పునీత్ రాజ్‍కుమార్ భార్య కొత్త కారు ఇదే.. ధర ఎంతో తెలుసా?
కన్నడ ప్రజల ఆరాధ్య దైవం, మనసున్న మంచి మనిషి 'పునీత్ రాజ్‍కుమార్'. ఈయన భార్య ఇటీవల ఓ కొత్త కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
పునీత్ రాజ్‍కుమార్ అనేది కేవలం పేరు కారు.. కన్నడిగులు హృదయ స్పందన. ఈయన గురించి పెద్దగా పరిచయమే అవకాశం లేదు. చిత్ర సీమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. పునీత్ అకాల మరణం ఇప్పటికీ చాలామందిని శోకసంద్రంలోనే ముంచింది. పునీత్ బాధ్యతలను ఆయన భార్య అశ్విని పునీత్ రాజ్‍కుమార్ తన భుజాల మీద వేసుకున్నారు.

భర్త మరణం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అశ్విని పునీత్ రాజ్‍కుమార్.. కొత్త ప్రతిభావంతులకు అవకాశాలు కల్పిస్తూ సినిమాలు నిర్మిస్తున్నారు. కన్నడ చిత్ర సీమలో విజయవంతమైన నిర్మాతలలో ఒకరుగా నిలిచిన అశ్విని.. తాజాగా ఓ కొత్త కారును కొనుగోలు చేశారు. ఇది ఆడి కంపెనీకి చెందిన క్యూ 7 అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో కొత్త కారును చూడవచ్చు.
అశ్విని పునీత్ రాజ్‍కుమార్ కొత్త ఆడి క్యూ7 కారు పక్కన నిలబడి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం అభిమానులను తెగ ఆకర్షిస్తోంది. పలువురు అభినందనలు కూడా తెలియజేస్తున్నారు. గ్రే కలర్ పొందిన ఆడి క్యూ7 చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ కారు ధర బెంగళూరులో రూ.1.10 కోట్ల నుంచి రూ.1.20 కోట్లు వరకు ఉందని సమాచారం. ఇది క్యూ7 యొక్క టాప్-ఎండ్ మోడల్.

అశ్విని పునీత్ రాజ్‍కుమార్ కొనుగోలు చేసిన ఆడి క్యూ7 కారు మంచి డిజైన్ కలిగి ఉండటమే కాకుండా.. అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. కేవలం 5.9-సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవ్వగల ఆడి క్యూ7 మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్ పొందుతుంది. ప్రయాణికులకు మంచి భద్రతను అందిస్తుంది. ఈ కారులో 2995-సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 335.25 Bhp పవర్ మరియు 500 Nm టార్క్ అందిస్తుంది.
పునీత్ రాజ్‍కుమార్ మరణాంతరం బహుశా అశ్విని పునీత్ రాజ్‍కుమార్ కొనుగోలు చేసిన మొదటి కారు ఇదే అని భావిస్తున్నాము. నిజానికి అశ్విని పునీత్ రాజ్‌కుమార్‌కు ఆటోమొబైల్స్ అంటే పెద్దగా ఆసక్తి లేదు. అయితే కార్లంటే పునీత్ రాజ్‌కుమార్‌కు ఎక్కువ ఆసక్తి. ఈ కారణంగానే ఈయన వద్ద లంబోర్గిని ఉరుస్, బీఎండబ్ల్యూ, జాగ్వార్, రేంజ్ రోవర్ మరియు మినీ కూపర్ వంటి కార్లు ఉన్నాయి.
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‍కుమార్ చిన్నప్పటి నుంచే సినిమాల్లో నటిస్తూ.. తనదైన రీతిలో అభిమానులను సంపాదించుకున్నారు. బాల నటుడుగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఈయన ఆ తరువాత కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా నిజం జీవితంలో ఎంతమందికి సేవ చేసిన ఘనత కూడా పునీత్ సొంతం. ఈ కారణంగానే పునీత్ మరణించి మూడు సంవత్సరాలు పూర్తవుతున్నా.. అభిమానులు మాత్రం ఇప్పటికీ గుండెల్లోనే పెట్టుకున్నారు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








