ఫ్యాన్సీ నెంబర్ కల్చర్‌కి బ్రేక్ వేసిన గవర్నమెంట్; ఎక్కడో తెలుసా?

చాలామంది వాహన ప్రియుల తమ వాహనాలు ఇతర వాహనాలకంటే కొంత ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు, ఇందులో భాగంగానే చాలా మంది ఫ్యాన్సీ నెంబర్లు ఉపయోగిస్తుంటారు. ఫ్యాన్సీ నెంబర్స్ అనేవి వాహనదారుని యొక్క స్టేటస్ తెలుపుతాయి. వాహనదారులు ఫ్యాన్సీ నెంబర్స్ కోసం ఎంత డబ్బు చెల్లించడానికైనా వెనుకాడరు. ఫ్యాన్సీ నెంబర్ల కోసం లక్షల్లో డబ్బు ఖర్చు చేసి కొనుగోలుచేసిన విషయాలు ఇప్పటికే కోకొల్లలు.

ఫ్యాన్సీ నెంబర్ కల్చర్‌కి బ్రేక్ వేసిన గవర్నమెంట్; ఎక్కడో తెలుసా?

వీటన్నింటికి అడ్డుకట్ట వేస్తూ ఇప్పుడు పంజాబ్ రవాణా శాఖ ఉత్తర్వులు జరీ చేసింది. పంజాబ్ రవాణా శాఖ పాత కాలపు నంబర్లుగా పిలువబడే ఫాన్సీ నంబర్ల రిజిస్ట్రేషన్ ఆపమని ఆదేశించిన తరువాత 100 మంది వాహన యజమానులు గత డిసెంబర్ నుండి పంజాబ్ రాష్ట్ర రవాణా శాఖను సంప్రదించినట్లు సమాచారం.

ఫ్యాన్సీ నెంబర్ కల్చర్‌కి బ్రేక్ వేసిన గవర్నమెంట్; ఎక్కడో తెలుసా?

పాత ఫాన్సీ నంబర్లతో వేలాది వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాయని పంజాబ్ రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఈ వాహనాల్లో ఎక్కువ భాగం రాజకీయ నాయకులు మరియు ప్రముఖులకు చెందినవి. పాతకాలపు నంబర్ల అమ్మకం సమయంలో పెద్ద ఎత్తున ఆర్థిక కుంభకోణం జరిగిందని ఫిర్యాదులు కూడా వచ్చాయి.

MOST READ:కొత్త కారు కొన్న కన్నడ సీరియల్ యాక్టర్ భరత్ బోపన్న.. పూర్తి వివరాలు

ఫ్యాన్సీ నెంబర్ కల్చర్‌కి బ్రేక్ వేసిన గవర్నమెంట్; ఎక్కడో తెలుసా?

2020 డిసెంబర్‌లో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పాత వాహన నంబర్లను తిరిగి నమోదు చేయాలని ఆదేశించారు. అయితే మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చిన తరువాత కూడా 1988 తరువాత రిజిస్టర్ అయిన వాహన సంఖ్యలు కూడా ఇందులో ఉంటాయి.

ఫ్యాన్సీ నెంబర్ కల్చర్‌కి బ్రేక్ వేసిన గవర్నమెంట్; ఎక్కడో తెలుసా?

ఫ్యాన్సీ నెంబర్లు చాలా వరకు విఐపిలు ఉపయోగిస్తారు. ఇలాంటి కల్చర్ ని ఆపాలని, అంతే కాకుండా ఇందులో జరిగే చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించాలని పంజాబ్ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వు పంజాబ్‌లోనే కాదు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా జారీ చేయబడింది.

MOST READ:సమంత మనసు ఆకాశమంత.. దీనికి ఇదే నిలువెత్తు నిదర్శనం

ఫ్యాన్సీ నెంబర్ కల్చర్‌కి బ్రేక్ వేసిన గవర్నమెంట్; ఎక్కడో తెలుసా?

అదేవిధంగా హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లు మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 217 కింద ఇలాంటి ఉత్తర్వులు జారీ చేశాయి. కానీ పాతకాలం నుంచి ఉపయోగిస్తున్న ఈ వెహికల్ నంబర్స్ కొంతమంది చాలా ప్రతిష్టగా భావిస్తే మరికొందరు వాటిని సెంటిమెంట్ గా భావిస్తున్నారు.

ఫ్యాన్సీ నెంబర్ కల్చర్‌కి బ్రేక్ వేసిన గవర్నమెంట్; ఎక్కడో తెలుసా?

ఇది మాత్రమే కాకుండా తమ వాహనాలు చాలా ప్రత్యేకంగా కనిపించడానికి కూడా చాలామంది ఈ ఫ్యాన్సీ నెంబర్లు ఉపయోగిస్తారు. పంజాబ్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల వెనుక చాలా పెద్ద సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు మరియు పెద్ద పెద్ద ధనవంతులు ఈ ఫ్యాన్సీ నెంబర్లను ఉపయోగిస్తున్నారు.

MOST READ:2021 షాంఘై ఆటో షోలో టెస్లా కంపెనీపై విరుచుకుపడ్డ యువతి [వీడియో]

ఫ్యాన్సీ నెంబర్ కల్చర్‌కి బ్రేక్ వేసిన గవర్నమెంట్; ఎక్కడో తెలుసా?

ఈ తరుణంలో ఫ్యాన్సీ నెంబర్లపై ఇటువంటి చర్య తీసుకోవడం నిజంగా చాలా పెద్ద సవాలు లాంటిదే అని చెప్పాలి. ఇంకా పంజాబ్ ప్రభుత్వం ఫాన్సీ నంబర్లను ఉపయోగించకుండా ఉండటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రాలు ఇలాంటి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంది.

ఫ్యాన్సీ నెంబర్ కల్చర్‌కి బ్రేక్ వేసిన గవర్నమెంట్; ఎక్కడో తెలుసా?

ఇప్పటికే చాలామంది ప్రముఖులు ఈ ఫ్యాన్సీ నెంబర్లను కలిగి ఉన్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఫ్యాన్సీ నెంబర్లు ఉపయోగిస్తున్న వాహనాలను తనికీ చేయడానికి కూడా పోలీసులు వెనుకాడరు.

MOST READ:భారత్‌లో అక్కడ కరోనా లాక్‌డౌన్ స్టార్ట్; కఠినమైన రూల్స్, వీటికి మాత్రమే మినహాయింపు

ఫ్యాన్సీ నెంబర్ కల్చర్‌కి బ్రేక్ వేసిన గవర్నమెంట్; ఎక్కడో తెలుసా?

చాలామంది వాహనదారులు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉపయోగిస్తున్న ఫ్యాన్సీ నెంబర్లను ఉపయోగించి చాలా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ తరుణంలో వీటన్నింటిని అరికట్టడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా ఒక సవాలు లాంటిదనే చెప్పాలి.

Most Read Articles

English summary
Punjab Government To Stop Issuing Fancy Numbers. Read in Telugu.
Story first published: Wednesday, April 21, 2021, 14:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X