పోలీసుల దెబ్బతో ఆ ప్రముఖ బైక్ యజమానులకు మైండ్ బ్లాంక్.. ఈ వైరల్ వీడియో చూసేయండి.!!
దేశంలో యువ రైడర్లు, ఇంకా ఔత్సాహికులు చాలా మంది తమ బైక్‌లకు రకరకాల సైలెన్సర్‌లను అమర్చి హైవేలపై ప్రదర్శన చేస్తుంటారు. ప్రజల దృష్టి తమపై ఉండేలా.. అధిక సౌండ్‌తో రోడ్డుపై రచ్చ చేస్తుంటారు. అయితే ఇందుకోసం వారు ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్‌లను ఉపయోగిస్తారు. ఇలా ఉపయోగించడం చట్టవిరుద్ధం. అయినప్పటికీ దీనిని కొందరు లెక్క చేయడం లేదు.
ఈ నేపథ్యంలో ఇలాంటి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్న వారిపై భారత్‌లోని ప్రధాన నగరాల్లో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. బైక్‌లపై అక్రమంగా ఎగ్జాస్ట్‌లను అమర్చడానికి పోలీసులు మాత్రం అంగీకరించడం లేదు. కాగా తాజాగా మహారాష్ట్రలోని పూణెలో ఇలా అక్రమంగా బైక్‌లకు ఎగ్జాస్ట్‌లను అమర్చిన వారికి మంచి ఝలక్ ఇచ్చారు పోలీసులు..

ముఖ్యంగా దేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్(Royal Enfield) యజమానులు ఇలాంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడుతున్నారు. భారత్‌లో యువతకు ఆర్‌ఈ బైక్‌లపై ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఆ బైక్ స్టెలిష్ అండ్ బోల్డ్ డిజైన్‌తో పాటు ఇంజిన్ సౌండ్‌కు భారత్‌లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలో కొందరు ఈ బైక్‌లకు సైలెన్సర్‌ను మాడిఫై చేసేందుకు ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్‌లను అమర్చి రోడ్డుపై నాయిస్‌ను సృష్టిస్తున్నారు.
ఈ క్రమంలో వీరికి పూణె పోలీసులు, రవాణా శాఖ అధికారులు మంచి గుణపాఠం నేర్పించారు. ఇటీవల అక్రమ సైలెన్సర్లు అమర్చిన 571 రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుల(Aftermarket Exhaust)ను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఆ బైక్‌లపై ఉన్న సైలెన్సర్‌లను కూడా తొలగించి రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు. అధికారులు అక్కడితో ఆగకుండా.. ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వైరల్ వీడియో నెట్టింట్లో ఇప్పుడు విస్తృతంగా వ్యాపిస్తోంది.

ఇక నుంచి ఎవరూ కూడా అక్రమ సైలెన్సర్లతో బైక్ నడపకూడదని ఈ వీడియోను విడుదల చేసి వాహనదారులను హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న బైక్‌లలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 500 మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ వంటి బైక్‌లు ఉన్నాయి.
అయితే రోడ్డు రోలర్‌తో పోలీసులు.. సైలెన్సర్లను ధ్వంసం చేయడం ఇది తొలిసారి కాదు. హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో గతంలో కూడా ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకుని వారికి బుద్ధి చెప్పారు. కానీ కొందరి వైఖరిలో మాత్రం మార్పు రాకపోవడం బాధాకరం.

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: అక్రమ సైలెన్సర్లపై పూణేలో పోలీసు శాఖ మరియు ట్రాఫిక్ విభాగం తీసుకున్న చర్యలు అభినందనీయం. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనదారులు ఇలా అక్రమ ఎగ్జాస్ట్‌లను ఉపయోగించకుండా.. పోలీసులు మున్ముందు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పూణెతో పాటు దేశంలోని ఇతర నగరాల్లో కూడా పోలీసులు ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీ బైక్‌లలో నాన్-కంప్లైంట్ సైలెన్సర్‌లు అమర్చబడి ఉంటే, వాటిని వెంటనే తొలగించడం ఉత్తమం.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








