పబ్‌జీ ఆడుతూ బీఎండబ్ల్యూ కారు కొన్న గేమర్.. అయితే ఆ లగ్జరీ కారుని డ్రైవ్ చేయడం రాదంట!

కారు కొనడం చాలామందికి ఉండే కల. దానికోసం ఎంతో శ్రమించి, డబ్బులు పోగు చేసి కొనుగోలు చేస్తుంటారు చాలామంది. అయితే అలా కారు కొన్నాక.. దాన్ని నడపడం రాకపోతే ఎలా ఉంటుంది. మనం పడ్డ శ్రమకు సరైన ఫలితం లేకుండా పోతుంది. ఇలాంటి ఓ వింత సమస్య ఓ యువతకి ఎదురైంది. ఆ యువతే పాపులర్ పబ్జి గేమర్ కాశ్వీ హీరానందాని. ఇటీవల ఈ గేమర్ తాను తనకు నచ్చిన డ్రీమ్ కారును కొనుగోలు చేసేందుకు పడ్డ శ్రమ, అనుభవాల్ని చెబుతూ తన సోషల్ మీడియా వ్లాగ్‌లో షేర్ చేసింది.

ఆ వీడియోలో.‌. తాను BMW 3-series లగ్జరీ కారును కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఇదే వ్లాగ్‌లో ప్రస్తుతం తనకు ఈ కారును ఎలా డ్రైవ్ చేయాలో తెలియదని కూడా చెప్పింది. ఇప్పుడు తాను ఒక "ప్యాసింజర్ ప్రిన్సెస్" అని తనను తాను అభివర్ణించుకుంది కాశ్వీ. తాను ఇటీవల కొనుగోలు చేసిన BMW 3-series కారు డెలివరీ అయిందని చెబుతూ యూట్యూబ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసింది.

PUBG Gamer Kaashvi Hiranandani with BMW 3-Series

ఈ వీడియో ప్రారంభంలో ఈ గేమర్ గర్ల్.. తన మొదటి కారును అందుకోబోతున్న నేపథ్యంలో తన అనుభవాన్ని షేర్ చేసుకుంటున్నట్లుగా తెలిపింది. తన పరిచయం తర్వాత కాశ్వీ.. BMW డీలర్ షిప్ కేంద్రానికి చేరుకుంది. ఆ తర్వాత తాను కొనుగోలు చేసిన BMW 330 Li లగ్జరీ సెడాన్ కారును ఆవిష్కరించింది. ఇదే వీడియోలో డీలర్‌షిప్ కేంద్రంలో ఆమె కారుకు పూజలు చేస్తున్న దృశ్యాలు కూడా ఉన్నాయి.

ఆ తర్వాత కారుని ఆన్ చేసి, ఇంటికి వెళ్లే ముందు దగ్గర్లోని గుడికి ఈ కారును తీసుకు వెళుతున్నట్లుగా కనిపించింది. తన సొంత డబ్బులతో కొనుగోలు చేసిన మొదటి పెద్ద కొనుగోలు ఈ కారే అని అందులో ఆమె చెప్పింది. అలాగే తనకు ప్రస్తుతం దీన్ని ఎలా నడపాలో తెలియదని పేర్కొంది. అయితే తాను ఇప్పుడే ఈ కారును కొనుగోలు చేసినందున రాబోయే రోజుల్లో దీన్ని నడపడం నేర్చుకుంటానని చెప్పింది.

PUBG Gamer Kaashvi Hiranandani with BMW 3-Series

ఈ కారును తొందరగా డ్రైవ్ చేయడం నేర్చుకునేందుకు అందరి సపోర్ట్ కావాలని కోరింది. అందుకోసం వ్యూయర్స్ అందరూ తన వీడియో కింద కామెంట్ చేసి, తనకు డ్రైవింగ్లో మెళకువలు చెప్పాలని కోరింది. దీని తర్వాత రోజున ఇదే కారులో కాశ్వీ ఎయిర్ పోర్టుకు వెళ్లి తన బాయ్ ఫ్రెండ్, పాపులర్ గేమర్ స్కౌట్ ను కలుసుకుంది.

ఈ విషయాన్ని వీడియోలో ఆమె చెప్పింది. కాశ్వీ సెలెక్ట్ చేసుకున్న ఈ బీఎండబ్ల్యూ 330 Li Gran Limousine M Sport Pro edition కారు విషయానికి వస్తే.. ఈ లగ్జరీ సెడాన్ కారు skyscraper Grey metallic లో క్లాసీ షేడ్‌‌తో ఉంది. దీంట్లో blacked-out kidney grille, అడాప్టివ్ LED హెడ్ లాంప్స్, glossy black రియర్ డిఫ్యూజర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

దీని ఫ్రంట్ బంపర్ trim finished in a dark shadow metallic తో ఉంది. ఎం-స్పెసిఫిక్ ఇన్సర్ట్స్, ముందువైపు ఎం&డోర్ సీల్ ఫినిషర్స్, వెనకవైపు ఎం-స్పెసిఫిక్ ఎయిరో ప్యాకేజ్‌తో ఉంది. ఈ 330 Li Gran Limousine M Sport Pro Edition కారు ఇంటీరియర్‌లో Curved డిస్ప్లే, ఎలక్ట్రికల్లీ అడ్జస్ట్బుల్ ఫ్రంట్ సీట్స్ ఉన్నాయి.

అంతేగాకుండా దీంట్లో BMW 8.5 OS, వైర్‌లెస్‌ ఛార్జర్, పార్క్ అసిస్ట్ ప్లస్, పనోరమిక్ సన్‌రూఫ్, అంబియంట్ లైటింగ్ ఉన్నాయి. అలాగే దీంట్లో త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. దీంట్లో 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 254 bhp గరిష్ట పవర్, 400 nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇవి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్‌తో అనుసంధానించి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, February 13, 2025, 18:37 [IST]
English summary
Pubg gamer kaashvi hiranandani with bmw 3 series car viral video
Read more on: #celebrity cars #bmw #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+