నరేంద్ర మోదీ ప్రారభించునున్న 'పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌-వే': ప్రయాణం ఇప్పుడు మరింత సుగమనం

ఒక దేశం యొక్క అభివృద్ధికి ఆ దేశంలోని రోడ్లు ప్రధాన పాత్రను పోషిస్తాయి. కావున మనం దేశంలో కూడా రోడ్డు వ్యవస్థ రోజురోజుకి చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగానే లక్నో నుండి ఘాజీపూర్ వరకు 341 కి.మీ పొడవైన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే (Purvanchal Expressway) 2021 నవంబర్ 16 నుండి ప్రజల కోసం తెరవబడుతుంది. సుల్తాన్‌పూర్‌లోని కుదేభార్‌లోని ఎయిర్‌స్ట్రిప్ నుండి మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ ఎక్స్‌ప్రెస్‌వేను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

నరేంద్ర మోదీ ప్రారభించునున్న పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌-వే: ప్రయాణం ఇప్పుడు మరింత సుగమనం

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం మొత్తం 22,500 కోట్ల రూపాయల వ్యయంతో జరిగింది. ఈ కొత్త ఎక్స్‌ప్రెస్‌వే ఘాజీపూర్ న్యూఢిల్లీ నుండి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో మధ్య ప్రయాణ సమయాన్ని సుమారు 3.50 గంటలు తగ్గిస్తుంది. ఇది ప్రయాణికులకు చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. కావున ఇది ప్రయాణికులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

నరేంద్ర మోదీ ప్రారభించునున్న పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌-వే: ప్రయాణం ఇప్పుడు మరింత సుగమనం

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే అనేది ఉత్తర ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించే అనేక హై-స్పీడ్ ఎక్స్‌ప్రెస్‌వేలకు లేటెస్ట్ వెర్షన్. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికే ప్రధాన హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్‌వేలు అయిన యమునా ఎక్స్‌ప్రెస్ వే, ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వే, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ వే, ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ వే అలాగే రాబోయే గంగా ఎక్స్‌ప్రెస్ వే వంటివి కూడా ఉన్నాయి.

నరేంద్ర మోదీ ప్రారభించునున్న పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌-వే: ప్రయాణం ఇప్పుడు మరింత సుగమనం

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే కేవలం వాహన వినియోగదారులకు మాత్రమే కాకుండా, ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే వంటి భారత వైమానిక దళ విమానాలకు ఎమర్జెన్సీ రన్‌వేగా కూడా ఉపయోగించబడుతుంది. సుల్తాన్‌పూర్‌కు సమీపంలో ఉన్న ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై 3.3 కి.మీ పొడవైన ఎయిర్ స్ట్రిప్ కూడా నిర్మించబడింది, ఇది భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్‌లను అత్యవసర పరిస్థితుల్లో ఎయిర్‌స్ట్రిప్‌గా ఉపయోగించడానికి అనుమతిస్తుంది. కావున ఈ ఆధునిక ఎక్స్‌ప్రెస్‌వే అన్ని విధాలుగా చాలా అనుకూలంగా ఉంటుంది.

నరేంద్ర మోదీ ప్రారభించునున్న పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌-వే: ప్రయాణం ఇప్పుడు మరింత సుగమనం

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌ వే ను ఉపయోగించే ప్రయాణికులు మొదట్లో ఎలాంటి టోల్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా ప్రభుత్వం ఏటా రూ. 202 కోట్లను టోల్ ట్యాక్స్‌గా వసూలు చేస్తుంది. ప్రతి కిలోమీటరుకు టోల్ రేటు మరియు రెండు చివర్లలోని టోల్ ప్లాజాల నుండి తరలింపుపై టోల్ టాక్స్ వంటివి విధించబడుతుంది. అయితే ఈ ఎక్స్‌ప్రెస్‌వే లో టోల్ చార్జీలు లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే ధరల మాదిరిగానే ఉంటాయని భావిస్తున్నారు.

నరేంద్ర మోదీ ప్రారభించునున్న పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌-వే: ప్రయాణం ఇప్పుడు మరింత సుగమనం

ప్రస్తుతం కొత్తగా నిర్మిస్తున్న ఈ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌ వే ద్వారా రోజూ 15 నుంచి 20 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఈ సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం ఉంటుంది. తూర్పు ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ నుండి వచ్చే ప్రజలు ఢిల్లీ నోయిడాకు వెళ్లడానికి ఈ ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు లక్నో ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే మరియు యమునా ఎక్స్‌ప్రెస్‌వేలను ఉపయోగించాలని సంబంధింత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

నరేంద్ర మోదీ ప్రారభించునున్న పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌-వే: ప్రయాణం ఇప్పుడు మరింత సుగమనం

ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు అనుకూలంగా ఉండటమే కాకుండా వారి ప్రయాణ సమయాన్ని కూడా బాగా తగ్గిస్తుంది.అంతే కాకుండా ప్రభుత్వ ఆదాయం కూడా భారీగా పెరుగుతుంది. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది జిల్లాల గుండా వెళుతుంది. వీటిలో లక్నో, సుల్తాన్‌పూర్, ఫైజాబాద్, అంబేద్కర్ నగర్, అజంగఢ్, బారాబంకి, అమేథి, మౌ మరియు ఘాజీపూర్ ఉన్నాయి.

నరేంద్ర మోదీ ప్రారభించునున్న పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌-వే: ప్రయాణం ఇప్పుడు మరింత సుగమనం

ఈ కొత్త పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే ను తరువాత దశలో బల్లియా వరకు విస్తరించే అవకాశం కూడా ఉంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే వారణాసి, అయోధ్య, గోరఖ్‌పూర్ మరియు అలహాబాద్ వంటి ముఖ్యమైన నగరాలను లింక్ రోడ్‌ల ద్వారా కలుపుతుంది. కావున ఆ ప్రాంతాల్లోని ప్రయాణికులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

నరేంద్ర మోదీ ప్రారభించునున్న పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌-వే: ప్రయాణం ఇప్పుడు మరింత సుగమనం

341 కిలోమీటర్ల పొడవైన ఈ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే పై ప్రయాణికుల భద్రత కోసం చాలా పటిష్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఇందులో భాగంగానే దీని కోసం లేటెస్ట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను కూడా అమలులోకి తెచ్చారు. ఎక్స్‌ప్రెస్‌వేపైకి జంతువులు రాకుండా రోడ్డుకు ఇరువైపులా ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. ఇది కాకుండా, విచ్చలవిడి జంతువులను పట్టుకోవడానికి ఎక్స్‌ప్రెస్‌లో అనేక బృందాలను మోహరించారు. కావున ఇవన్నీ కూడా ప్రమాదాలను నిలువరించడానికి ఉపయోగపడతాయి. జంతువులు రోడ్లుపైకి రాకుండా చూడటానికి ఉన్న ప్రత్యేక బృందాలు కూడా చాలా వరకు పరమాదాలను నిలువరిస్తారు.

నరేంద్ర మోదీ ప్రారభించునున్న పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌-వే: ప్రయాణం ఇప్పుడు మరింత సుగమనం

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే పైన ప్రమాదం జరిగినప్పుడు లైఫ్ సపోర్టు సిస్టమ్‌తో కూడిన రెండు అంబులెన్స్‌లు అందుబాటులో ఉంటాయి. అంతే కాకూండా సైనిక్ వెల్ఫేర్ బోర్డు భద్రతా సిబ్బంది కూడా అందుబాటులోనే ఉంటారు. క్రాష్ బారియర్లు ఉన్న 20 పెట్రోలింగ్ వాహనాలను కూడా ఎక్స్‌ప్రెస్‌వేపై మోహరించారు. ఇయన్నీ కూడా ప్రమాదం జరిగినప్పుడు బాధితులను రక్షించడానికి ఉపయోగపడతాయి. కావున ఈ ఎక్స్‌ప్రెస్‌వే అన్ని విధాలుగా చాలా అనుకూలంగా ఉంటుంది.

Most Read Articles

English summary
Purvanchal expressway to be inaugurated on november 16th by pm narendra modi
Story first published: Tuesday, November 16, 2021, 12:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X