Just In
- 11 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 13 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 14 hrs ago
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 14 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వలస కార్మికుల కోసం ఫ్రీ బస్ సర్వీస్ , ఎక్కడో తెలుసా..?
భారతదేశంలో కరోనా మహమ్మారి ఎక్కువగా విస్తరిస్తున్న కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించబడింది. ఈ లాక్ డౌన్ కారణంగా సుదూర ప్రాంతాలలో ఉండే వలస కార్మికులు ఎక్కడికక్కడ నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా చాలా మంది వలస కూలీలు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇటీవల కాలంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను స్వస్థలాలకు తీసుకురావడానికి దేశవ్యాప్తంగా అనేక బస్సులు మరియు రైళ్లను ఉపయోగించనున్నారు.

కరోనా కారణంగా పంజాబ్ ప్రభుత్వం వలస కార్మికులను ఉత్తరాన ఉన్న వారి స్వగ్రామాలకు తీసుకెళ్లడానికి ఉచిత బస్సు సేవలను ప్రారంభించింది. సోమవారం నుంచి బస్ సర్వీసులు ప్రారంభమవుతుంది.

మొదటి బస్సులో 30 మంది వలస కార్మికులను జలంధర్ నుంచి తీసుకెళ్తారు. ఈ బస్సుల ఖర్చును పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. 55 రైళ్లు సర్వీసు ప్రారంభించిన తర్వాత ఈ సేవను ప్రారంభించారు. ఫలితంగా ఉత్తర ప్రాంతంలోని అనేక ప్రదేశాలకు ప్రజలు రవాణా చేయబడుతున్నాయి.
MOST READ:వెస్పా, అప్రిలియా డీలర్షిప్స్ ఓపెన్, ఎక్కడో తెలుసా !

ప్రజలు సిటీ బస్‌స్టాప్‌కు చేరుకోగానే ఆరోగ్య శాఖకు చెందిన ప్రత్యేక బృందం వారిని పరిశీలిస్తారు. అప్పుడు కేవలం 30 మందిని మాత్రమే బస్సులో తీసుకెళ్లారు మరియు సామాజిక దూరాన్ని కూడా కొనసాగిస్తారు. అంతే కాకుండా ఈ సమయంలో ప్రయాణికులకు నీరు మరియు ఆహారాన్ని అందించారు.

అన్ని బస్సు ఏర్పాట్లు ఆయా జిల్లాలచే చేయబడ్డాయి మరియు రాబోయే కొద్ది రోజుల్లో ఫ్రీ లేబర్ బస్సును ప్రారంభించనున్నారు. ఈ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు. దీని కోసం వలస కార్మికులు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
MOST READ:దుబాయ్‌లోని సినీ ప్రేమికుల కోసం డ్రైవ్-ఇన్ సినిమా, ఎలా ఉందో మీరే చూడండి

పంజాబ్ ప్రభుత్వం అందించే ఉచిత బస్సులు గౌతమ్ బుద్ధ నగర్, మీరట్, ఘజియాబాద్, బులాండ్ సిటీ, అలీగర్, ముజఫర్ నగర్, బాగపట్, సహారాన్పూర్ మరియు మధురాలకు వెళ్లి కార్మికులను ఆయా నగరాలకు తీసుకెళ్తారు.

వలస కార్మికుల కోసం మూడు లేబర్ రైళ్లు పంజాబ్ నుండి పూర్ణియా, అరియారియా, బీహార్ మరియు ఉత్తర ప్రదేశ్ లోని జైన్పూర్ లకు నడపబడతాయి. వలస కార్మికులను జలంధర్‌కు పంపించడానికి ప్రభుత్వం రూ. 3.93 కోట్లు ఖర్చు చేశారు.
MOST READ:కరోనా వైరస్ నివారించడానికి ఉబర్ కొత్త ఐడియా

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం 1000 బస్సుల నిర్వహణను కూడా ప్రారంభించింది. లేబర్ స్పెషల్ రైళ్లను దేశవ్యాప్తంగా నడుపుతున్నారు. ప్రస్తుతం రోజుకు 300 కి పైగా రైళ్లు కదులుతున్నాయి. భారతదేశంలో ప్రస్తుతం నాల్గవ దశ లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ నాల్గవ దశ లాక్ డౌన్ లో ప్రభుత్వం అన్ని ప్రాంతాలను రెడ్, ఆరంజ్ మరియు గ్రీన్ జోన్లుగా విభజించి కొన్ని సడలింపులు కల్పించారు. ఈ క్రమంలో కార్మికులను వారి ప్రాంతాలకు తరలించడానికి ప్రభుత్వాలు సన్నాహాలను సిద్ధం చేస్తున్నారు.