లాక్‌డౌన్ లో రోడ్డుపై కనిపించిన కొత్త జంట మెడలో పూల మాలలు వేసిన పోలీసులు[వీడియో]

కరోనా మహమ్మారి గత ఏడాది కాలంగా భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి లక్కకుమించిన నష్టాన్ని కలిగించింది. ఈ కరోనా వైరస్ దేశవ్యాప్తంగా వ్యాపించకుండా ఉండటానికి మరియు ప్రజలు ఈ మహమ్మారికి బలైపోకుండా ఉండటానికి గత సంవత్సరం కూడా కరోనా లాక్ డౌన్ విధించబడింది.

లాక్‌డౌన్ లో రోడ్డుపై కనిపించిన కొత్త జంట మెడలో పూల మాలలు వేసిన పోలీసులు[వీడియో]

అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ చాలా విస్తరించింది.ప్రపంచంలో కరోనా ఎక్కువగా విస్తరించిన దేశల్లో భారతదేశం కూడా ఒకటిగా ఉంది. ఈ కారణంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్ విధించబడింది. ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రజలు కొన్ని కఠినమైన నిబంధనలు పాటించాలని ప్రభుత్వాలు ఆదేశించాయి.

లాక్‌డౌన్ లో రోడ్డుపై కనిపించిన కొత్త జంట మెడలో పూల మాలలు వేసిన పోలీసులు[వీడియో]

ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం ప్రజలు అత్యవసర సమయంలో తప్ప రోడ్డుపైకి రావడానికి నిషేధం. కానీ కొన్ని అత్యవసర సమయాల్లో మాత్రం కొన్ని షరతులతో అనుమతించబడుతుంది. ఇందులో వివాహ వేడుకల వంటి వాటికీ పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రజలు హాజరు కావాలని అనుమతించబడింది.

MOST READ:పేద ప్రజలకు అండగా భువనం ఫౌండేషన్ ముందడుగు

లాక్‌డౌన్ లో రోడ్డుపై కనిపించిన కొత్త జంట మెడలో పూల మాలలు వేసిన పోలీసులు[వీడియో]

ప్రస్తుతం ఈ లాక్ డౌన్ సమయంలో పోలీసులు చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని చాలా జాగ్రతగా వ్యవహరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో, పోలీసులు సామాన్యులతో కలిసి నడుస్తూ వారికి సహాయం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ప్రజల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు.

లాక్‌డౌన్ లో రోడ్డుపై కనిపించిన కొత్త జంట మెడలో పూల మాలలు వేసిన పోలీసులు[వీడియో]

ఇప్పుడు ఐపిఎస్ అధికారి దీపన్షు కబ్రా తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటను పంజాబ్ పోలీసులు పలకరిస్తున్నారు. వీడియోలో ఇద్దరు పోలీసులు తమ బైక్‌ను నడుపుతున్న జంటను ఆపటం చూడవచ్చు.

MOST READ:స్పెషల్ కార్ అంబులెన్స్‌ సర్వీస్ ప్రారంభించిన చెన్నై మున్సిపల్ కార్పొరేషన్; వివరాలు

లాక్‌డౌన్ లో రోడ్డుపై కనిపించిన కొత్త జంట మెడలో పూల మాలలు వేసిన పోలీసులు[వీడియో]

పోలీసులు ఆ కొత్త జంటను పలకరించి పూలు ఇస్తారు. అంతే కాకుండా కొంత డబ్బు కూడా ఇవ్వడం ఇక్కడ చూడవచ్చు. పోలీసులు చేసిన ఈ చర్యకు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఎంతోమంది ప్రజలు ప్రశంసిస్తున్నారు. నూతన వధూవరులు కోవిడ్ నిబంధనలను పాటించి బైక్‌పై ఇంటికి వెళ్లారు. పోలీసుల ప్రవర్తన అద్భుతంగా ఉందని దీపన్షు కబ్రా అన్నారు.

దీపన్షు కబ్రా చేసిన ఈ ట్వీట్‌కు ఇప్పటివరకు 6 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. అంతే కాకుండా అతని ట్వీట్ 837 సార్లు రీట్వీట్ చేయబడింది మరియు 56 వేలకు పైగా వ్యక్తులచే వీక్షించబడింది. లాక్ డౌన్ సమయంలో వివిధ రాష్ట్రాల్లోని పోలీసులు ప్రజలకు సహాయం చేస్తున్నారు.

MOST READ:ఆటోపైలట్ మోడ్‌లో స్టంట్ చేసిన ఇండో-అమెరికన్ అరెస్ట్; వివరాలు

లాక్‌డౌన్ లో రోడ్డుపై కనిపించిన కొత్త జంట మెడలో పూల మాలలు వేసిన పోలీసులు[వీడియో]

కొన్ని రోజుల క్రితం అంబులెన్సులు కొరత ఉన్న సమయంలో హర్యానా పోలీసులు ఎస్‌యూవీ అంబులెన్స్‌లను నడుపుతున్న సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది. కరోనా కట్స్ కాలంలో చాలామంది ప్రజలకు పోలీసులు సహాయం కూడా చేస్తున్నారు.

Most Read Articles

English summary
Punjab Police Bless Newly Married Couple. Read in Teluu.
Story first published: Sunday, May 16, 2021, 12:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X