన్నాయని ఆటో నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
ఏసీ ఎఫెక్ట్: సమ్మర్లో సన్‌రూఫ్ కారణంగా సూర్యకిరణాలు నేరుగా కారులోకి ప్రసరిస్తాయి. దీంతో కారులో వేడి ఎక్కువగా ఉంటుంది.. తద్వారా ఏసీని మరింత ఎక్కువగా వాడాల్సి వస్తుందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. దీని ద్వారా ఫ్యూయల్ వినియోగం కాడా పెరుగుతుంది. ఫలితంగా ఫ్యూయెల్ ఖర్చులు పెరుగుతాయి. పెరుగుతున్న ఇంధన ధరలకు తోడు ఇది మరో అదనపు ఖర్చు.

వేసవి కాలంలో సన్‌రూఫ్స్ ఉన్న కార్లలో ఏసీ పెంచాల్సి రావడం వల్ల.. ఇది మైలేజీపై ప్రభావం చూపిస్తుంది. లోపలి క్యాబిన్‌ను చల్లబరచడానికి సాధారణ కార్లతో పోలిస్తే ఏసీ ఎక్కువగా అవసరం అవుతుంది. దీంతో ఫ్యూయల్ వినియోగం పెరగడమే కాకుండా.. మీ కారు యావరేజ్ మైలేజీ తగ్గిపోతుంది.
అన్‌కంఫర్టబుల్ జర్నీ: సాధారణ కార్లతో పోలిస్తే.. సన్‌రూఫ్ ఉన్న కార్లలో ఎక్కువ భాగం గాజు మెటీరియల్ ఉంటుంది. ఈ ఫీచర్ లేని కార్ల పై కప్పు లోహంతో తయారై ఉంటుంది. లోహం కంటే గాజు మెటీరియల్.. సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహిస్తుంది. దీనివల్ల కారు లోపలి భాగం త్వరగా వేడెక్కుతుంది. సాధారణ కార్లలో పోలిస్తే ఈ వేడి కాస్త ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రయాణికులు తమ జర్నీలో అసౌకర్యానికి లోనవుతారు.

ఏసీపై ఒత్తిడి: సన్‌రూఫ్ ఫీచర్ ఉన్న కారులో ఏసీపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సూర్యరశ్మి కారు క్యాబిన్లోకి ఎక్కువగా ప్రవేశించడం వల్ల క్యాబిన్ త్వరగా వేడెక్కుతుంది. తద్వారా క్యాబిన్‌ను చల్లబరచడానికి ఎక్కువ ఏసీ అవసరం పడుతుంది. దీంతో క్యాబిన్‌ను చల్లబరచడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇది AC పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. కెపాసిటీని మించి పనిచేయడంతో ఏసీ త్వరగా పాడైపోవడంతో పాటు రిపేర్‌కు చాలా ఖర్చు వస్తుంది.
ఇంకా సన్‌రూఫ్ ఉన్న కారు బిల్ట్ క్వాలిటీ కూడా తక్కువగా ఉండటం కారణంగా.. చిన్న పిల్లలు లేదా పెంపుడు జంతువులు గాయపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇంకా సన్‌రూఫ్‌లలో లీకేజీలు కూడా ఎక్కువగా ఏర్పడుతుంటాయి. దీని ద్వారా కారు లోపలి భాగం దెబ్బతినే అవకాశం ఉంటుంది.

సాధారణ కార్లతో పోలిస్తే.. సన్‌రూఫ్స్.. కార్లలోకి ఎక్కువ కాంతిని తీసుకురావడంతో మీకు మంచి డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. ఎందుకంటే ఆహ్లాదకరమైన వాతావరణంలో సన్‌రూఫ్ ఓపెన్ చేసి డ్రైవింగ్ చేసినట్లయితే.. మనసుకు హాయిగా ఉండటంతో పాటు మంచి థ్రిల్లింగ్ రైడ్‌ను ఆస్వాదించవచ్చు. అయితే భారత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కస్టమర్లు సన్‌రూఫ్ ఫీచర్ ఉన్న కార్ల గురించి ఆలోచించాలి.
ఎందుకంటే ఇక్కడ మైలేజ్ ప్రధానమైనది. సన్‌రూఫ్ కార్లలో వేడి ఎక్కువగా ఉండటం వల్ల ఏసీ ఎఫెక్ట్, మైలేజ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని వీటన్నిటినీ మెయింటైన్ చేయగలం అనుకుంటేనే సన్‌రూఫ్ ఫీచర్ ఉన్న కార్లను కొనుగోలు చేయాలి. ముఖ్యంగా వేసవిలో ఈ ఫీచర్ వల్ల నష్టాలు ఎక్కువ. అదనపు ఖర్చులు భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల కస్టమర్లు సన్‌రూఫ్ కారు కొనుగోలు చేసే ముందు ఈ విషయాలపై అవగాహన పెంచుకోవాలి.


Click it and Unblock the Notifications








