కదులుతున్న హ్యుందాయ్‌ క్రెటా వాహనంపై పుష్‌ అప్‌లు.. అది కూడా డ్రైవర్‌ లేకుండా..!

ప్రస్తుతం జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే సోషల్ మీడియా యుగం నడుస్తోందని తప్పక అనిపిస్తుంది. సోషల్‌ మీడియా క్రేజ్‌ కారణంగా పబ్లిక్‌ రోడ్లపై విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఫలితంగా కొన్నిసార్లు ప్రమాదాల బారిన పడుతున్నారు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కొందరి ప్రవర్తనలో ఎటువంటి మార్పులు రావడం లేదు.

తాజాగా సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అవుతుంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి కదులుతున్న హ్యుందాయ్‌ క్రెటా రూఫ్‌పైన పుష్‌ అప్‌లు చేస్తున్నాడు. ఆ సమయంలో కారు డ్రైవింగ్‌ సీట్లో ఎవరూ లేకపోవడం గమనార్హం. ఈ వీడియోను సోషల్‌ మీడియోలో ఓ వ్యక్తి షేర్‌ చేశారు.

Push ups on moving driverless hyundai creta Car

ఎవరూలేని రోడ్డుపై నెమ్మదిగా కదులుతున్న హ్యుందాయ్‌ క్రెటా డ్రైవింగ్‌ సీట్‌ నుంచి ఓ వ్యక్తి బయటకు వచ్చాడు. అనంతరం తన శరీరంపై ఉన్న దుస్తులు తీసి కారు వెనుక భాగం నుంచి రూఫ్‌పైకి చేరుకోవడం మనం ఈ వీడియోలో గుర్తించవచ్చు. అనంతరం డ్రైవర్‌ లేకుండా ముందుకు కదులుతున్న వాహనంపైకి ఎక్కి పుష్‌ అప్‌లు తీయడం సహా ప్రమాదకర విన్యాసాలు చేయడాన్ని గుర్తించవచ్చు.

అలా కారు రూఫ్‌పైన కొద్దిసేపు ప్రమాదకర విన్యాసాలు చేసి.. అక్కడ నుంచి నేరుగా రోడ్డుపైకి దూకాడు. ఆ సమయంలో ఆ వ్యక్తి బ్యాలెన్స్ కోల్పోవడం మనం గుర్తించవచ్చు. అనంతరం డ్రైవింగ్ సీట్లోకి ప్రవేశించాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే వీడియో ఎప్పుడు జరిగిందనే సమాచారం లేదు.

Pushups on moving car

అయితే ఫిట్‌గా ఉండడం మంచిదే కానీ.. పబ్లిక్‌ రోడ్లపై ఇటువంటి విన్యాసాలు చాలా ప్రమాదకరం. హ్యుందాయ్‌ క్రెటా ప్రయాణిస్తున్న రోడ్డుపై ఆ సమయంలో ఎటువంటి వాహనాల రాకపోకలు లేవు కాబట్టి ఎటువంటి ప్రమాదం జరగలేదు. దాంతోపాటు వాహనంలో డ్రైవర్‌ సీట్లో ఎవరూ లేరు. అనుకోని పరిస్థితులు ఎదురైతే వాహనం నియంత్రిణ కోల్పోయి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.

సోషల్‌ మీడియా క్రేజీ కారణంగా చాలామంది ఇటువంటి ప్రమాదకర విన్యాసాలకు పాల్పడుతున్నారు. కదులుతున్న వాహనంపై నిల్చొని విన్యాసాలు చేయడం వల్ల బ్యాలెన్స్ కోల్పోతే.. నేరుగా రోడ్డుపై పడే అవకాశం ఉంటుంది. ఫలితంగా తీవ్ర గాయాలపాలయ్యే అవకాశం ఉంది. ఇలాంటి విన్యాసాలు పబ్లి్క్‌ రోడ్లపై చేయడం వల్ల ప్రమాదాలకు కారణం కావచ్చు.

Dangerous stunts driverless hyundai creta

ఇలాంటి వీడియోలకు ఆకర్షితులై మరికొంత మంది ఇదే విధంగా ప్రయత్నం చేయవచ్చు. ఫలితంగా వారి జీవితాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇలాంటి ఘటనలకు ఎవరూ అవకాశం ఇవ్వకూడదు. ప్రతిఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలి. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే సమాచారం లేదు. మరియు ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్లిందా లేదా అనేది తెలియలేదు.

గతంలోనూ ఇటువంటి ఘటనలు జరిగాయి. పబ్లిక్‌ రోడ్లపై కదులుతున్న వాహనాలపై నిల్చొని ప్రమాదకర ప్రయాణాలు చేసిన సంఘటనలు అనేక ఉన్నాయి. అలాగే రీల్స్‌ కోసం రోడ్లను రేసింగ్‌ ట్రాక్‌లుగా మార్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే వారిలో చాలా మందిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. జరిమానా కూడా విధించిన ఘటనలున్నాయి.

Pushups on moving hyundai creta

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Saturday, October 7, 2023, 16:18 [IST]
English summary
Pushups on moving hyundai creta car man dangerous stunts video goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+