వీడియో చూడండి.. ఇలాంటి వారికి ఎలా బుద్ది చెప్పాలో మీరే చెప్పండి!
సోషల్ మీడియాలో లైక్స్ కోసం ప్రయత్నిస్తే లైఫ్ పోవచ్చు, వ్యూవ్స్ కోసం చూస్తే నువ్వే లేకుండా పోవచ్చు. ఇలాంటివి ఎన్ని చెప్పినా కొంతమంది మాత్రం అస్సలు మారనే మారరు. రోడ్డు ప్రమాదాల వల్ల రోజుకి కొన్ని వందలమంది ప్రాణాలు కోల్పోతుంటే.. కొందరు మాత్రం ప్రమాదం మా అంచులకు కూడా రాదు అనుకుని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఓ యువతి చేతులు వదిలేసి బైక్ మీద వెళ్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువతి యమహా ఆర్ఎక్స్100 బైక్ మీద వెళ్తోంది. అయితే ఆమె బైక్ హ్యాండిల్ బార్ పట్టుకోలేదు. పైగా బ్యాగ్రౌండ్‌లో ప్లే అయ్యే పాటకు ఎక్స్‌ప్రెషన్ ఇస్తోంది. తన కాళ్ళను కూడా ఒకవైపు పెట్టుకుని కూర్చుంది. మధ్యలో ఓ సారి హ్యాండిల్ బార్ పట్టుకుని అంతకు ముందే అక్కడ పెట్టుకున్న రోజా పువ్వును తీసుకుంది. ఇదంతా ఎవరో రికార్డ్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

పబ్లిక్ రోడ్డు మీద బైకుపై విన్యాసాలు చేస్తున్న అమ్మాయి వీడియోను పూణే పల్స్ వారి ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ ఆ యువతి మీద చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం మాత్రమే కాదు.. వారు జీవితంలో మళ్ళీ వాహనం ముట్టకుండా లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని చెబుతున్నారు.
బైకుపై వెళ్తున్న ఆ యువతి రక్షణ కోసం హెల్మెట్ కూడా ధరించలేదు. కానీ పబ్లిక్ రోడ్డు మీద విన్యాసాలు చేస్తోంది. ఈ ఘటన పూణేలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే వీడియోలో బైక్ నెంబర్ ప్లేట్ కనిపించడం లేదు. అంతే కాకుండా ఆ యువతి ఎవరనేది కూడా తెలియడం లేదు. అయితే తప్పకుండా ఆ యువతి మీద చర్యలు తీసుకోవాలని నెటిజన్లు పోలీస్ అధికారులను ట్యాగ్ చేశారు.

పబ్లిక్ రోడ్డు మీద ఇలాంటి విన్యాసాలు చేయడం నేరం మాత్రమే కాదు, ప్రమాదం.. ప్రాణాంతకం కూడా. పబ్లిక్ రోడ్డు మీద ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిమీద కఠిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే వారి మాదిరిగానే మరికొందరు ఇలాంటి పనులు చేయడానికి ముందుకు వస్తారు. కాబట్టి ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు అరికట్టాలంటే కారకులపై చర్యలు తీసుకోక తప్పదు.
నిజానికి ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో బైకులపై వెల్తూ విన్యాసాలు చేసిన అమ్మాయిలు చాలామందే ఉన్నారు. గతంలో పాట్నాకు చెందిన ఓ యువతో పబ్లిక్ రోడ్డు మీద బైక్ స్టంట్స్ చేస్తూ అనేక సార్లు పట్టుబడింది. ఈమె గత ఏడాది తన యమహా ఆర్15 బైక్ రైడ్ చేస్తూ.. వ్యవహరించడం చూడవచ్చు. అప్పుడు ఆమె హెల్మెట్ కూడా ధరించలేదు.
ఇదిలా ఉండగా.. మరో ఘటనలో ఓ యువతి చీరకట్టులోనే రాయల్ ఎన్ఫీల్డ్ రైడ్ చేస్తూ కనిపించారు. ఆమె బైక్ రైడ్ చేస్తున్న సమయంలో మధ్య మధ్యలో చేతులు వదిలేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇలాంటి చర్యలకు పాల్పడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీటిని తప్పకుండా అరికట్టాలి. లేకుంటే ప్రమాదకరమైన స్టంట్స్ చేసేవారికి మాత్రమే కాకుండా ప్రజా రహదారిలో వెళ్లేవారు కూడా ప్రమాదంలో పడతారు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








