కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ కొన్న పంజాబీ సింగర్, ఎవరో తెలుసా?

ప్రముఖ వాహన తయారీ సంస్థ ల్యాండ్ రోవర్ తన కొత్త లగ్జరీ డిఫెండర్ భారతమార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్, ఎస్‌యూవీ మోడల్ కారు. ఇది అనేక లగ్జరీ ఫీచర్స్ కలిగి ఉండటంతోపాటు వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కారణంగా ఎక్కువమంది ఈ ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ కొనుగోలు చేయడానికి ఆసక్తి కనపరుస్తుంటారు. ఇటీవల ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ ప్రముఖ పంజాబీ సింగర్ కొనుగోలు చేసినట్లు సమాచారం.

కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ కొన్న పంజాబీ సింగర్, ఎవరో తెలుసా?

పంజాబీ సింగర్ సతీందర్ సర్తాజ్ కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును కొనుగోలు చేశారు. సతీందర్ సర్తాజ్ కి ఎంతో ఇష్టమైన డ్రీమ్ కార్ ఇది అని ఆయన తన ట్విట్టర్ పేజీలో తెలిపారు. సింగర్ సతీందర్ సర్తాజ్ ఇప్పటికే పాత తరం డిఫెండర్ కారును కలిగి ఉన్నారు. ఇప్పుడు డిఫెండర్ కారుపై ఉన్న ఆసక్తి కారణంగా ఇప్పుడు ఈ కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ కొనుగోలు చేశారు.

కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ కొన్న పంజాబీ సింగర్, ఎవరో తెలుసా?

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీలు ల్యాండ్ రోవర్ కార్లను కలిగి ఉన్నారు. సతీందర్ సర్తాజ్ ఇప్పటికే డిఫెండర్ కారును కలిగి ఉన్నప్పటికీ, కొత్త తరం డిఫెండర్ కారును కొనుగోలు చేశారు అంటే అతనికి ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీపై ఉన్న మక్కువ అర్థమవుతుంది.

MOST READ:ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్; ధర & వివరాలు

కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ కొన్న పంజాబీ సింగర్, ఎవరో తెలుసా?

ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ ఎల్‌ఇ, హెచ్‌ఎస్‌ఇ, ఎక్స్-డైనమిక్ హెచ్‌ఎస్‌ఇ మరియు ఎక్స్ మోడళ్లలో లభిస్తుంది. యాక్ససరీస్ మరియు ఫీచర్స్ కారణంగా వీటి డిజైన్స్ కొంత డిఫరెంట్ గా ఉంటాయి. అయినప్పటికీ ఇవి మంచి ఆఫ్ రోడ్ సామర్త్యాన్ని కలిగి ఉంటాయి.

కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ కొన్న పంజాబీ సింగర్, ఎవరో తెలుసా?

డిఫెండర్ ఎస్‌యూవీని పెట్రోల్, డీజిల్ అనే రెండు ఇంజన్ ఆప్షన్లలో విక్రయిస్తున్నారు. అంతే కాకుండా ఈ డిఫెండర్ ఎస్‌యూవీ 3-డోర్ మరియు 5-డోర్ వెర్షన్లలో లభిస్తుంది. ల్యాండ్ రోవర్ కొత్త ఇంజన్ ఆప్షన్‌తో డిఫెండర్ ఎస్‌యూవీని భారత్‌లో విడుదల చేసింది.

MOST READ:ఒంటరిగా కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు మాస్క్ అవసరమా? లేదా?.. హైకోర్టు క్లారిటీ

కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ కొన్న పంజాబీ సింగర్, ఎవరో తెలుసా?

డిఫెండర్ ఎస్‌యూవీలో 6 సిలిండర్ల టర్బో పెట్రోల్, 6 సిలిండర్ల టర్బో డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. ఇందులో ఉన్న పెట్రోల్ ఇంజన్ 400 బిహెచ్‌పి మరియు 550 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగా, డీజిల్ ఇంజన్ 300 బిహెచ్‌పి మరియు 650 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ కొన్న పంజాబీ సింగర్, ఎవరో తెలుసా?

భారతదేశంలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీకి ఎక్కువ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఈ ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ ధర దేశీయ మార్కెట్లో రూ. 90 లక్షల నుంచి రూ. 1.08 కోట్ల వరకు ఉంది. అదేవిధంగా డిఫెండర్ 110 ధర రూ. 97.03 లక్షల నుంచి రూ. 1.08 కోట్ల వరకు ఉంది.

MOST READ:ఓటువేయడానికి సైకిల్‌పై వచ్చిన ఇలయదలపతి విజయ్.. కారణం ఏమిటంటే?

కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ కొన్న పంజాబీ సింగర్, ఎవరో తెలుసా?

ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటంతో పాటు చాలా లగ్జరీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. దీనితో పాటు మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇందులో ఉంటాయి. అంతే కాకుండా ఇది ఎటువంటి రోడ్డులో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా తయారుచేయబడింది. ఇవన్నీ ఉండటం వల్ల ఎక్కువమందిని ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ ఆకర్షిస్తుంది.

Most Read Articles

English summary
Punjabi Singer Satinder Sartaaj Buys New Land Rover Defender SUV. Read in Telugu.
Story first published: Wednesday, April 7, 2021, 17:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X