Just In
- 2 hrs ago
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- 3 hrs ago
దక్షిణ భారత్‌లో కొత్త డీలర్షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- 5 hrs ago
భారత్‌లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- 5 hrs ago
రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
Don't Miss
- News
హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు భారీ ఊరట: ట్రంప్ నిర్ణయాలకు చెక్ పెట్టిన జో బైడెన్
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇకపై ఈ వెహికల్ నెంబర్స్ నిషేధం.. ఎందుకో తెలుసా ?
దేశంలో విఐపి కల్చర్ ని అంతం చేయాలని, భద్రతా కారణాల దృష్ట్యా 1988 కి ముందు జారీ చేసిన రిజిస్ట్రేషన్ నంబర్లను నిషేధించాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆదేశించారు. ఈ నంబర్లను కలిగి ఉన్న వాహనాలకు ప్రత్యామ్నాయ నంబర్లను జారీ చేయాలని ముఖ్యమంత్రి రవాణా శాఖను ఆదేశించారు.

1988 కి ముందు జారీ చేసిన రిజిస్ట్రేషన్ నంబర్లను హర్యానా మరియు హిమాచల్ ప్రదేశ్లలో నిషేధించారని కూడా అమరీందర్ సింగ్ చెప్పారు. రవాణా శాఖ ప్రకారం, ప్రజలు తమ వెహికల్ నంబర్స్ ని ఒక ప్రతిష్ట కోసం ఉపయోగిస్తారు. ఇటువంటి సంఖ్యలు విఐపి కల్చర్ ని ప్రోత్సహిస్తాయి.

సాధారణంగా ఇటువంటి నంబర్స్ కనిపెట్టడం కొంత కష్టతరం. ఈ నెంబర్స్ ఉపయోగించి వాహనాలను చాలా నేర కార్యకలాపాలకు కూడా ఉపయోగిస్తున్నారు. వీఐపీ నంబర్లు ఉన్నందున పోలీసులు కూడా ఈ వాహనాలను ఆపడానికి ప్రయత్నించారు.
MOST READ:2020 లో లాంచ్ అయిన టాప్ 5 బెస్ట్ స్కూటర్స్ ; వివరాలు

ఈ వాహనాలు వస్తువులను అక్రమంగా రవాణా చేయడానికి మరియు విక్రయించడానికి కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు.ఈ నంబర్స్ రాష్ట్ర భద్రతకు ముప్పు తలపెట్టే అవకాశం ఉన్నందున వాటిని నిషేధించనున్నట్లు రవాణా శాఖ తెలిపింది. పాత వాహనాల నంబర్స్ కూడా చాలా వాహనాల్లో ఉపయోగిస్తారు.

రవాణా శాఖ రిజిస్టర్‌లో పాత నంబర్స్ రికార్డులు కూడా అందుబాటులో లేవు. ఇది పోలీసులకు ఏర్పడే ఒక పెద్ద సమస్య. ఇదిలావుండగా, పంజాబ్ ప్రభుత్వం ఇటీవల డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ తేదీని జనవరి 15 వరకు పొడిగించింది.
MOST READ:మహిళా రైడర్స్ కోసం ప్రత్యేకంగా తయారుచేసిన స్టీల్‌బర్డ్ హెల్మెట్స్ ; వివరాలు

డిజిటల్ డ్రైవింగ్ లైసెన్సులు పొందాలని పంజాబ్ ప్రభుత్వం ప్రజలకు సూచించింది. పంజాబ్‌లో డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి, www.punjabtransport.org వెబ్ సైట్ ని సందర్శించవచ్చు లేదా www.sarathi.parivahan.gov.in వెబ్ సైట్ ని సందర్శించండి

అప్లై చేసుకున్న తరువాత డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌ను ట్రాన్స్ పోర్ట్ యాప్ ద్వారా లేదా డిజిలాకర్ యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ కి చివరి తేదీ జనవరి 15, వాహనదారులు దీనిని దృష్టిలో ఉంచుకుని దీనికి అప్లై చేసుకోవచ్చు.
MOST READ:ఫ్యాన్సీ నెంబర్ కోసం 32 లక్షలు వేలం పాడాడు.. కానీ చివరికి ఏమైందంటే ?

ఇటీవల ఢిల్లీలో డిసెంబర్ 15 నుండి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ తప్పనిసరి అని ప్రభుత్వం జారీ చేసింది. ఈ రిజిస్ట్రేషన్ ప్లేట్ లేని వాహనాలకు రూ. 5,500 జరిమానా విధిస్తున్నారు. మొదటి రోజు ఢిల్లీ పోలీసులు 239 వాహనాలకు జరిమానా విధించారు.

సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం, 2019 ఏప్రిల్ 1 లోపు కొనుగోలు చేసిన వాహనాలపై హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఏర్పాటు చేయడం తప్పనిసరి. అమ్మకాల తర్వాత వాహనాలలో కొత్త నంబర్ ప్లేట్లు ఉన్నాయి.
MOST READ:2020లో విడుదలైన టాప్ 10 బెస్ట్ బైక్స్; మోడల్ వారీగా వివరాలు

హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ సాధారణ నంబర్ ప్లేట్ మాదిరిగానే ఉంటుంది, కానీ సాధారణ నెంబర్ ప్లేట్స్ కంటే ఎక్కువ సాంకేతిక లక్షణాలు ఉంటాయి. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్‌లో క్రోమియం హోలోగ్రామ్ స్టిక్కర్ ఉంది. ఇందులో వాహన రిజిస్ట్రేషన్ నంబర్, ఇంజన్ నంబర్, చాసిస్ నంబర్ ఉన్నాయి.

ఈ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ వల్ల వాహనదారులకు చాలా లాభాలు ఉన్నాయి. ఇవి వాహన దొంగతనాలు జారకుండా ఉండటంలో సహాయపడతాయి. కావున వాహనదారులు తప్పకుండా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ వినియోగించుకోవాలి.