దీపావళి వచ్చేస్తోంది.. వాహనదారులు ఇవి తప్పకుండా తెలుసుకోవాలి.. లేకుంటే ప్రమాదమే?
భారతదేశంలో అంగరంగ వైభాగంగా జరుపుకునే పండుగలలో 'దీపావళి' ఒకటి. ఇక దీపావళి ఎంతో దూరంలో లేదు. కావున ఈ దీపావళి ఎంతో సంతోషంతో దీపాల కాంతుల మధ్య టపాకాయలు కాల్చుకుంటూ చాలా సంతోషంగా సంబరాలు చేసుకుంటారు. అయితే ఈ సంబరాలలో కొన్ని అవాంతరాలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో పెట్రోల్ మరియు డీజిలు వాహనాలకంటే ఎలక్ట్రిక్ వాహనాలకు ఆధారణ విపరీతంగా పెరిగింది. కావున ఎక్కువమంది ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ఇప్పుడు వినియోగిస్తున్నారు. అయితే ఈ దీపావళి పండుగ సమయంలో మీ వాహనాలను ఎలా కాపాడుకోవాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. రండి.

పోర్టబుల్ అగ్నిమాపక యంత్రం (Portable Fire Extinguisher) తీసుకెళ్లండి:
మొదటగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. దీపావళి సమయంలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కావున మీ వాహనంలో తప్పకుండా ఒక పోర్టబుల్ అగ్నిమాపక యంత్రం ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఒక వేళా మీరు ఎలక్ట్రిక్ వాహనం నడుపుతున్నప్పుడు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. అయితే మీ వాహనంలో రిమూవబుల్ బ్యాటరీ ఆప్సన్ ఉంటే బ్యాటరీ తీసి సురక్షితంగా ఉన్న ప్రదేశంలో ఉంచడం మంచిది. ఇది ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. ఇది వాహన వినియోగదారులు తప్పకుండా గుర్తుంచుకోవాలి.

ప్రధమ చికిత్స పెట్టె (First aid box):
ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ప్రమాదంలో చాలా ఉపయోగకారిగా ఉంటుంది. కావున వాహన వినియోగదారులు తప్పకుండా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకెళ్లాయి. రానున్న దీపావళిని దృష్టిలో ఉంచుకుని మాత్రమే కాకుండా ఇది ఎప్పుడూ వాహనంలో ఉండటం మంచిది. ఎందుకంటే ఎనుకొకుండా ఏదైనా గాయాలు జరిగితే వెంటనే ప్రధమ చికిత్స చేసుకోవచ్చు.

ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో కాటన్, టించర్ మొదలైనవి ఉంచుకోవాలి. అంతే కాకుండా యాంటీ బర్న్ లోషన్, అలోవెరా జెల్ మరియు యాంటీ బయోటిక్ లోషన్ వంటి వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రమాదంలో చాలా ఉపయోగపడతాయి.

కారు డోర్స్ మరియు విండోస్ మూసి ఉంచండి:
మనం బహిరంగ ప్రదేశంలో ప్రయాణిస్తున్నప్పుడు టపాకాయలు వంటివి వీధుల్లో కాల్చేటప్పుడు అనుకోకుండా కాలులోపలికి పడే అవకాశం ఉంటుంది. కావున కారు యొక్క డోర్స్ మరియు విండోస్ అన్నీ కూడా మూసి ఉంచాలి. మూసి ఉంచే ప్రయాణం కూడా చేయాలి. ఇది తప్పకుండా పాటించాలి.

ఒక వేళా అనుకోకుండా మీరు కారు డోర్స్ మరియు విండోస్ ఓపెన్ చేసి ప్రయాణిస్తే, కారులోకి ఏదైనా కాలుతున్న టపాకాయలు పడితే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కావున ఇది కూడా తప్పకుండా గుర్తుంచుకోవాలి.

కారును కవర్ చేయవద్దు:
కారుని బయట పార్క్ చేసినప్పుడు దాని మీద దుమ్ము, ధూళి వంటివి పడకుండా కవర్‌తో కప్పుతారు. అయితే ఈ దీపావళి సమయంలో ఈ విధంగా అస్సలు చేయకపోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే చాలా కార్ల కవర్లు సింథటిక్ ఫ్యాబ్రిక్‌లతో తయారు చేయబడతాయి. వీటికి కొంత నిప్పు తగిలినా మొత్తం మండే అవకాశం ఉంటుంది. కావున అప్పుడు కారు మొత్తం కాలిపోయే ప్రమాదం ఉంది.

బాధ్యతాయుతంగా డ్రైవ్ చేయండి:
మీరు పండుగల సమయంలో కారుని బహిరంగా ప్రదేశాల్లో లేదా వీధుల్లో డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే పండుగ సమయంలో పిల్లలు ఎక్కడపడితే అక్కడ ఉంటారు. కావున మీరు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా అనుకోని ప్రమాదం జరుగుతుంది.

కారుని లేదా బైకును వేగంగా నడపడం వంటివి ఆ సందర్భంలో అస్సలు చేయకపోవడం మంచిది. అంతే కాకుండా టపాకాయలు కాల్చే వీధుల్లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణించాలి, అప్పుడు ఎక్కువ భయాందోళనలకు గురి కాకూడదు మరియు చాలా జాగ్రత్తగా ఉండాలి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
అందరికి ఇష్టమైన దీపావళి సంతోషంగా జరుపుకోవాలి, అయితే ఆ సంతోషంలో విషాదాలు జరిగే అవకాశాలు చాల ఎక్కువ. కావున తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే జరిగే ప్రమాదాలను కొంతవరకు ఆరికట్టవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటు ఎప్పటికప్పుడు భారతీయ మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియుకొత్త బైకుల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








