పుష్పరాజ్.. నీ యవ్వ అస్సలు తగ్గేదేలే.. కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లు.. సొంత ఛార్టెడ్ ఫ్లైట్..

ప్రస్తుతం దేశంలో అందరికీ పుష్ప ఫీవర్ వచ్చింది. తాజాగా ఈ రోజు విడుదలైన పుష్ప-2(Pushpa 2: The Rule) కలెక్షన్లలో దుమ్మురేపుతుంది. ఎక్కడ చూసినా కూడా అందరూ అల్లు అర్జున్ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. పుష్ప-1 ఎంత పెద్ద రేంజ్‌లో హిట్ అయిందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో నటనకు గాను హీరో ఏకంగా జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు సైతం గెలుచుకున్నారు. ఇప్పుడు పుష్ప మొదటి పార్ట్‌కు కొనసాగింపుగా రెండో పార్ట్ సైతం ఓ రేంజ్‌లో ఉండటంతో సినిమా బ్లాక్ బ్లస్టర్ హిట్‌గా నిలిచింది. థియేటర్లలో సినిమా చూడటానికి జనం ఎగబడుతున్నారు. టికెట్ ధర ఎంత ఉన్న కూడా వెనుకాడటం లేదు. ఇప్పటికే జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ఈ కొత్త సినిమా హిట్‌తో మరింత ఎత్తుకు ఎదిగారు.

ఇదిలా ఉంటే పుష్ప-2 పెద్ద హిట్ సాధించడంతో ఈ సినిమా హీరో అల్లు అర్జున్ లైఫ్‌స్టైల్ గురించి చాలా మంది ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారు. ఆయన కుటుంబం అంతా కూడా సినిమా బ్యాక్‌గ్రౌండ్‌కు చెందిన వారు అయినప్పటికీ ఒక మధ్యతరగతి వ్యక్తిగా పెరిగినట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే ఈ హీరో క్రమంగా సినిమాల మీద సినిమాలు చేస్తూ పెద్ద స్థార్‌గా ఇప్పుడు ఎదిగారు.

Pushpa Hero Allu Arjun Cars Collection

ఇప్పుడు ఆయన ఒక పెద్ద సెలబ్రిటీ, లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్‌కు కార్లు అంటే చాలా ఇష్టం. ప్రధానంగా లగ్జరీ కార్లంటే మరింత ఎక్కువ ఇష్టం. మార్కెట్లోకి ఏదైనా కొత్త మోడల్ విడుదల అయిందంటే తన గ్యారేజీలో పెట్టుకోవడానికి చూస్తారు. ఆయనకు మొట్టమొదటి కారును 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన తండ్రి కొనిచ్చారు.

కార్లపై ఇష్టంతో కారును కొనివ్వమని అడగ్గా, కొత్త కారు కాకుండా తన తండ్రి ఇతరులు వాడిన పాత కారును తనకు కొనిచ్చాడని ఇటీవల ఇంటర్వూలో అల్లు అర్జున్ పేర్కొన్నాడు. తన తండ్రి కొనిచ్చిన కారు నుంచి సొంతంగా తన డబ్బులతో టాప్ బ్రాండ్‌లకు చెందిన లగ్జరీ కార్లను కొనుక్కునే రేంజ్‌కు ఆయన ఎదిగారు. ఇప్పుడు ఆయన వద్ద కొన్ని కోట్లు విలువ చేసే కార్లు ఉన్నాయి.

Allu Arjun Luxury Cars Collection

వైవిధ్యమైన సినిమాలతో పాన్ ఇండియా రేంజ్‌లో దూసుకుపోతున్నఅల్లు అర్జున్ గ్యారేజీలో విలాసవంతమైన లగ్జరీ జాగ్వార్ XJ L ఉంది. దీని ధర దాదాపు రూ.99.5 లక్షలు ఉంటుంది. ఇది 5.0-లీటర్ V8 ఇంజిన్ ఆధారంగా శక్తిని పొందుతుంది. ఈ కారులో రోడ్డుపై వెళ్తుంటే అందరి చూపు కూడా దీనిపైనే ఉంటుంది. ఇంకా ఆయన రేంజ్ రోవర్‌లో వోగ్ వేరియంట్‌ను కలిగి ఉన్నారు. దీని ధర రూ.2 కోట్లకు పైనే ఉంటుంది.

వోల్వో కంపెనీకి చెందినటువంటి XC90 T8 ఎక్సలెన్స్ ఆయన గ్యారేజీలో ఉంది. ఇది నాలుగు-సీట్లను కలిగిన లగ్జరీ SUV. దీని ధర రూ.1.31 కోట్ల వరకు ఉంది. ఈ కారు 2.0-లీటర్ 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. లోపల అధునాతన ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌లు,బ్యాక్ సేఫ్టీ బెల్ట్‌లు, చైల్డ్ సేఫ్టీ లాక్, సేఫ్టీ బెల్ట్ అలర్ట్, యాంటీ-థెఫ్ట్ అలారం వంటివి ఉన్నాయి.

Pushpa Hero Allu Arjun Rolls Royce

అలాగే, అల్లు అర్జున్ తన సినిమా షూటింగ్‌ల కోసం ప్రత్యేకంగా ఫాల్కన్ అనే పేరు గల వానిటీ వ్యాన్‌ను కూడా కలిగి ఉన్నారు. దీని ధర రూ.7 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. హీరో తన అవసరాలకు అనుగుణంగా దీన్ని ప్రత్యేకంగా రూపొందించుకున్నారు. ఇంకా జర్మనీ లగ్జరీ కారు మెర్సిడెస్ GLE 350d కూడా ఆయన వద్ద ఉంది. దీని ధర రూ.75 లక్షలు.

అలాగే, 92.2 లక్షల విలువైన BMW X6 M స్పోర్ట్ కారు కూడా ఉంది. ప్రసిద్ధ మోడల్ బ్లాక్ కలర్ హమ్మర్ H2 కూడా అల్లు అర్జున్ దగ్గర ఉన్న మరో తోపు కారు. ఇది గంటకు 190 కి.మీల వేగంతో రయ్ మంటూ దూసుకుపోతుంది. దీని ధర రూ. 75 లక్షల వరకు ఉంటుంది.

వీటితో పాటు రోల్స్ రాయిస్ కల్లినన్ కూడా ఉంది. దీని ధర రూ.6.95 కోట్ల వరకు ఉంటుంది. ఇంకా మరిన్ని కార్లు కూడా ఆయన వద్ద ఉన్నట్లు సమాచారం. మరి ముఖ్యంగా అల్లు అర్జున్ వద్ద విలాసవంతమైన ప్రైవేట్ జెట్ కూడా ఉంది. దీనిలో చాలా సార్లు తన కుటుంబంతో కలిసి ప్రయాణించారు. దీని ధర రూ.80 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, December 5, 2024, 14:25 [IST]
English summary
Pushpa hero allu arjun luxury cars collection details check here
Read more on: #offbeat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+